For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన అనుమతి లేకుండా తనని ఎత్తుకున్న వ్యక్తిని చాచి కొట్టిన పెళ్లి కూతురు

|

అనేక లైంగిక దాడులకు, ఆకతాయిల చేష్టలకు గురవుతున్న మహిళలు, వారి వికృత చేష్టలకు చెక్ పెట్టడానికి ఒక అడుగు ముందుకు వేసి తిరగబడి ఇన్స్టంట్ జస్టిస్ మార్గాన్ని అనుసరిస్తున్నారు. మమ్మల్ని కాపాడుకోవడం మా కనీస హక్కు అనే నినాదం చాప కింద నీరులా ప్రతి మహిళకు చేరుతుండడం ఆహ్వానించదగ్గ విషయం.

వరమాలను పెళ్ళికొడుకు మెడలో వేసే క్రమంలో, తన అనుమతి లేకుండా తనను ఎత్తుకున్న ఒక వ్యక్తి చెంప పగలగొట్టిన పెళ్ళికూతురు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.

Bride Stopped The Wedding To Slap A Man Who Picked Her Up Without Her Consent

పెళ్ళిలో భాగంగా :

వీడియోప్రకారం , వరమాల వేసే క్రమంలో ఎవరైనా పెళ్ళికొడుకుని ఎత్తుకుని పెళ్ళికూతురి మెడలో వరమాల వేయించడం, పెళ్ళికూతురుని అంతకన్నా ఎత్తుకు ఎత్తుకుని పెళ్ళికొడుకు మెడలో వరమాల వేయించడం ఒక సరదాగా వస్తున్న వ్యవహారం.

ఆ క్రమంలో భాగంగా ఒక వ్యక్తి పెళ్ళికొడుకుని ఎత్తుకుని వరమాల వేయించగా, పెళ్లి కూతురు పక్కన ఉన్న వ్యక్తుల ప్రోద్భలంతో ఒక వ్యక్తి పెళ్ళికూతురుని అమాంతం ఎత్తుకుని పెళ్ళికొడుకు మెడలో వరమాల వేయించాడు.

క్రిందకు దించిన వెంటనే, కోపంతో రగిలిపోయిన పెళ్ళికూతురు, ఎత్తుకున్న వ్యక్తిని చాచి పెట్టి చెంపదెబ్బకొట్టింది. హుతాశయుడై అవమానానికి గురైన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్ధం కాక, పక్కనే ఉన్న మరో ఆడపిల్లను చాచి కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అయితే ఆ అమ్మాయి పెళ్ళికూతురుని ఎత్తుకోమని ప్రోత్సహించినందుకు కొట్టాడో, లేక హేళనకు గురై కొట్టాడో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. మరో పక్క అతని మీద కోపం కూడా ఉండి ఉండొచ్చని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు కూడా చూడండి.

నిజానికి పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకుని, పెళ్లి కూతుర్లని ఎత్తుకోవడం వరమాలలు వేయించడం అనాదిగా వస్తున్న పెళ్లి వేడుకలలో భాగం. కానీ పెరుగుతున్న లైంగిక హింసలు వ్యక్తుల ఆలోచనా ధోరణులు ఇలాంటి విపరీత పరిస్థితులకు కారకాలుగా ఉన్నాయి. ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్న స్త్రీలు ఇలాంటి చేష్టలను స్వీకరించే పరిస్థితులలో లేరు.

నిజానికి ఇటువంటి చర్యలకు ఉపక్రమించే ముందు, వారి అనుమతి తీసుకోవడం కూడా ముఖ్యమే. ఉదాహరణకు పెళ్లిజంటతో ఫోటోలు; అనుమతి లేకుండా సెల్ఫీలకు పోజులిస్తూ వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారు అనేక మంది. సెల్ఫీలకు కూడా అనుమతి తప్పనిసరి అని ఎందుకు ఆలోచించరో అర్ధం కాదు. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. శ్రుతిమించితే చెంపదెబ్బలు తప్పవని ఈ పెళ్ళికూతురు నిరూపించింది. కావున ఇకముందు ఇటువంటి చర్యలకు ఉపక్రమించే ముందు, అనుమతిని తీసుకోవడం లేదా సంరక్షణా చర్యలు తీసుకోవడం మంచిదిగా సూచించడమైనది.

పెళ్ళికూతురు చేసిన ఈ పని సరైనదే అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీప్రియమైన వారితో పంచుకోండి.

English summary

Bride Stopped The Wedding To Slap A Man Who Picked Her Up Without Her Consent

A video has been going viral for all the good reasons where a young bride was seen slapping a man who picked her up for the varmala act. The reason for the man getting slapped was because he had picked up the woman without her consent. The funny bit of the entire video is that the man is seen slapping another woman out of embarrassment.
Story first published: Friday, July 6, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more