వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను.. వక్షోజాల పరిమాణం బట్టీ పన్ను

Written By:
Subscribe to Boldsky

చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి. అప్పట్లో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. 18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించారు. ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు. ఈ పన్ను చాలా దారుణంగా ఉండేది. ఈ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.

మార్తాండ వర్మ

మార్తాండ వర్మ

అవి కేరళను ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ పరిపాలిస్తున్న రోజులు. మార్తాండవర్మ వక్షోజాలపై పన్ను(ముళకరం)తో పాటు తలక్కారం అనే పన్ను కూడా విధించారు అంటే గడ్డాలు, మీసాలపై కూడా రాజు పన్ను విధించారు. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా అప్పట్లో పన్ను కట్టాల్సిందే.

Image Source

నాంగేలి దంపతులు

నాంగేలి దంపతులు

ట్రావెన్కోర్ రాజ్యం లోని అలపుళా జిల్లా, చేర్తాల (చేరితాలా) గ్రామంలో కండప్పన్, నాంగేలి దంపతులు ఉండేవారు. వారు వ్యవసాయం చేసుకుని బతికేవారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం వీరిది.

Image Source

ఉన్నత వర్గాల వారు మాత్రమే

ఉన్నత వర్గాల వారు మాత్రమే

ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. సమాజంలో రాయల్టీ ఉన్న మహిళలు మాత్రమే వక్షోజాలను దాచుకోవచ్చు. దళిత , గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. బ్రాహ్మణ కుటుంబంతో పాటు కొన్ని అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది. ఇది రాజు ఆజ్ఞ.

Image Source

వక్షోజాలపై ఎలాంటి వస్త్రం ధరించకూడదు

వక్షోజాలపై ఎలాంటి వస్త్రం ధరించకూడదు

రాజు ఆజ్ఞ ప్రకారం అప్పట్లో ట్రావెన్‌కోర్ రాజ్యంలోని దిగువ వర్గానికి చెందిన మహిళలంతా వక్షోజాలపై ఎలాంటి వస్త్రం ధరించకుండానే ఉండేవారు. వారు పొలంలో పని చేస్తున్నప్పుడు, గ్రామంలో తిరిగేటప్పుడు కూడా ఎలాంటి వస్త్రం ధరించేవారు కాదని ఆచారం ఉండేదట.

Image Source

రాజు అనుమతి తీసుకోవాలి

రాజు అనుమతి తీసుకోవాలి

ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు స్తనాలు కనపడకుండా వస్త్రాలు ధరించాలంటే కచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి. పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు. కచ్చితంగా పన్ను కట్టి ధరించాల్సిందే . అప్పటి కుల వివక్షతకు ఇదే నిదర్శనం.. ఇందులో మరింత అసహ్యకరమైన అంశం ఏమిటంటే రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుండేవట!

Image Source

నాంగేలికికి నచ్చలేదు

నాంగేలికికి నచ్చలేదు

అయితే రాజు నిబంధనలు నంగేళి కి నచ్చలేదు. ట్రావెన్ కోర్ రాజు ఆజ్ఞను నంగేళి దిక్కరించింది. అంతమకు ముందు ఆమె కూడా వక్షోజాలపై ఎలాంటి వస్త్రంధరించకుండానే పొలం పనులు చేసుకునేది. గ్రామంలో తిరిగేది. కానీ ఆమెకు అలా వక్షోజాలను అందరికీ చూపించుతూ తిరగడం చాలా అవమానకరంగా అనిపించింది.

Image Source

స్తనాలపై వస్త్రం ధరించింది

స్తనాలపై వస్త్రం ధరించింది

ఒకరోజు నంగేళి వక్షోజాలపై వస్త్రాన్ని ధరించింది. అలాగే పొలం పనులకు వెళ్లింది. ఆమె స్తనాలపై వస్త్రం ధరించిన విషయం ప్రజలందరికీ తెలిసిన కూడా ఆమె భయపడలేదు. రాజు చెప్పినట్లుగా పన్ను ఆమె కట్టలేదు.

Image Source

మార్తాండ్ వర్మకు తెలిసింది

మార్తాండ్ వర్మకు తెలిసింది

వక్షోజ పన్ను నేను కట్టను అని నిర్ణయించుకుంది. ఈ విషయం మహారాజు మార్తాండ్ వర్మకు తెలిసింది. నా ఆజ్ఞను నంగేళి అనే మహిళా దిక్కరిస్తుందా అని రాజుకు కోపం వచ్చింది. వెంటనే ప్రవతియార్ (టాక్స్ కలెక్టర్) ను పిలిపించాడు.

Image Source

పన్ను వసూలు చేయాలని బయల్దేరాడు

పన్ను వసూలు చేయాలని బయల్దేరాడు

ఏం చేస్తున్నారు మీరు.. ఆ నంగేళి నుంచి పన్ను వసూలు చేసుకురండి అని మందలించాడు. రాజు దగ్గర అవమానం చెందిన ప్రవతియార్ ఎలాగైనా నంగేళి నుంచి పన్ను వసూలు చేయాలని బయల్దేరాడు.

Image Source

నువ్వు ఎలా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరిస్తావు

నువ్వు ఎలా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరిస్తావు

నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లిన ప్రవతియార్, రాజు ఆదేశాలను నంగేళి కి చెప్పాడు. రాజు అనుమతి లేకుండా పన్ను కట్టకుండా నువ్వు ఎలా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరిస్తావు అంటూ ప్రవతియార్ మండిపడ్డాడు. వెంటనే పన్నుకట్లు అని నంగేలిని బెదిరించాడు.

వక్షోజాలను కొడవలితో కోసేసుకుంది

వక్షోజాలను కొడవలితో కోసేసుకుంది

అప్పటికే రాజు పెట్టిన ఈ ఆచారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి.. ప్రవతియార్ ఇంటికొచ్చి బెదిరించడం చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లిన నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసేసుకుంది. దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి.

భర్త కండప్పన్ చితిలోకి దూకాడు

భర్త కండప్పన్ చితిలోకి దూకాడు

నంగేలి వక్షోజాలను కోసుకుని వీర మరణం చెందిందనే విషయం ఆమె భర్త కండప్పన్ కు తెలియగానే ఆయన తట్టుకోలేకపోయాడు. మరుసటి దహన సంస్కారాలు ఏర్పాటు చేశారు. నంగేలిని దహనం చేస్తున్న సమయంలో భర్త కండప్పన్ ఆమె చితిలోకి దూకాడు. ఇది దేశంలో జరిగిన మొట్టమొదటి పతీ సహగమనం.

పన్నులను వెంటనే రద్దుచేశాడు

పన్నులను వెంటనే రద్దుచేశాడు

దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో నిరసలు మిన్నంటాయి. ట్రావెన్కోర్ రాజు ములక్కారం , తలక్కారం పన్నులను వెంటనే రద్దుచేశాడు . ఇప్పటికీ కేరళ చరిత్రలో నంగేలి దంపతులు నిలిచిపోయారు.

ములచ్చి పురంబు

ములచ్చి పురంబు

నంగేలి పేరుమీదుగానే ఆ గ్రామానికి "ములచ్చి పురంబు (రొమ్ము కోసిన మహిళ)" అనే పేరు వచ్చింది. నంగేలి మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారట. ఈ కథ కేరళ అంతటా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆమెకు సంబంధించిన చారిత్రక ఆధారాలేవీ లేవు.

English summary

the story of nangeli who cut her breasts to protest against a discriminatory

the story of nangeli who cut her breasts to protest against a discriminatory