For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రపంచంలో చివరికి మిగిలిన తెగలు

|

ప్రపంచంలో ప్రజలు అనుసరించే అనేక సంస్కృతులు, ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలక్రమేణా అంతరిస్తూ వచ్చాయి. ప్రస్తుతం అలాంటి తెగలు వేళ్ళ మీద లెక్కబెట్టేలా ఉన్నాయి అనడంలో ఆశ్చర్యమే లేదు.

ఇక్కడ, ఈ వ్యాసంలో, బోల్డ్స్కీ లో మేము ప్రపంచంలో చివరగా మిగిలిన తెగల జాబితాను పంచుకుంటున్నాము. ఇవి కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న తెగల జాబితాలో ఉండడం శోచనీయం.

జిమ్మి నెల్సన్ అనే ఒక ఫోటోగ్రాఫర్, మూడు సంవత్సరాల పాటు, బయటి ప్రాంతాలతో సంబంధం లేని అనేక రిమోట్ ప్రాంతాలకు ప్రయాణిస్తూ, ఇప్పటికీ మిగిలి ఉండి చివరగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న తెగలు లేదా జాతుల గురించిన వివరాలను సేకరించి ప్రపంచానికి అందించాడు. ఈ తెగలలో కొన్ని అత్యంత ప్రమాదకరమైన తెగలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే, వీరి తెగ కాకుండా మరే ఇతర మనిషి కనిపించినా బాణాలతో కొట్టి చంపేసే ప్రదేశాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్మగలరా. కాని అన్ని తెగలూ అలాగే ఉంటాయి అనుకోవడానికి కూడా లేదు

ఆ తెగలేమిటి, వాటి వివరాలేమిటి తెలుసుకుందాం :

అసరో ట్రైబ్ :

అసరో ట్రైబ్ :

పపువా, న్యూగునియా లో ఈ తెగ ఉంది. ఇక్కడ తెగ ప్రజలు తమ ముఖాన మట్టి లేదా బురద కూడుకున్న మాస్కులు వేసుకుని తరచుగా ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అది కూడా అప్పుడప్పుడు వేకువజాము సమయాల్లో.

చైనీస్ ఫిషింగ్ ట్రైబ్ :

చైనీస్ ఫిషింగ్ ట్రైబ్ :

ఈ తెగ గువాంగ్సీ, చైనాలో ఉంది. భూమ్మీద ఉన్న అన్ని తెగలలో ఈ ఒక్క తెగ మాత్రమె ఇంకా “కర్మోరెంట్ ఫిషింగ్ టెక్నిక్” ను చేపలు పట్టడానికి ఉపయోగిస్తుంది. పక్షులను నియంత్రించడానికి, ఈ మత్స్యకారులు పక్షి యొక్క గొంతుకు ఒక వల వంటి వస్తువును కడుతారు. తద్వారా ఈ పక్షులు పెద్ద చేపలను మింగలేవు.

మాసై ట్రైబ్ :

మాసై ట్రైబ్ :

ఈ తెగ టాంజానియా నుండి వచ్చింది. ఇది ఉనికిలో ఉన్న అతి పురాతన యుద్ధ సంస్కృతులను పాటించే తెగలలో ఒకటి. ఈ జాతి యువకులు ఒక వ్యక్తిగా మరియు ఒక యోధునిగా బాధ్యతలు తీసుకుంటారు. మరియు మెళకువలను తెలుసుకుంటారు.

నేనెట్స్ ట్రైబ్ :

నేనెట్స్ ట్రైబ్ :

ఈ తెగ యమాల్లో ఉంది. ఈ గిరిజన ప్రజలు యమద్ ద్వీపకల్పంలో సంచరించే రైన్డీర్ పశుపోషకులుగా ఉంటారు. ఈ తెగ 1000 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది మరియు శీతాకాలంలో -50°సెంటీగ్రేడ్ నుండి వేసవి కాలంలో 35°సెంటీ గ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉండే ఈ ప్రదేశాల్లో వీరి నివాసాలు ఉన్నాయి.

