అతను కోడిలాగానే గుడ్లు పెడుతున్నాడు.. డాక్టర్ల ఎదుటే రెండు గుడ్లు పెట్టాడు

Written By:
Subscribe to Boldsky

కోడి గుడ్డు పెట్టడం అంటే కామన్.. కానీ మనిషి గుడ్లు పెట్టడం అంటే కాస్త విచిత్రమే కానీ ఆ మనిషి గుడ్లు పెడుతున్నాడు. వరుసగా గుడ్ల మీద గుడ్లు పెడుతున్నాడట. ఈ వింతను చూసి అందరూ షాకవుతున్నారు. పసుపు, తెలుపు రంగులో ఆయన గుడ్లు పెడుతున్నాడంట.

గోవ ప్రాంతంలో

గోవ ప్రాంతంలో

ఇండోనేషియా దేశం గోవ ప్రాంతంలో నివాసం ఉంటాడు అక్మల్. ఇతడి వయస్సు 14 సంవత్సరాలు. 2016 నుంచి ఇప్పటి 20 గుడ్లుపైగా పెట్టాడంట. ఈ విషయం అక్మల్ తండ్రే స్వయంగా చెబుతున్నాడు.

డాక్టర్లు కూడా షాక్

డాక్టర్లు కూడా షాక్

అక్మల్ తండ్రి దీనిపై ఆందోళన చెందుతూ డాక్టర్లను తరుచూ సంప్రదించేవాడు. డాక్టర్లు దీన్ని నమ్మేవాళ్లు కాదు. అయితే ఈసారి మాత్రం.. డాక్టర్లను నుంచోబెట్టి.. వాళ్ల కళ్ల ముందే తన బిడ్డ.. గుడ్లు పెట్టడాన్ని చూపించాడు. అక్మల్ గుడ్లు పెట్టడం చూసి డాక్టర్లు కూడా షాక్ తిన్నారు.

బెడ్ పైనే గుడ్డు పెట్టాడు

బెడ్ పైనే గుడ్డు పెట్టాడు

ఆస్పత్రి బెడ్ పై పడుకుని ఉన్న ఆక్మల్ నుంచి బయటకు వచ్చిన గుడ్డు వీడియోను కూడా చూపిస్తున్నారు. ఇప్పటికీ ఆక్మల్ ను ఆస్పత్రిలోనే ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు.

గుడ్లు మింగేసి ఉంటాడని...

గుడ్లు మింగేసి ఉంటాడని...

డాక్టర్లు అక్మల్‌కు అన్ని రకాల పరీక్షలు చేశారు. అయినా అసలు కారణం ఏమిటో కనిపెట్టలేకపోయారు. అక్మల్ గుడ్లు మింగేసి ఉంటాడని అవే బయటకు వస్తున్నాయనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటిదేమి లేదు

అలాంటిదేమి లేదు

అయితే అక్మల్ తండ్రి మాత్రం అలాంటిదేమీ లేదని తన కొడుకు నిజంగానే గుడ్లు పెడుతున్నాడని చెబుతున్నాడు. దీంతో కొందరు డాక్టర్లు అక్మల్ పై రీసెర్చ్ మొదలు పెట్టారట.

పురీషనాళంలో అండం

పురీషనాళంలో అండం

అయితే దీనిపై డాక్టర్ల స్పందన మరోలా ఉంది. ఎక్స్ రేని పరిశీలించిన డాక్టర్లు.. "అతని పురీషనాళంలో అండం ఉండటాన్ని గమనించాం. అయితే ఇది నమ్మశక్యంగా లేదు. వైద్య పరీక్షలు చేస్తే కానీ... పూర్తి విషయాలు చెప్పలేం" అన్నారు. మనిషి గుడ్డు పెట్టడం అనేది జరిగే పని కాదంటున్నారు.

అన్ని గుడ్లు మింగుతాడా

అన్ని గుడ్లు మింగుతాడా

డాక్టర్ల వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పిల్లవాడికి ఏమైందో చూడకుండా.. గుడ్లు పెట్టడం సాధ్యం కాదని కొట్టిపడేయడం ఏంటని అంటున్నారు. ఒకేసారి అన్ని గుడ్లు ఎవరైనా మింగేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేకంగా చికిత్స

ప్రత్యేకంగా చికిత్స

అక్మల్ గుడ్డు పెడుతున్న విషయంలో అంతర్జాతీయ పత్రికల్లో రావటంతో చర్చనీయాంశం అయ్యింది. గోవ పట్టణంలోని సైక్ యూసఫ్ ఆస్పత్రి ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించి మరీ అక్మల్ కు చికిత్స అందించింది.

పగలగొట్టి చూస్తూ

పగలగొట్టి చూస్తూ

అక్మల్ పెట్టిన కొన్ని గుడ్లను పగలకొట్టి చూస్తే వాటి లోపల అంతా వైట్ గా ఉందని అక్మల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తంగా యువకుడు గుడ్ల విషయం మాత్రం బీభత్సం అయిపోయింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో అనేది డాక్లర్లే తేల్చాలి.

ఉచఅక్మల్ పెట్టిన కొన్ని గుడ్లను పగలకొట్టి చూస్తే వాటి లోపల అంతా వైట్ గా ఉందని అక్మల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తంగా యువకుడు గుడ్ల విషయం మాత్రం బీభత్సం అయిపోయింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో అనేది డాక్లర్లే తేల్చాలి.

English summary

teenage indonesian boy claims he laid 20 eggs in two years doctors skeptical

teenage indonesian boy claims he laid 20 eggs in two years doctors skeptical
Story first published: Monday, February 26, 2018, 9:30 [IST]