మీ రాశుల బద్ద శత్రువులు ఎవరో తెలుసా మీకు?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కొందరు అనుకుంటూ ఉంటారు, మాకు వారితో సాన్నిహిత్యం చేయాలని మనసులో ఉన్నా ఆచరణ మాత్రం అసాధ్యంగా మిగిలిపోతుంది అని.

కాని అది మీ జన్మ రాశులకి సంబంధించిన విషయం. కొన్ని సంబంధాలు మాత్రం యాదృచ్చికంగా జరిగిపోతాయి. కాని కొన్ని సంబంధాలలో మాత్రం రాశుల ప్రభావాలు ప్రస్ఫుటంగా గోచరిస్తుంటాయి.

These Zodiac Signs Are Considered To Be The Worst Enemies

ఈ ఆర్టికల్ లో మీ రాశులకు బద్ద శత్రువులైన రాశి చక్రాల వివరాలను పొందిక చేయబడ్డాయి

ప్రతి రాశి చక్రానికి ఒక బద్ద శత్రువు ఉంటుంది. కావున అన్నీ రాశుల వివరములు ఇవ్వబడినవి. మీ బద్ద శత్రువు ఎవరో తెలుసుకోండి మరి.

మేష రాశి : ప్రధాన శత్రువు మేష రాశి

మేష రాశి : ప్రధాన శత్రువు మేష రాశి

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఒక మేషరాశి వ్యక్తికి మరో మేష రాశి వ్యక్తికి ఎన్నటికీ సరిపోదు. మేషరాశి వ్యక్తులు సమానంగా బలమైన, నిబద్దత కలిగి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉన్న కారణాన ఎల్లప్పుడూ వీరి మద్య పోటీతత్వమే ఉంటుంది. ఒకరిపై ఒకరు నిరంతరం గెలవాలన్న పట్టుదలతోనే ఉన్నందున, ఈ ఇరువురికీ ఎన్నటికీ పొసగదు.

వృషభ రాశి : ప్రధాన శత్రువు సింహ రాశి

వృషభ రాశి : ప్రధాన శత్రువు సింహ రాశి

సింహరాశితో పోల్చినప్పుడు వృషభ రాశి కాస్త బలహీనమైన మరియు సోమరితనం కల వ్యక్తిగా అనిపిస్తారు. దీనికి కారణం సింహ రాశి వారి ఆధిపత్య ధోరణి. కాని వ్యక్తిగతంగా వృషభ రాశి వారు మొండి పట్టుదల కలిగిన వారుగా ఉంటారు, వీరు సింహ రాశివారితో సంబంధాన్ని కొనసాగిస్తే గందరగోళంగా మారుతుంది. ఎందుకనగా వారి వారి మార్గాలలో రాజీ పడే అలవాట్లు లేని కారణంగా వీరి సాన్నిహిత్యం అసాధ్యమనే చెప్పాలి.

మిధున రాశి: ప్రధాన శత్రువు కర్కాటక రాశి

మిధున రాశి: ప్రధాన శత్రువు కర్కాటక రాశి

మిధున రాశి వారు స్వతంత్రంగా, అజాగ్రత్త పరులై ఉంటారు. సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడి, రిజర్వుడు స్వభావం కలిగి ఉన్న కర్కాటక రాశి వారితో ఎన్నిటికీ పొంతన కుదరదనే చెప్పాలి. కర్కాటక రాశి వారు భావ వ్యక్తీకరణలో వెనకడుగు వేస్తుండగా, మిధున రాశి వారు దాన్ని తమకు అనువుగా మలచుకోవడం చేస్తుంటారు. వీటి కారణంగా సాన్నిహిత్యం కుదరని పనే అవుతుంది.

