సైనికులు ఒకరి వెనుక ఒకరు నాపై, నా సోదరిపై అత్యాచారం జరిపారు

Written By:
Subscribe to Boldsky

రోహింగ్యాలు లేదా రోహింజ్యాలు వీరి గురించి కొన్ని సంవత్సరాలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ మధ్య జమ్మూలోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై తెల్లవారుజామున జైష్ ఉగ్రవాదుల జరిపిన దాడితో మళ్లీ రోహింగ్యాలు మళ్లీ చర్చలోకి వచ్చారు. ఉగ్రదాడి వెనుక రోహింగ్యా ముస్లింల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. అసలు కొన్ని ఏళ్లుగా రోహింగ్యాల గురించి ఎందుకు ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది. ఇంతకు ఎవరు వీరు.. వీరి చరిత్ర ఏమిటో తెలుసుకుందామా.

రఖైన్‌ రాష్ట్రం రోహింగ్యా ముస్లింల నివాసంగా

రఖైన్‌ రాష్ట్రం రోహింగ్యా ముస్లింల నివాసంగా

మయన్మార్‌ (గతంలో బర్మా) లోని రఖైన్‌ రాష్ట్రం రోహింగ్యా ముస్లింల నివాసంగా ఉండేది. కానీ అక్కడ బౌద్ధులు అధికంగా ఉన్నారు. దీంతో మయన్మార్‌లో రోహింగ్యాలకు స్థానికులుగా గుర్తింపు లేకుండా పోయింది. వీరికి ఆ దేశ పౌరసత్వం కూడా లేదు. వీరిపై వివక్ష చాలా దారుణంగా ఉండేది. వీరిలో చాలామంది శరణార్థుల శిబిరాల్లో కాలం గడేపేవారు.

ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారు

ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారు

ఇక రోహింగ్యాలను ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారు స్థానికులు, సైనికులు. దీంతో చాలా మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌, మలేసియా, ఇండోనేసియాతో పాటు మనదేశంలో అక్రమంగా ప్రవేశించారు. ఇంకా ప్రవేశిస్తున్నారు కూడా.

బంగ్లాదేశ్‌ వారు

బంగ్లాదేశ్‌ వారు

తాము రఖైన్‌ లో ఎన్నో శతాబ్దాలుగా నివసిస్తున్నానమి రోహింగ్యాలు అంటున్నా.. వారంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారని మయన్మార్‌ ఆరోపిస్తోంది. దీంతో రోహింగ్యాలకు సొంత దేశం లేకుండాపోయింది.

చిట్టగాంగ్‌ నుంచి

చిట్టగాంగ్‌ నుంచి

అయితే రోహింగ్యాల మూలాలు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉన్నాయి. మయన్మార్‌ 1824లో ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయటానికి కూలీలు అవసరమయ్యారు. దీంతో రోహింగ్యాలను చిట్టగాంగ్‌ నుంచి బర్మాకు తీసుకువచ్చారట.

ఊచకోత

ఊచకోత

అయితే అక్కడి స్థానికులకు రోహింగ్యాలకు మధ్య మొదటి నుంచీ వివాదాలు ఉన్నాయి. ఆంగ్లేయుల పాలన తర్వాత రోహింగ్యాలను మయన్మార్ లో ఊచకోత కోశారు. మయన్మార్‌లో రోహింగ్యాలను ఆ దేశ పౌరులుగా గుర్తించకపోవడంతో వారంతా అనధికారికంగా ఆ దేశంలో నివసిస్తున్నట్లయింది.

ఎన్నో దుర్మార్గాలకు పాల్పడింది

ఎన్నో దుర్మార్గాలకు పాల్పడింది

మయన్మార్‌ సైన్యం రోహింగ్యాలను ఏదో విధంగా రఖైన్‌ రాష్ట్రం నుంచి వెళ్ల గొట్టాలని గతంలో రకరకాల ప్రయత్నాలు చేసింది. రోహింగ్యా ముస్లింలను దారుణంగా అవమానించింది. మయన్మార్ సైన్యం ఎన్నో దుర్మార్గాలకు పాల్పడింది. ఊళ్లకు ఊళ్లు తగలబెట్టింది.

స్త్రీలను ఇష్టానుసారంగా వాడుకుంది

స్త్రీలను ఇష్టానుసారంగా వాడుకుంది

మయన్మార్‌ సైన్యం స్త్రీలపై ఇష్టానుసారంగా లైంగిక దాడులు చేపట్టింది. వయసుకు వచ్చిన ఏ ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టకుండా ఇష్టానుసారంగా సైన్యం వాడుకుంది. పేరుకుమాత్రం శరణార్థుల శిబిరాలు అని చెప్పినా అందులో ఏ మహిళ కూడా ఉండలేనంత దారుణంగా మయన్మార్ సైన్యం తన ఆగడాలు ప్రదర్శించింది.

ఆరుబయటే రోజూ స్నానం

ఆరుబయటే రోజూ స్నానం

పిల్లలు, పెద్దవారిపై ఇష్టానుసారంగా మయన్మార్ సైన్యం భౌతికదాడులు జరిపింది. రోహింగ్యాలు ఇళ్ల ముందు స్నానం చేసేందుకు ఏర్పరుచుకున్న మొత్తం మయన్మార్ సైన్యం బలవంతంగా తొలగించింది. దీంతో స్త్రీలు ఆరుబయటే రోజూ స్నానం చేయాల్సి వచ్చేది. అలా వారు ఇబ్బందిపడుతుంటే వారిని చూసిన ఆనందించిన క్రూరులు మయన్మార్ సైనికులు.

నానా రకాలుగా ఇబ్బందులు

నానా రకాలుగా ఇబ్బందులు

ఇక మయన్మార్ లో నానా ఇబ్బందులు పడ్డ రోహింగ్యాలు శరణార్థులుగా మారారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ దేశం కనపడితే ఆ దేశంలోకి వాళ్లు వస్తూనే ఉన్నారు. ఇలా వస్తున్న రోహింగ్యా శరణార్థులు నానా రకాలుగా ఇబ్బందులుపడుతున్నారు.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

రోహింగ్యా శరణార్థుల్లో వేలాది మంది చిన్నారులు అదృశ్యం అవుతున్నారు. రోహింగ్యాలకు చెందిన 12 సంవత్సరాలు కూడా నిండని ఆడ పిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. వారు సెక్స్ వర్కర్లు గా పలు దేశాలకు అక్రమ రవాణా అవతున్నారట.

మానవ వ్యాపారుల బాధితులుగా

మానవ వ్యాపారుల బాధితులుగా

రోహింగ్యాలకు సంబంధించి చాలామంది అమ్మాయిలను పొరుగు దేశాల వారు విక్రయిస్తున్నారు. వారి కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులను వారు పెళ్లి చేసుకోవలసి వస్తుంది. రోహింగ్యాలకు సంబంధించి బాలికలు మహిళలు, మానవ వ్యాపారుల బాధితులుగా మారారు. స్మగ్లర్లు మరియు అక్రమ రవాణాదారులు వీరి కోసం అన్వేషించి ఒంటిరిగా ఉన్న సమయంలో వీరిని అపహరించుకపోతున్నారు. వారిని వ్యభిచారంలో దింపుతున్నారు.

చాలామంది అత్యాచారం చేశారు

చాలామంది అత్యాచారం చేశారు

మయన్మార్ సైనికులు కొన్ని వేల మందిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అయితే వాళ్ల చేతుల్లో అత్యాచారానికి గురైన హబీబా, ఆమె సోదరి ఆ మధ్య కొన్ని వాస్తవాలు చెప్పారు. సైనికులు తామిద్దరినీ కట్టేసి, ఒకరి తర్వాత ఒకరు చాలామంది అత్యాచారం చేశారని హబీబా (20) అప్పట్లో చెప్పింది.

సమీరాని కూడా

సమీరాని కూడా

హబీబాతో పాటు ఆమె సోదరి సమీరాని కూడా మయన్మార్ సైనికులు ఒక ప్రదేశానికి ఎత్తుకెళ్లి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. వంతుల ప్రకారం పది మందికి పైగా వీరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. సమీరా ఏడుస్తున్నా కూడా కనికరించకుండా సైనికులు ఆమెపై అత్యాచారం చేశారట. రోహింజ్యాలను దేశం నుంచి పంపే నెపంతో ఇలా కొన్ని వేలమందిని మయన్మార్ సైనికులు విచ్ఛలవిడిగా అనుభవించారు.

English summary

The truth behind Myanmar’s Rohingya insurgency

The truth behind Myanmar’s Rohingya insurgency
Story first published: Tuesday, February 13, 2018, 9:30 [IST]