మావోరీ ట్రైబ్:

మావోరీ ట్రైబ్:

ఈ తెగ న్యూజిలాండ్ నుండి వచ్చిన వారు. వారు అనేక దేవుళ్ళను, దేవతలను మరియు ఆత్మలను ఆరాధించేవారిగా ఉన్నారు. వారు పూర్వీకుల ఆత్మలు మరియు మానవాతీత జీవులు ఎల్లప్పుడూ వారి చుట్టూ ఉంటాయని నమ్ముతుంటారు. మరియు వారు అవసర సమయాలలో వారి గిరిజన తెగకు సహాయం కూడా చేస్తారని నమ్ముతుంటారు.

గోరోకా ట్రైబ్:

గోరోకా ట్రైబ్:

పపువా, న్యూగునియాలో ఉన్న తెగ ఇది. వారికి మంచి ఆహారం, మంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి, మరియు వారు ప్రకృతి అద్భుతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. వారు ప్రపంచవ్యాప్తంగా 99% ఇతర తెగల వలనే వీరు వేటగాళ్లు, సంగ్రాహకులు మరియు రైతులుగా ఉన్నారు. ఈవ్యక్తులు సొగసైన అలంకరణ మరియు ఆభరణాలతో శత్రువులను ఆకట్టుకోవడానికి అనేక తెలివైన ప్రయత్నాలు చేస్తుంటారు.

హులీ ట్రైబ్ :

హులీ ట్రైబ్ :

పపువా,న్యూగునియా నుండి వచ్చిన మరొక తెగ. ఇది అంతరించిపోయిన తెగలలో అంచున, చివరి స్థితిలో ఉంది. పందులు మరియు మహిళలను ఈ తెగలో వివిధ సమూహాలుగా కలిగి ఉంటారు. అతిపెద్ద దేశీయ సమూహంగా ఉన్న తెగలలో ఇది కూడా ఒకటి. భూమిపై ఉన్న 'హులీ విగ్మెన్', వారి ముఖాలను పసుపు, ఎరుపు మరియు తెలుపు రంగులను చిత్రించుకుని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వారు తమ స్వంత జుట్టు నుండి విగ్ లను, ఆభరణాలను తయారుచేసే సంప్రదాయానికి కూడా ప్రసిద్ధి చెందారు.

కజఖ్ ట్రైబ్ :

కజఖ్ ట్రైబ్ :

ఈ జాతి టర్కి, మంగోలియా మరియు ఇండో-ఇరానియన్ ప్రాంతాలకు చెందిన తెగలుగా ఉన్నారు. వారి భూభాగం సైబీరియా మరియు నల్ల సముద్రం మధ్యన ఉంటుంది. వారు వారి పురాతన కళ అయిన డేగ వేటలో ప్రసిద్ధి చెందారు.

కరో ట్రైబ్:

కరో ట్రైబ్:

ఈ తెగ ఇథియోపియా నుండి వచ్చిన తెగ. ఇది ఆఫ్రికాలోని గ్రేట్ రిఫ్ట్ లోయలో ఉంది. వేల సంవత్సరాలుగా వ్యాపార వాణిజ్య సంబంధిత వస్తువులకై అక్కడ నివసిస్తున్న సుమారు 2,00,000 మంది స్థానిక ప్రజలకు ఇది నివాసంగా ఉంది. వారు తుపాకులు మరియు బుల్లెట్లకు ఎక్కువ ప్రసిద్ధి చెందిన వారుగా ఉన్నారు. ఇంక అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఈతెగలలో ఉన్నాయో అని.

డస్సనెచ్ ట్రైబ్:

డస్సనెచ్ ట్రైబ్:

ఈ తెగ ఇథియోపియాలో ఉంది. మరియు డస్సనెచ్ తెగలో భాగమవడానికి ఇథియోపియన్గానే ఉండవలసిన అవసరం లేదు. ఏ జాతి వారైనా ఇక్కడ స్వాగతించబడుతారు, అన్ని తెగల వారిని, తమలోనికి సాదరంగా ఆహ్వానిస్తారు.

