మీకు కాబోయే భాగస్వామి రాశిచక్రంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

Subscribe to Boldsky

మీకు కాబోయే భాగస్వామి రాశిచక్రంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలన్నా, ఒకరిని అర్ధం చేసుకోవాలన్నా మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఆ వ్యక్తి యొక్క రాశిచక్రం. ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క రాశిచక్రం గురించి తెలుసుకున్నప్పుడు, జీవితంలో తీసుకోబోవు నిర్ణయాలపై ఒక అవగాహనకు రాగలరు. తద్వారా జీవితాన్ని ఆనందదాయకముగా మలచుకోవచ్చు.

ఈవ్యాసములో మీ భాగస్వామి యొక్క రాశి చక్రముల గురించి తెలుసుకోవలసిన వాస్తవాలను వివరించడం జరిగినది.

మీ భాగస్వామి యొక్క రాశిచక్రం మరియు వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకొనుట ద్వారా, ఆపై తీసుకొను జాగ్రత్తల ద్వారా సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు. వారి రాశిచక్రం గురించి తెలుసుకోవడం ద్వారా వారిని మంచిమార్గంలో అర్ధం చేసుకొనుటకు సహాయపడుతుంది.

ముఖ్యంగా పెళ్ళి చేసుకొనుటకు తయారవుతున్న వారు , వారి భాగస్వామి యొక్క రాశిచక్రo తెలుసుకొనుట ద్వారా, వారిని అర్ధం చేసుకొనుటకు, మానసికంగా తయారవడం వలన వారి సంబంధం మరింత బలపడుతుంది.

మేషం (మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు)

మేషం (మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు)

మీరు ఈ వ్యక్తుల గురించి తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, వారు ప్రతివిషయంలోనూ ముందుగా ఉంటారు. ఏ విషయాన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెయ్యడం వీరి విధివిధానం. నిర్భయంగా, మానసిక దృడత్వాన్ని కలిగి ఉంటారు.

వృషభం (ఏప్రిల్ 20 నుండి మే 21 వరకు)

వృషభం (ఏప్రిల్ 20 నుండి మే 21 వరకు)

ఈ రాశి కలిగినవారు కొంచం మొండి పట్టుదల కలవారు. వారు అనుకున్న మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన్ని ఎవరైనా సూచిస్తే ఎంచుకొనుటకు ఇష్టపడరు. ముఖ్యంగా వారు ఏ పని చేసినా ఇష్టంగా అంకితభావంతో చేస్తారు. ఇతరులు తమని మార్చాలని చూసే ప్రయత్నాన్ని ఇష్టపడరు. తాము ప్రేమించిన వ్యక్తి కోసం నిరంతరం ఆలోచన చేస్తుంటారు. తమ ఆలోచనా ధోరణిని అవసరానికి తగ్గట్లు మార్చుకొనుటకు ఇష్టపడరు. ఒక ఉన్నతమైన స్వభావాన్ని కలిగిఉంటారు.

మిధునం (మే 22 నుంచి జూన్ 21 వరకు)

మిధునం (మే 22 నుంచి జూన్ 21 వరకు)

ఈ రాశి కలిగిన వారు అందరిలో ఉన్నతంగా కనిపిస్తారు తద్వారా ఆకర్షణీయంగా అగుపిస్తారు. వారి ఆలోచనా విధానం ప్రకారం వారు ఏమి కోరుకుంటున్నారు అని అంచనా వెయ్యడం కష్టతరం. వారు తమ ఆలోచనా ధోరణికి పదును పెట్టే ప్రయత్నం చెయ్యరు, మరియు మనసుకు ఒత్తిడిని కలిగించే ఆలోచనలను దూరంగా ఉంచడానికి ఇష్టపడుతారు. కాని సమస్యకి ఒక పరిష్కారం కోసం మాత్రం ఎదురుచూస్తుంటారు.

కర్కాటక రాశి(జూన్ 22 నుంచి జులై 22 వరకు)

కర్కాటక రాశి(జూన్ 22 నుంచి జులై 22 వరకు)

ఈ రాశి కలిగినవారు తమ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతని ఇస్తారు. తమ ప్రియమైన వారిని , స్నేహితులను సైతం తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. తాము ప్రేమించేవారికోసం ఎంత కష్టం చెయ్యడానికైనా సిద్దంగా ఉంటారు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

సింహం (జూలై 23 నుండి ఆగస్టు 22 వరకు)

సింహం (జూలై 23 నుండి ఆగస్టు 22 వరకు)

ఈ రాశికి చెందినవారు అన్నీ విషయాలలోనూ తమకే ప్రాధాన్యం లభించాలని కోరుకుంటూ ఉంటారు, తద్వారా కేంద్రబిందువుగా కనపడాలని పరితపిస్తుంటారు. వారు అనుకున్న పనులు జరుగుతుండడాన్ని మాత్రమే వారు ఆహ్వానించగలరు. మరియు అటువంటి పనులనే వీరు ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు ఎక్కువ శ్రద్ద కలిగినవారై ఉంటారు , తద్వారా ఏ విషయాన్నైనా సున్నితంగా అర్ధం చేసుకోగల మనస్తత్వం వీరి సొంతం అవుతుంది. వీరు ఎక్కువ నిశ్చలంగా మరియు బలముగా ఉంటారు, తద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకొనుటకు ప్రయత్నిస్తారు.

