రెండు పెళ్లిళ్లు చేసుకోండని ప్రభుత్వమే మగవారిని అడుక్కుంటుంది.. ఇద్దరు భార్యలుంటే వారికి బంపర్ ఆఫర్

Written By:
Subscribe to Boldsky

మనదేశంలో మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం. అందుకే కొందరు మగాళ్లు చాటుమాటుగా తమ ప్రేయసీలతో ప్రేమవ్యవహారం నడిపిస్తుంటారు. అయితే కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో భార్యా భ‌ర్త‌ల‌లో భార్య ఒప్పుకుంటే భ‌ర్త రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా చ‌ట్టం వీలు క‌ల్పించింది.

అండర్ స్టాండింగ్ ఉండాలి

అండర్ స్టాండింగ్ ఉండాలి

అలాంటి పరిస్థితుల్లో కొత్త‌గా పెళ్లి చేసుకునే భార్య‌కు, భ‌ర్త‌కు, పాత భార్య‌కు ముగ్గురికీ అండ‌ర్ స్టాండింగ్ ఉండాలి. ఇలా లేక‌పోతే అది వీలు కాదు. అయిన‌ప్ప‌టికీ నేటి త‌రుణంలో చాలా మంది మ‌గాళ్లు రెండో పెళ్లి చాటు మాటున చేసుకుని ఆ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచి కాపురాలు కూడా చేస్తున్నారు. కానీ ఈ దేశంలో మాత్రం ఏకంగా ప్రభుత్వమే మగాళ్లందరికీ ఆఫర్ ఇస్తోంది.

రెండో పెళ్లి చేసుకోండి

రెండో పెళ్లి చేసుకోండి

మీరు రెండో పెళ్లి చేసుకోండి అని అడుక్కుంటోంది. మనదేశంలో అమ్మాయిలు ఎక్కువై పోయారు.. దయచేసి ఒకరొకరు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోండి అని మగవారిని కోరుతుంది. అంతేకాదు ఇద్దరు భార్యలుండేవారికి బంఫర్ ఆఫర్లు ఇస్తోంది.

ఎక్కువ భార్యలుండాలి

ఎక్కువ భార్యలుండాలి

తమ దేశంలో పురుషులకు ఎక్కువ భార్యలుండాలని ఆ దేశం కోరుకుంటుంది. ఇద్దరు భార్యలున్న భర్తకు ప్రభుత్వం కానుకలను కూడా అందిస్తుంది. ఆ దేశమే యూఏఈ... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు గల ఈ దేశంలోని దుబాయ్ మనఅందరికీ తెలిసిందే.

అవివాహిత మహిళల సంఖ్య అధికం

అవివాహిత మహిళల సంఖ్య అధికం

అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అవివాహిత మహిళల సంఖ్య అధికంగా ఉందట. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ఇద్దరు భార్యలను చేసుకోండి

ఇద్దరు భార్యలను చేసుకోండి

ప్రతి మగాడు ఇద్దరు భార్యలను చేసుకోవాలని కోరుతుంది. రెండు పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రోత్సాహకాలను అందించడం తో పాటు... ఇద్దరు భార్యలున్న వ్యక్తిని గౌరవంగా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఇంటి అద్దె ఫ్రీ

ఇంటి అద్దె ఫ్రీ

అంతేకాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న పురుషులకు షేక్ జాయద్ హౌసింగ్ పథకం కింద ఇంటి అద్దెను చెల్లిస్తారు. ఈ ప్రయోజనం రెండవ భార్యకు కూడా వర్తిస్తుందట. అంటే వారికి ఇంటి అద్దె చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌.

బహిరంగంగా చెప్పుకోవొచ్చు

బహిరంగంగా చెప్పుకోవొచ్చు

నాకు ఇద్దరు భార్యలు ఉన్నారని యూఏఈ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని మగవారంతా బహిరంగంగా చెప్పుకోవొచ్చు. అలా పెళ్లి చేసుకున్న వారిని సమాజం గౌరవిస్తుంది.

మామూలు విషయం కాదు

మామూలు విషయం కాదు

దేశంకోసం ఒక మగాడు ఇద్దరు భార్యలను చేసుకుని భరించగలడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి అంత మర్యాద ఇస్తారు యూఏఈ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో.

మనదేశంలో ఇలాంటి ఆఫర్ వస్తే?

మనదేశంలో ఇలాంటి ఆఫర్ వస్తే?

మనదేశంలో కూడా ఇలాంటి ఆఫర్ వచ్చి ఉంటే చాలా మంది ఆశావాహులు పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం ఇలా ప్రోత్సహకాలు అందించి మగవారు రెండో పెళ్లి చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తే ఎంతో మంది మగవారు దేశం కోసం తమ ప్రతిభను చూపించగలుగుతారేమో.

English summary

uae decides to give housing allowance to nationals with two wives

uae decides to give housing allowance to nationals with two wives
Story first published: Saturday, March 10, 2018, 11:44 [IST]