Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఐరిష్ డాన్స్ చేస్తున్న ఈ కవలల క్యూట్ వీడియో చూస్తే మైమరచిపోవడం గారెంటీ
ఐరిష్ డాన్స్ చేస్తున్న ఈ కవలల క్యూట్ వీడియో చూస్తే మైమరచిపోవడం గారెంటీ
మానసిక ప్రశాంతత కోసం మనలో అనేక మంది, పసిపిల్లల ఫోటోలు లేదా వాళ్ళ అల్లరి చేష్టల వీడియోలు చూడడం పరిపాటిగా ఉంటుంది. అవునా? అవి మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రమంలో ఒక ఔషధం వలె పని చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఈ ఇద్దరు కవల పిల్లలు చేసే ఈ అందమైన ఐరిష్ డాన్స్ చూడండి, ఎంత ముచ్చటగా ఉందో.
ఈ వీడియోలో ఎంతో సంతోషంగా, వెనుక వస్తున్న ఐరిష్ పాటకు డాన్స్ చేస్తున్న కవలలను చూడండి. లోకంతో ప్రమేయం లేకుండా, సిగ్గు బిడియం వంటి అంశాలతో సంబంధం లేకుండా, ఆ పిల్లలు చేసే డాన్స్ చేస్తుంటే, ఆరోజులకు తిరిగి వెళ్లాలని అనిపిస్తుంది కదా.

వీడియోలో కనిపిస్తున్నట్లు, ఈ ఇద్దరు కవలలు గుండె నిండా సంతోషాన్ని నింపుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా, ఐరిష్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరియు ఆ పాటకు ఏ స్టెప్ వెయ్యాలి అని ముందే ఊహించుకుని వేస్తున్నట్లు వారు వేసే చిందులు చూస్తుంటే, ముచ్చటగా అనిపిస్తుంది.
అద్భుతంగా అనిపిస్తుంది కదూ? ఇంకెందుకు ఆలస్యం, ముందుకు వెళ్లి వీడియో పూర్తిగా చూడండి. వారి సంతోషాన్ని మీ సంతోషంగా మార్చుకోండి.
ఒక్కసారి వారి దుస్తులను కూడా పర్యవేక్షించండి. మంచి ప్రదర్శన ఇవ్వడమే కాదు, స్టైల్ కూడా చక్కగా ప్రెసెంట్ చేస్తున్నారు.
మేము ఖచ్చితంగా చెప్పగలము, ఈ వీడియోలో ఉయ్యాలలో చిందులేస్తున్న కవలల నవ్వు, హావభావాలు, డాన్స్ ఖచ్చితంగా మీ ముఖం మీద చిరునవ్వును తెప్పిస్తుందని. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆ పిల్లలు, మీకు కూడా సంతోషాన్ని అందివ్వగలరు మరి.
అలా ఎగరడం, డాన్స్ చేయడం వలన పిల్లలు టెండర్ ఫీట్ సమస్యకు గురవుతారు అని భావించే వాళ్ళు, పిల్లలకు కేరింగ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో సంతోషాన్ని పంచడం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. నొప్పులు, దెబ్బలు లేకుండానే పిల్లలు పెరగాలి అంటే అది జరగని పని.
ఎప్పుడైనా మానసిక ప్రశాంతత కోల్పోయాము అన్న భావనకు లోనైనా, లేక ఒత్తిళ్లకు గురైనా ఇటువంటి పసిపిల్లలు, పెట్స్ సంబంధిత వీడియోలను చూడడం ద్వారా అనేక మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ క్రమంలో భాగంగా బోల్డ్స్కీ పేజీ ఎప్పుడూ మీకోసం ఇటువంటి వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.
ఇటువంటి అనేక వీడియోలకోసం తరచుగా బోల్డ్స్కీ పేజీని సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను కామెంట్లను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications
