కర్ణుడు దుర్యోధనుడి భార్య భానుమతితో అతను లేనప్పుడు సరసాలాడేవాడా?

By Bharath
Subscribe to Boldsky

మహాభారతంలో చాలామందికి దుర్యోధనుడి గురించి బాగా తెలుసు. అయితే దుర్యోధనుడి భార్య భానుమతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. భానుమతి తండ్రిపెట్టిన స్వయంవరానికి కర్ణుడు వెళ్తాడు. భానుమతి కర్ణుడిని చూసి అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. మరి దుర్యోధనుడితో పెళ్లయిన తర్వాత కర్ణుడితో చాలా చనువుగా ఉంటుంది భానుమతి. అలాంటి భార్య భానుమతికి సంబంధించి కొన్ని వివరాలు..

ద్రౌపది స్వయంవరంలో ఓడి

ద్రౌపది స్వయంవరంలో ఓడి

మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె. ద్రౌపది స్వయంవరానికి వెళ్లిన దుర్యోధనుడు అక్కడ ఓడిపోతాడు. ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్వుతుంది. అర్జునుడు స్వయంవరంలో నెగ్గుతాడు. దీంతో పాండువులు ద్రౌపదిని గెలుచుకుంటాడు. పాండవులు ఆమెను పెళ్లి చేసుకుంటారు.

కర్ణునితో కలిసి భానుమతి స్వయంవరానికి

కర్ణునితో కలిసి భానుమతి స్వయంవరానికి

ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయిన దుర్యోధనుడు చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోతాడు. అప్పుడు మామ శకుని, కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం ఇచ్చి దుర్యోధనున్ని ప్రోత్సహిస్తాడు. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులెందరో వచ్చి ఉంటారు.

దుర్యోధనుడిని చూడదు

దుర్యోధనుడిని చూడదు

స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలికత్తెలు ఒకొక్క రాజకుమారుడి గురించీ వర్ణిస్తూ ఉండగా, వారిని పరికిస్తూ ముందుకు సాగుతుంటుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతణ్ని కూడా చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తిన వైపు బయల్దేరతాడు.

మా తాతలాగానే నేను కూడా

మా తాతలాగానే నేను కూడా

దుర్యోధనుడిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకువచ్చి, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించినవారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశిరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అని నోరుమూయిస్తాడు.

భానుమతి కళ్ళు కర్ణునిపైనే

భానుమతి కళ్ళు కర్ణునిపైనే

అయితే స్వయం వరంలో భానుమతి సభలోకి పూలమాలతో అడుగుబెట్టి, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన బలమైన రాజులను చూస్తుంది. తర్వాత ఆమె కళ్ళు కర్ణునిపై పడతాయి. దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుడిని చూసీచూడగానే అతని మీద మనసు పారేసుకుంటుంది.

కర్ణుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది

కర్ణుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది

కర్ణుడినే పెళ్లి చేసుకోవాలని భానుమతి అనుకుంటుంది. కానీ ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోతుంది. మరి దుర్యోధనుడితో ఆమె పెళ్లాయ్యాక కూడా కర్ణుడిని అలాగే ప్రేమించేదా? దుర్యోధనుడికి ఈ విషయం తెలిసిందా అనే విషయం తెలుసుకోండి.

భార్య అంటే దుర్యోధ‌నుడికి ప్రాణం

భార్య అంటే దుర్యోధ‌నుడికి ప్రాణం

దుర్యోధ‌నుడికి భార్య భానుమ‌తి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒక సారి క‌ర్ణుడు, దుర్యోధ‌నుడి భార్య భానుమ‌తి ఆమె మందిరంలో పాచిక‌లు ఆడుతూ ఉంటారు. చాలా సేప‌టి నుంచి ఆట సాగుతూ ఉంటుంది.

ఆటలో ఓడిపోయే సందర్భంలో

ఆటలో ఓడిపోయే సందర్భంలో

అయితే ఆట ముగింపు ద‌శ‌కు వ‌స్తుంది. మరికొద్ది సేపు ఆడితే భానుమ‌తి కర్ణుడి చేతిలో ఓడిపోతుంది. కర్ణుడి చేతిలో ఆటలో ఓడిపోతానని భానుమతి అనుకునే సందర్భంలో ఆ మందిరంలోకి భానుమ‌తి భ‌ర్త దుర్యోధ‌నుడు ఎంటర్ అవుతాడు.