కన్యా రాశి: ప్రధాన శత్రువు కుంభ రాశి

కన్యా రాశి: ప్రధాన శత్రువు కుంభ రాశి

ఈ రెండు రాశుల వారు దూకుడు స్వభావాన్ని కలిగి, స్వీయపాలనా చింతను కలిగి ఉంటారు.ఈ రెండు రాశుల వారిలో కన్యా రాశి వారి ఆలోచనా తీరు విశ్లేషణాత్మకoగా ఉండగా, కుంభ రాశి వారి తీరు ఉద్రేక పూరితంగా, హఠాత్తుగా ఉంటుంది. తద్వారా వీరి ఆలోచనల మద్య పొంతన అనేదే ఉండదు. ఈ సంకేతాలు వీరిమద్య యుద్దానికే దారితీయవచ్చు. కావున వీరి సాంగత్యం కుదరదనే చెప్పాలి.

తులా రాశి: బద్ద శత్రువు మకరం

తులా రాశి: బద్ద శత్రువు మకరం

వీరిద్దరూ కలిసి పనిచేయాలి అంటే ఈ రాశుల మద్య రాజీ అనేది ఉండాలి. తులా రాశి వారు ఉన్నది ఉన్నట్లు చెప్పే స్వభావంకలిగిన వారైతే, మకర రాశి వారు దాచిపెట్టుకునే స్వభావంకలిగిన వారు. తులారాశి వారు సమయపాలనకు మొగ్గు చూపితే, మకర రాశి వారు కష్టించి పనిచేసే స్వభావం కలిగిన వారిగా ఉంటారు. కాని మకర రాశి వారి అనుమానాస్పద స్వభావం కారణంగా తులా రాశి వారు సాన్నిహిత్యంగా మెలగలేరు. కావున వీరిద్దరి మద్య సంబంధం నిరంతరం యుద్దపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి.

వృశ్చిక రాశి: ప్రధాన శత్రువు కుంభ రాశి

వృశ్చిక రాశి: ప్రధాన శత్రువు కుంభ రాశి

ఈ రెండింటి సంబంధం మాత్రం అనూహ్యమైనదనే చెప్పాలి. ఈ రెండు రాశుల వారికి నియంత్రించడమంటే నచ్చదు. స్వతంత్రులుగా ఉండడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. తమని తాము నిజమని నమ్మించడానికి తీవ్రమైన చర్యలు తీసుకునే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. మరియు ఒకరిపై ఒకరు గెలవడానికి నిరంతరం ఎత్తులు వేస్తూ ఉంటారు. వాదనలో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచనే చెయ్యరు. తద్వారా వీరిమద్య సాన్నిహిత్యం అనుమానస్పదం గానే ఉంటుంది.

ధనుస్సు రాశి : ప్రధాన శత్రువు మీన రాశి

ధనుస్సు రాశి : ప్రధాన శత్రువు మీన రాశి

ధనుస్సు రాశి వారు ఏదైనా బాహాటంగా బయటకి మాట్లాడగలిగిన స్వభావం కలవారై ఉంటారు. కాని మీన రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. తద్వారా మీన రాశి వారు మానసిక సంఘర్షణకి లోనవ్వడం పరిపాటి. మరియు మీన రాశి వారికి ఉద్రేకపూరితమైన లక్షణాలు నచ్చవు, కాని ధనుస్సు రాశి వారికి అంత ఆలోచనా శక్తి ఉండదు. మనసులో ఉన్నది ఏదైనా బయటకి చెప్పేస్తుంటారు. కావున ఈ రెండు రాశులు బద్ద శత్రువులుగానే ఉంటాయి.

రాశిచక్ర సంకేతాలకు సంబంధించి మరింత ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

These Zodiac Signs Are Considered To Be The Worst Enemies

According to astrology, each zodiac sign has its worst enemy. Check out on the combinations of zodiacs that are listed as being the worst enemies. Aries : Aries; Taurus : Leo; Gemini : Cancer; Virgo : Aquarius; Libra : Capricorn; Scorpio : Aquarius; Sagittarius : Pisces.