For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరైనా అక్కడ తుపాకీ పెట్టుకుంటారా?

|

ఒకప్పుడు ఏదైనా వింతలు, విడ్డూరాలు జరిగితే ప్రపంచానికి తెలియడానికి ఒక్కోసారి దశాబ్దాలే కాదు, శతాబ్దాల సమయం కూడా పట్టేది. ఇప్పుడు మారుతున్న ప్రపంచం దృష్ట్యా, జరిగిన మరు నిమిషంలోనే వార్త ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంది. ఎందరో చెప్పిన మాటల ప్రకారం ఆరుబయట మీటింగులు పెట్టే వాళ్ళ దగ్గర లేని అంశమే ఉండదు, ఇప్పుడు ఆ భాద్యతను సోషల్ మీడియా తీసుకుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

అలాంటి వింతల్లో ఒకదాని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. తనకు తెలీకుండా తుపాకీతో గాయపరచుకున్న ఒక వ్యక్తి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతూ ఉంది..

Viral Video Of A Man Shooting Himself Accidentally In The Groin Is Scary

ఈ వీడియో నిడివి కొన్ని సెకండ్లే ఉన్నాకూడా, అతను చేసిన పనికి నవ్వాలో, భాద పడాలో అర్ధం కాని స్థితిలో షేర్ల మీద షేర్లు చేసేస్కుంటున్నారు నెటిజన్లు. ఈ వ్యాసంలో ఆ వీడియో పొందుపరచబడింది. ఒకసారి చూడండి.

ఇక కథనానికి వస్తే, వీడియో ప్రకారం ఆ వ్యక్తి తన సహచరునితో మాట్లాడుతూ అన్లాక్ చేసిన తుపాకీని తన ఫాంటు ముందు భాగంలో పెట్టుకున్నాడు. తర్వాత ఏదో పని నిమిత్తం క్రిందికి బెండ్ అవగానే, అనుకోకుండా అకస్మాత్తుగా ఆ తుపాకీ పేలి అతన్ని గాయపరచింది. ఈ వీడియో ఫుటేజ్ మొత్తం సిసిటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అతని అరుపులు విన్న వెంటనే సహచరులు అతన్ని కాపాడే క్రమంలో ముందుకు పరిగెత్తుకుని రావడం ఫుటేజ్లో కనిపించింది. నిడివి సెకండ్లే అయినా కూడా నెటిజన్లు మాత్రం వేల సార్లు చూశారు.

ఈ వీడియోలో ఒక మహిళ అతనికి సహాయం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఎక్కడ గాయమైంది అని అడగగా., మానసిక గందరగోళానికి గురైన అతను ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. మహిళ అని ఆలోచించాడో లేదా నిజంగానే అతను అర్ధం కాని పరిస్థితుల్లోకి వెళ్ళాడో ఎవరికీ అర్ధo కాలేదు.

ఆ వ్యక్తి మొల భాగాన, తుపాకీ పేలింది. కానీ, తీవ్రమైన గాయమైతే కాలేదు. నివేదికల ప్రకారం, ఇప్పుడు అతని పరిస్థితి ఆరోగ్యంగానే ఉంది మరియు ఆ ప్రమాదం నుండి త్వరగానే కోలుకున్నాడు కూడా.

ఈ వీడియో జూన్ 18 న పోస్ట్ చేయబడింది, కానీ 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలోనే 90,000 సార్లు వీక్షించబడింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు, నెటిజన్లు ఎన్ని షేర్లు కొట్టారో.

నిజానికి ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న అనేకులు ప్రాణాలనే కోల్పోయారు, ఇతను ఒకరకంగా అదృష్టవంతుడనే చెప్పాలి. చిన్న గాయంతోనే బ్రతుకు జీవుడా అని బయట పడ్డాడు.

ఇప్పుడు వైరల్ వీడియో క్రేజ్ ఎక్కువగా ఉన్న పక్షాన, అతి తక్కువ సమయంలోనే ప్రపంచమంతా ఈ వీడియో పాకింది. నెటిజన్లు కూడా తమ వద్ద ఉన్న క్రేజీ వీడియోలను అందరికీ చూపించాలన్న కుతూహలాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.

ఈ వ్యాసం చివరిలో వీడియో పొందుపరచడం జరిగినది. ఒకసారి చూడండి. ఇటువంటి చర్యలకు పాల్పడకూడదన్న సూచనతోనే ఈ వీడియో పొందుపరచడం జరిగినది. ఇటువంటి అనేక ఆసక్తికర, క్రేజీ, వైరల్ విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Viral Video Of A Man Shooting Himself Accidentally In The Groin Is Scary!

These days, becoming an Internet sensation is no big deal. All that it takes is a viral video to get all the fame that you desire to get!A video of a man accidentally shooting himself in the groin is going viral on social media.
Story first published: Friday, June 22, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more