ఈ వారం మీ రాశి ప్రకారం మీకు అదృష్టం కలిసి వస్తుందా లేదంటే దురదృష్టం వెంటాడుతుందో తెలుసుకోండి

వారం వారం మన అదృష్టాలు, దురదృష్టాలు మారుతుంటాయి. ఆగస్టు 6, 2018 నుంచి ఆగస్టు 12, 2018 వరకు మీ భవితవ్యం ఎలా ఉందో తెలుసుకోండి. ఈ వారం మీ రాశి ప్రకారం మీకు అదృష్టం కలిసి వస్తుందా లేదంటే దురదృష్టం.

వారం వారం మన అదృష్టాలు, దురదృష్టాలు మారుతుంటాయి. ఆగస్టు 6, 2018 నుంచి ఆగస్టు 12, 2018 వరకు మీ భవితవ్యం ఎలా ఉందో తెలుసుకోండి. ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషం : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశివారు ఈ వారం పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ జాబ్ విషయంలో కావొచ్చు లేదంటే ఆరోగ్య విషయంలో మీరు కాస్త సమస్యలు ఎదుర్కోవొచ్చు. మీరు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే విజయాలు చేకూరుతాయి. ఇక మీరు ఎవరితోనైనా డేటింగ్ లో ఉండడమో లేదంటే త్వరలో మీరు పెళ్లి చేసుకుంటున్నట్లయితే మీ భాగస్వామితో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించండి. చిన్నచిన్న సమస్యలకు మీ భాగస్వామిపై కోప్పడకండి. మీ బంధం బలంగా, పటిష్టం చేసుకునేలా ప్రవర్తించండి.

వృషభం : ఏప్రిల్ 20- మే 20

వృషభం : ఏప్రిల్ 20- మే 20

వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో స్పష్టమైన ఆలోచన వైఖరితో ఉండాలి. ఈ వారం మీరు కొన్ని విషయాల్లో అస్పష్టంగా ఉండొచ్చు. అయితే కాస్త ఆలోచిస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఇక ఈ వారంలో మీరు కొన్ని అనవసరమైనవి కొనుగోలు చేయకుండా ఉండండి. మీరు ఏదైనా కొనుగోలు చేసే విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటూ దాన్ని కొనాలా వద్దా అని పదిసార్లు ఆలోచిస్తున్నారంటే అది కొనకపోవడమే మంచిది.

మిథునం : మే 21 - జూన్ 20

మిథునం : మే 21 - జూన్ 20

మిథున రాశి వారు వారంలో మొదటి రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా సోషల్ లైఫ్ గడపాలని అనుకుంటారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని పరితపిస్తారు. అయితే మీరు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే అతని సమస్య వినేందుకు ప్రయత్నించండి. మీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ ప్రవర్తన వల్ల మిమల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే అందరితో బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే సమస్యలన్నీ సద్దుమణుగుతాయి.

కర్కాటకం : జూన్ 21 - జూలై 22

కర్కాటకం : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి వారిపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. మీరు వృత్తిరీత్యా ఈ వారంలో కాస్త అసంతృప్తి లోనుకావొచ్చు. గత వారంలో మీరు ఎక్కువగా పని చేయడమో లేదంటే, ఆల్రెడీ నా టార్గెట్ అయిపోయింది ఇంకేం చేస్తాములే అనే నిర్లక్ష్యం వల్లనో మీరు కాస్త ఈ వారం పనిపై ఎక్కువగా ధ్యాస పెట్టకపోవొచ్చు. దీంతో డల్ నెస్ పెరిగిపోతుంది. ఫలితంగా బాస్ తో తిట్లుపడాల్సి వస్తుంది. సో.. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ వారం కాస్త ఎక్కువగా వర్క్ పై ఫోకస్ పెట్టండి లేదంటే మాత్రం ఇబ్బందులుపడతారు జాగ్రత్త.

సింహరాశి : జూలై 23- ఆగష్టు 22

సింహరాశి : జూలై 23- ఆగష్టు 22

సింహరాశి వారు ఈ వారం కాస్త లేజీగా ఉండొచ్చు. రిలాక్స్ గా గడపాలని కోరుకుంటారు. అయితే మీరు ఇంటికే పరిమితం కాకుండా కాస్త బయట తిరగడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఆ ప్రభావం మీపై పడుతుంది. సో టైమ్ వేస్ట్ చేయకండి.