వనాటు ట్రైబ్ :

వనాటు ట్రైబ్ :

ఈ తెగ రాహ్ లావా ద్వీపం, టోర్బా ప్రావిన్స్ లో ఉంది. వారి నృత్యం ద్వారా డబ్బు మరియు సంపదను పొందవచ్చని నమ్ముతారు. నృత్యం వారి సంస్కృతిలో ముఖ్యమైన భాగం.

లడఖి ట్రైబ్:

లడఖి ట్రైబ్:

ఈ తెగ భారతదేశానికి చెందినది. వారు తమ టిబెటన్ పొరుగువారి పట్ల ఇష్టులై ఉంటారు. వారి నమ్మకాలు టిబెటియన్ బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ ఉంటాయి. బౌద్ధమతపు ముందు కాలాలలోని భయంకరమైన దెయ్యాల చిత్ర పటాలను కూడా వీరు విశ్వసిస్తుంటారు.

ముర్సి ట్రైబ్ :

ముర్సి ట్రైబ్ :

ఈ తెగ ఇథియోపియాలో ఉంది. ఈ యోధులు వారి శరీరంపై గుర్రపు ఆకారపు మచ్చలను కలిగి ఉంటారు. తెగకు చెందిన పురుషులు తమ కుడి చేతుల్లో చీలిక కలిగిన గాయాలను కలిగి ఉంటారు. అయితే మహిళలు తమ ఎడమ చేతుల్లో ఇలాంటి గాయాలను కలిగి ఉంటారు. వారు విజయవంతమైన యోధులయినప్పుడు, వారి తొడలపై కూడా ఇలాంటి మచ్చలను వేసుకుంటూ ఉంటారు.

రబరీ ట్రైబ్ :

రబరీ ట్రైబ్ :

ఈ తెగ భారతదేశానికి చెందినది. ఈ గిరిజన ప్రజలు వెయ్యి సంవత్సరాలుగా పశ్చిమ భారతదేశంలోని ఎడారులు మరియు మైదానాలను ఆక్రమించి జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ తెగకు చెందిన స్త్రీల ఎంబ్రాయిడరీలో అసాధారణమైన నైపుణ్యం కలదు. ఇది వారి యొక్క వస్త్ర సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని తెలిపేదిగా ఉంటుంది.

సాంబూరు ట్రైబ్ :

సాంబూరు ట్రైబ్ :

ఈ తెగ టాంజానియా నుండి వచ్చింది. ఈ తెగ ప్రజలు సంచార ధోరణులను ప్రదర్శిస్తుంటారు. మరియు వారి పశువుల పెంపకం కోసం వారు ప్రతి 5,6 వారాలకు వలసలకు పూనుకుంటూ ఉంటారు.

ముస్టాంగ్ ట్రైబ్ :

ముస్టాంగ్ ట్రైబ్ :

ఈ జాతి నేపాల్ నుండి వచ్చింది. ప్రజలు మతభావాలను కలిగి, ఇప్పటికీ ప్రపంచం బల్లపరుపుగా ఉందని నమ్ముతారు. ఈ జాతి కనుమరుగవుతున్న జాతుల్లో ఒకటిగా ఉన్నది, మరియు నిజమైన టిబెటన్ సంస్కృతులలో ఇది కూడా ఒకటి.

మీకేమైనా తెగల గురించిన సమాచారం తెలిసి ఉన్న ఎడల, క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి.

All Images Source

English summary

How Many Tribes Really Exist?

Jimmy Nelson has spent three years visiting the most hard-to-access places on the planet to capture some mind-blowing photos of the last surviving tribes on Earth. These are the last few tribes that are existing on earth. The people of the Asaro Tribe still make their presence felt by scaring others with mud masks.
Story first published: Tuesday, May 15, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more