కన్య (ఆగష్టు 23 నుండి సెప్టెంబర్ 22 వరకు)

కన్య (ఆగష్టు 23 నుండి సెప్టెంబర్ 22 వరకు)

ఈ రాశి కలిగిన వారు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. ఎక్కువ జాగ్రత్త గా మరియు ఖచ్చితమైన ప్రణాళికలు చెయ్యడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు. ప్రణాళికలు తప్పు కావొచ్చు అని అనుమానంతో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించడం చేస్తుంటారు. తమకు కోరుకున్నది ఏదైనా వదిలివేయ్యడానికి ఇష్టపడరు. సాధించుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చెయ్యగలరు.

తుల (సెప్టెంబర్ 23 నుండి అక్టోబరు 22 వరకు)

తుల (సెప్టెంబర్ 23 నుండి అక్టోబరు 22 వరకు)

ఈ రాశి వారు ఒంటరిగా ఉండుటకు ఇష్టపడరు, తమ చుట్టూతా తమ ప్రియమైన వారు ఎల్లప్పుడూ ఉండాలని పరితపిస్తుంటారు. ప్రేమించినవారికోసం ఏం చెయ్యడానికైనా సిద్దంగా ఉంటారు, వారిని ఒక కంట కాపాడుతూనే ఉంటారు. తమ ఆనందాన్ని ప్రియమైన వారితో పంచుకోవడానికి ఇష్టపడుతారు. వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది. చివరగా వీరు ఇచ్చినంత ప్రేమ, సంరక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు.

వృశ్చికం (అక్టోబర్ 23 నుంచి నవంబరు 22 వరకు)

వృశ్చికం (అక్టోబర్ 23 నుంచి నవంబరు 22 వరకు)

ఈ రాశి కలవారు హాస్యాస్పదంగా ఎక్కువ అసూయగా ఉంటారు. అసూయ అన్నీ వేళలా సరికాదు అని గ్రహించలేరు. కాని తమని తాము ఎంతగా ప్రేమిస్తారో, తమని అలాగే అందరూ ప్రేమించాలి అన్న భావనతో ఉంటారు. వీరి అసూయలో కూడా ప్రేమ ఉంటుంది, అదే వీరి విశిష్టత.

ధనుస్సు (నవంబరు 23 నుంచి డిసెంబరు 21 వరకు)

ధనుస్సు (నవంబరు 23 నుంచి డిసెంబరు 21 వరకు)

ఈ రాశి కలవారి వ్యక్తిత్వం కాస్త అనుమానాస్పదంగా కనిపిస్తుంది, కాని వీరి ఆలోచనలప్రకారం వీరు ఎక్కువగా తెలుసుకోవడానికి నిరంతర అన్వేషిగా ఉంటారు. ఏ విషయాన్నైనా సున్నితంగా స్వీకరిస్తారు. కొంచం ఆందోళన కలిగినవారిలా కనిపిస్తుంటారు.

మకరం (డిసెంబరు 22 నుంచి జనవరి 20 వరకు)

మకరం (డిసెంబరు 22 నుంచి జనవరి 20 వరకు)

ఈ రాశి కలిగినవారు సమయానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు, మరియు తమ మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి మొగ్గుచూపుతారు. విలక్షణ శైలి వీరి ఆహార్యం. వీరు మాట మీద నిలబడడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, తద్వారా తమ భాగస్వామి కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటారు.

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 18 వరకు)

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి కలిగిన వారు ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కష్టసమయాల్లో వీరి ఓదార్పు దైర్యాన్నిస్తుంది. కాని ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి లేదా ఒకరిద్దరు ప్రియమైన వారితో మాత్రం ఉండడానికి ప్రయత్నిస్తారు. స్వావలంబనకోసం ప్రత్యేక స్థలాన్ని కోరుకుంటారు. చుట్టూతా ఎక్కువ మంది అప్రియులు ఉండడాన్ని సహించలేరు. కాని తాము చేసే పనియందు మాత్రం చిత్తశుద్దిని కలిగి ఉంటారు.

మీనం (ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు)

ఈ రాశి కలిగినవారు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటారు. సున్నితంగా సానుభూతిని కలిగి ఉంటారు. తమ ప్రియమైన వారి కష్టాలయందు తమ కష్టాలను లెక్కచెయ్యని మనస్తత్వం కలిగి ఉండి, వారిని దగ్గరకు తీసుకుని దైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Getting Married? Know About Your Partner’s Zodiac Sign

    Each zodiac sign has its own share of traits. To understand and know a person in a better way, it is necessary that you need to know about his/her zodiac sign, as this better prepares you to handle any circumstance that may arise out of agruments with your partners. Being impulsive, emotional, indecisive, etc., are particular characteristic traits.
    Story first published: Sunday, March 4, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more