కన్యరాశి : ఆగష్టు 23- సెప్టెంబర్ 22

కన్యరాశి : ఆగష్టు 23- సెప్టెంబర్ 22

కన్యరాశి వారికి ఈ వారం కలిసొస్తుంది. అయితే మీరు ఈ వారంలో మంగళవారం వరకు కాస్త ఆర్థిక సమస్యలు ఎదుర్కోవొచ్చు. కెరీర్ పరంగా మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం మంగళవారం నుంచి ఆ పనులు ప్రారంభించండి.

అలాగే ఈ వారంలో మీరు ఆధ్యాత్మికత విషయాలపై కూడా ఎక్కువగా దృష్టిపెట్టండి. దీంతో మీకు మానసిక ప్రశాంతత

చేకూరుతుంది.

తుల రాశి : సెప్టెంబరు 23- అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబరు 23- అక్టోబర్ 22

తుల రాశి వారికి వారిని అర్థం చేసుకునే భాగస్వామి ఈ వారంలో దొరికే అవకాశం ఉంది. ఈ వారంలో మీ మధ్య బంధం బలపడుతుంది. అయితే మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు వస్తే మాత్రం ప్రేమతోనే వాటిని పరష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

వృశ్చికం: అక్టోబర్ 23- నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23- నవంబర్ 21

మీరు జీవితంలో ముందుకెళ్లకుండా కొన్ని పరిస్థితులు మీకు అడ్డు తగులుతుంటాయి. అలాగే మీరు మీ భాగస్వామితో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్యంతో పాటు చిన్న చిన్న సమస్యలు ఎదురు కావొచ్చు. మీ సహోద్యోగులు మీ విషయంలో కొన్ని ఆటంకాలు సృష్టించవచ్చు. అయితే మీరు ధైర్యంగా ఉండి వారిని ఎదుర్కొంనేందుకు ప్రయత్నించండి.

ధనస్సు : నవంబర్ 22- డిసెంబర్ 21

ధనస్సు : నవంబర్ 22- డిసెంబర్ 21

ధనస్సు రాశి వారు ఈ వారంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వారి బాంధ్యవాలు ఈ వారంలో మరింత బలపడతాయి. మీ లైఫ్ కు మీరు ఎక్కువగా ప్రాముఖ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఒంటరిగా ఫీలవుతున్నట్లు అనిపిస్తే స్నేహితులతో కలిసి గడపడానికి ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ రాశి ప్రకారం మీకు ఎదురయ్యే కొన్ని సమస్యలను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది.

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

కొన్ని వారాలుగా మకరరాశి వారికి అన్నీ అనుకూలంగానే జరుగుతుంటాయి. ఈ వారంలో కూడా మకరరాశి వారికి అంతా సక్సెసే. మీరు చేపట్టబోయే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అయితే ఆర్థికపరంగా కొన్ని చిన్నచిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకుసాగిపోండి.

కుంభరాశి : జనవరి 20- ఫిబ్రవరి 18

కుంభరాశి : జనవరి 20- ఫిబ్రవరి 18

కుంభరాశి వారికి ఈ వారంలో గురువారం నుంచి బాగుంటుంది. మీరు కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇంటి గురించి మీ కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోకపోయే అవకాశం ఉంది. అయితే మీ సన్నిహితులకు కూడా మీరు ఎక్కువగా ప్రాముఖ్యం ఇవ్వండి.

మీనరాశి : ఫిబ్రవరి 19- మార్చి 20

మీనరాశి : ఫిబ్రవరి 19- మార్చి 20

మీనరాశి వారు జాబ్ మారాలని ఆలోచిస్తూ ఉండొచ్చు అయితే కొన్ని పరిస్థితుల వల్ల వీరు జాబ్ మారకపోవొచ్చు. మీకు మరికొన్ని రోజుల్లో మంచి రోజులు రానున్నాయి. అయితే మీ లక్ష్యసాధనలో మాత్రం మీరు వెనుకంజ వేయకండి.

Desktop Bottom Promotion