దుర్యోధనుడి రాకను గమనించి

దుర్యోధనుడి రాకను గమనించి

భర్త దుర్యోధనుడి రాక‌ను భానుమతి గ‌మ‌నిస్తుంది. ఆమె ద్వారానికి ఎదురుగానే కూర్చొని ఉంటుంది. దీంతో దుర్యోధనుడు రాగానే ఆమెకు కనపడతాడు. ఇక క‌ర్ణుడి వీపు ద్వారం వైపునకు ఉంటుంది. దుర్యోధనుడు వచ్చే ప్రతి సారి భానుమతికి లేచి నిలబడడం అలవాటు. భర్తకు ఆమె ఇచ్చే మర్యాద ఇదే.

కర్ణుడు పట్టుకుని లాగుతాడు

కర్ణుడు పట్టుకుని లాగుతాడు

అప్పుడు కూడా భానుమ‌తి మ‌ర్యాద‌గా పైకి లేవ‌డానికి ప్రయ‌త్నిస్తుంది. అది గ‌మనించిన క‌ర్ణుడు ఆమె ఓడిపోతుంది కాబట్టే పారిపోయేందు ప్రయ‌త్నిస్తుంద‌ని అనుకుంటాడు. భానుమతి ఓడిపోబోతున్నావని పారిపోతున్నావు కదా.. అలాంటి పప్పులేమి కుదరవు.. కూర్చొని నాతో ఆట ఆడాల్సిందేనని ఆమె మణికట్టును పట్టుకుని లాగుతాడు.

కర్ణుడికి, భానుమతికి ఏం చేయాలో అర్థం కాదు

కర్ణుడికి, భానుమతికి ఏం చేయాలో అర్థం కాదు

ఆ క్రమంలో ఆమె నడుముకున్న వడ్డాణానికి కర్ణుడి చేయి తగులుతుంది. దానికి అలంకార‌మై ఉన్న ముత్యాలు తెగి కింద ప‌డుతాయి. దీంతో భానుమ‌తి భయానికి లోనవుతుంది. ఆమె ముఖం మొత్తం ఆందోళనతో నిండిపోతుంది. ఇది గ‌మ‌నించిన క‌ర్ణుడు వెన‌క్కి తిరిగి చూస్తే దుర్యోధ‌నుడు క‌నిపిస్తాడు. కర్ణుడికి, భానుమతికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు విషయం చెప్పేంత వరకు కూడా దుర్యోధనుడు వింటాడో లేదోనని కర్ణుడు అనుకుంటాడు.

ఏంటీ.. ముత్యాలు మొత్తం నేనే ఏరాలా

ఏంటీ.. ముత్యాలు మొత్తం నేనే ఏరాలా

కానీ కర్ణుడిపై దుర్యధనుడికి అపార నమ్మకం ఉంటుంది. అందువల్ల దుర్యోధ‌నుడు తాపీగా కిందపడ్డ ముత్యాలను ఏరుతూ కూర్చొంటాడు. ఏంటీ.. ముత్యాలు మొత్తం నేనే ఏరాలా..? మీరిద్దరూ అలాగే చూస్తూ ఉంటారా అని కర్ణుడిని, భానుమతిని దుర్యోధనుడు అడుగుతాడు. అంత మంచి స్నేహం కర్ణుడికి, దుర్యోధనుడికి మధ్య ఉండేది.

భానుమతి, దుర్యోధనుల సంతానం

భానుమతి, దుర్యోధనుల సంతానం

భానుమతి, దుర్యోధనులకు ఇద్దరు సంతానం. కూతురు లక్షణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. వీరి గురించి కూడా మనకు తెలిసింది తక్కువే! కృష్ణుని కుమారుడైన సాంబుడు లక్ష్మణను చేసుకున్నాడు. లక్ష్మణకుమారుడి గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. బలరాముడి కుమార్తె శశిరేఖను, లక్ష్మణకుమారుడికి ఇచ్చి కట్టపెట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. కానీ ఆ పాటికే శశిరేఖ, అర్జునుడి కుమారుడైన అభిమన్యుని ప్రేమిస్తుంది. దాంతో అభిమన్యుడు, ఘటోత్కచుని సాయంతో పెద్దలు తలపెట్టిన పెళ్లిన చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు.

Image Source :https://www.speakingtree.in/

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    unknown facts about duruyodhana's wife bhanumathi

    unknown facts about duruyodhana's wife bhanumathi
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more