మనుషులను మృతదేహాలుగా మార్చి.. వారి ఎముకలతో వ్యాపారం

Written By:
Subscribe to Boldsky

వృద్ధాశ్రమం ముసుగులో వారి శవాలతో దందా చేశారు కొందరు నీచులు. వృద్ధాశ్రమంలో చనిపోయిన వారి మృతదేహాలను కుళ్లబెట్టి, బాగా ఎండిన తరువాత ఎముకలను విదేశాలకు అమ్ముకుంది ఓ సంస్థ.

వృద్ధులను ఎంచుకొని చంపి మరీ ఈ సంస్థ శవ వ్యాపారం చేసింది. కొన్ని రోజుల క్రితం ఒక కూరగాయల వ్యాన్‌లో ఈ వృద్ధాశ్రమ నిర్వాహకులు మృతదేహంతో, ఇద్దరు వృద్ధులను కూడా తరలించి చంపాలనుకున్నారు. ఆ బతికున్న ఇద్దరు వృద్ధులను స్థానికులు కాపాడారు.

అసలు కథ ఇది.. తమిళనాడు కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో 19 ఎకరాల విస్తీర్ణంలో విదేశీ నిధులతో సెయింట్‌ జోసెఫ్‌ కరుణై ఇల్లమ్‌ పేరిట వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.

చాలా అనుమానాలు

చాలా అనుమానాలు

నిరాశ్రయులైన వృద్ధులు, మహిళలు, మతిస్థిమితం కోల్పోయినవారు సుమారు 300 మందికిపైగా ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ వృద్ధాశ్రమంపై గతంలో కూడా చాలా మందికి అనుమానాలు వచ్చాయి. వృద్ధాశ్రమం వెనుక భాగంలో విపరీతంగా దుర్వాసన వస్తుందని గతంలో కూడా చాలామంది ఫిర్యాదు చేశారు.

పాలేశ్వరం ఆశ్రమానికి

పాలేశ్వరం ఆశ్రమానికి

ఈ నేపథ్యంలో చెన్నైలోని తాంబరంలోని ఇరుంబులియూరులోని వృద్ధాశ్రమానికి చెందిన విజయకుమార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విజయకుమార్‌ మృతదేహంతో పాటు సెల్వరాజ్‌, అన్నమ్మాళ్‌ అనే ఇద్దరు వృద్ధులను వృద్ధాశ్రమం నుంచి కాయగూరల వ్యాన్‌లో పాలేశ్వరం ఆశ్రమానికి తరలించడానికి ప్రయత్నించారు.

కాపాడండి

కాపాడండి

అయితే తిరుముక్కూడల్‌ రహదారి వద్దకు వ్యాన్‌ చేరుకోగానే అందులో ఉన్న అన్నమ్మాళ్‌ కాపాడండి అంటూ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు చుట్టుముట్టి వ్యాన్‌ ను నిలిపివేశారు. వ్యాన్ తలుపులు తెరచి చూడగా, కూరగాయల బస్తాలు, గుడ్డతో చుట్టి ఉన్న విజయకుమార్‌ మృతదేహం కనిపించింది. సెల్వరాజ్‌, అన్నమ్మాళ్‌లను స్థానికులుకాపాడారు.

ప్రాణాలు పోతాయి

ప్రాణాలు పోతాయి

తమ ఇద్దరినీ పాలేశ్వరం వృద్ధాశ్రమానికి అక్రమంగా తరలిస్తున్నారిని.. అక్కడికి వెళితే తమ ప్రాణాలు పోతాయని అన్నమ్మాళ్‌ వాపోయింది. దీంతో ఆ వ్యాన్‌ను నిర్బంధించి డ్రైవర్‌ రాజేశ్‌ను పోలీసులకు అప్పగించారు. తర్వాత అన్నమ్మాళ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెలకు 40 శవాలు

నెలకు 40 శవాలు

కరుణై ఇల్లంలో నెలకు కనీసం 40 మంది చనిపోయారు. ఆ ఆశ్రమానికి చేరిన వారి సంఖ్యకు, అందులో ప్రస్తుతం వున్న సంఖ్యకు పొంతనే లేదు. ఆశ్రమంలో మృతిచెందిన వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా ఆ ఆశ్రమం వెనుక 20 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగిన తొట్టెలాంటి గదిలో పేర్చిపెట్టేవారు.

ఎముకలు విదేశాలకు ఎగుమతి

ఎముకలు విదేశాలకు ఎగుమతి

ఆ శవాలు బాగా కుళ్లిపోయిన తరువాత మాంసపు భాగాలు ఆ గది దిగువనున్న గోతిలో పడిపోతాయి. ఆ తర్వాత ఎముకల గూళ్లను ఆశ్రమ నిర్వాహకులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

తమిళనాడు అంతటా

తమిళనాడు అంతటా

సెయింట్‌ జోసెఫ్‌ హోస్పీస్‌ సంస్థ ఆధ్వర్యంలో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలున్నాయి. దిండుగల్‌, వేలూరు, దిండుగల్‌ ప్రాంతాల్లో కూడా వృద్ధాశ్రమాలనూ నడుపుతున్నారు. అయితే ఈ వృద్ధాశ్రమాల్లో స్థానికులను చేర్చుకోరు. ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు చెందినవారికి మాత్రమే ఆశ్రయం ఇస్తున్నారు.

అలాగే ఖననం చేస్తారట

అలాగే ఖననం చేస్తారట

ఇక వృద్ధాశ్రమం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న సెయింట్‌ జోసఫ్‌ కరుణై ఇల్లం నిర్వాహకుడు ఫాదర్‌ థామస్‌ అడ్డగోలు తాము చనిపోయిన వారిని అలాగే ఖననం చేస్తామంటూ చెబుతున్నాడు. అసలు గుట్టు రట్టవ్వడంతో ఏం చేయాలో పాలుపోక పొంతన లేకుండా మాట్లాడారు. తాము మృతదేహాలకు కొత్త పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామంటూ బుకాయించేందుకు ప్రయత్నించారు.

ప్రభుత్వ అనుమతితో నడుపుతున్నాం

ప్రభుత్వ అనుమతితో నడుపుతున్నాం

తాము ప్రభుత్వ అనుమతితోనే ఆశ్రమం నడుపుతున్నామన్నారు నిర్వాహకుడు ఫాదర్‌ థామస్‌. ఆశ్రమంలో అనారోగ్యం కారణంగా మృతి చెందేవారిని ఖననం, దహనం చేయకుండా కొత్తపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నాడు. తమ ఆశ్రమంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాడు నిర్వాహకుడు ఫాదర్‌ థామస్‌.

సెల్వరాజ్‌ కాదు.. సుబ్బారావు

సెల్వరాజ్‌ కాదు.. సుబ్బారావు

అయితే స్థానికులు కాపాడిన వృద్ధుడి పేరు సెల్వరాజ్‌ అని అంతా భావించారు. అయితే అతని పేరు సెల్వరాజ్‌ కాదు, సుబ్బారావు అంటూ గుంటూరులోని ఓ కుటుంబం పేర్కొంది.

మతిస్థిమితం లేక

మతిస్థిమితం లేక

మతిస్థిమితం లేక సుబ్బారావు ఆరునెలల క్రితం ఇల్లు వదిలిపెట్టి పోయాడని.. ఇన్నాళ్లకు అతని గురించి వింటున్నామని వారు వాపోయారు. దీంతో.. కాంచీపురం జిల్లా పాలేశ్వరం వృద్ధాశ్రమంలో నిర్వాహకుల కంబంధహస్తాల్లో చిక్కుకున్న వృద్ధుడు ఎవరో కాదు, సుబ్బారావేననేది నిర్ధారణ అయింది. .

రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించేవాడు

రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించేవాడు

కాంచీపురం వృద్ధాశ్రమంలో స్థానికులను చేర్చుకోరు. బయట ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వృద్ధులకు మాత్రమే ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. దీని కారణంగానే గుంటూరుకు చెందిన రెడ్డి సుబ్బారావుకు బహుశా ఇక్కడ ఆశ్రమం దొరికి ఉంటుందని భావిస్తున్నారు. గుంటూరు నగరంలోని పిచ్చికులగుంటలో నివశించే రెడ్డి సుబ్బారావుకి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిక్షా తొక్కి, కుటుంబాన్ని సుబ్బారావు పోషించేవాడు.

ఆరు నెలల క్రితం ఇల్లు వదిలాడు

ఆరు నెలల క్రితం ఇల్లు వదిలాడు

కొద్దికాలం క్రితం ఆయనకు మతి స్థిమితం తప్పింది. అప్పటినుంచి చిన్న కుమార్తె మహాలక్ష్మి దగ్గర ఉంటున్నాడు. ఆరునెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీనిపై చిన్న కుమార్తె మహాలక్ష్మీ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో నుంచే వెళ్లేటప్పుడు ఏ లుంగీ ఉందో అదే లుంగీ అతని వంటిపై ఉండటంతో సులువుగా గుర్తించామని వారు తెలిపారు.

English summary

tamil nadu christian ngo accused of harvesting bones and organs of the elderly

tamil nadu christian ngo accused of harvesting bones and organs of the elderly
Story first published: Tuesday, February 27, 2018, 11:30 [IST]