వాలైంటైన్ జైలర్ కూతురు నడిపిన ప్రేమకథ

Written By:
Subscribe to Boldsky

ప్రేమికుల రోజు అంటే యువతకు బాగా ఇష్టం. ఆ రోజు లవర్స్ కు ఐ లవ్ చెప్పి.. వారిని మెప్పించి.. ఒప్పించి.. పెళ్లి దాకా వెళ్లే యువత చాలా మందే ఉంటారు. ఎన్నో రోజులుగా మనస్సులో దాచుకున్న మాటను ప్రేమికుల రోజు చెప్పాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే సంవత్సరంలో ఇన్ని రోజులున్నా ఫిబ్రవరి 14 మాత్రమే ఎందుకు ప్రేమికులు రోజు అయ్యింది. దీని వెనుకు కొన్ని కథలున్నా.. అందులో ఒకదాన్ని అందరూ నమ్ముతారు.

రోమ్‌ అధిపతిగా క్లాడియస్

రోమ్‌ అధిపతిగా క్లాడియస్

ఏడీ 270లో రోమ్‌ అధిపతిగా క్లాడియస్ ఉండేవాడు. క్లాడియస్ కు రాజ్యాన్ని బాగా విస్తరించాలనే ఒక కోరిక ఉండేది. మరి రాజ్యాన్ని విస్తరించాలంటే ఆయనకు దేశంలోని యువత చాలా అవసరం. యువతను మొత్తాన్ని తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగించుకోవాలనుకున్నాడు.

Image Source

సైన్యంలో చేరమని ఆజ్ఞాపించాడు

సైన్యంలో చేరమని ఆజ్ఞాపించాడు

అయితే యువకులంతా వారివారి వ్యామోహాల్లో పడి క్లాడియస్ తీసుకున్న నిర్ణయానికి అంకితభావంతో పని చేసేవారు కాదు.ఎలా అయినా సరే యువతను మొత్తం తన సైన్యంలో చేర్చుకోవాలనుకున్నాడు. అందరినీ సైన్యంలో చేరమని ఆజ్ఞాపించాడు.

Image Source

క్లాడియస్ కు ఒళ్లు మండింది

క్లాడియస్ కు ఒళ్లు మండింది

అయితే యువత మాత్రం ప్రేమ పేరుతో ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు. ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కుటుంబంతో గడపడం.. ఇలాంటి వాటిలో యూత్ మొత్తం నిమగ్నమైపోయింది. దీంతో రాజు క్లాడియస్ కు ఒళ్లు మండింది.

Image Source

ప్రేమను పెళ్లిళ్లను ఆపేశాడు

ప్రేమను పెళ్లిళ్లను ఆపేశాడు

క్లాడియస్ తన రాజ్యంలో ప్రేమను, పెళ్లిళ్లను ఆపేశాడు. దీంతో యూత్ లవ్ చేసుకుందామంటే స్వేచ్ఛ ఉండేది కాదు. యువత మొత్తానికి ఏదో అయినట్ల అయిపోయింది. తమ ఎనర్జీ మొత్తం లవ్ కాబట్టి దాన్ని దూరం పెడితే ఎలా అని యూత్ ఆందోళన చెందారు.

వాలెంటైన్ అలా నమ్మేవాడు

వాలెంటైన్ అలా నమ్మేవాడు

అయితే రోమ్ లో రోమన్‌ క్యాథలిక్‌ బిషప్‌గా సెయింట్ వాలెంటైన్‌ అనే వ్యక్తి ఉండేవారు. ఆయన క్లాడియస్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యువతలో ప్రేమ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారని వాలెంటైన్ నమ్మేవాడు.

క్లాడియస్ కు తెలియకుండా వివాహాలు

క్లాడియస్ కు తెలియకుండా వివాహాలు

ప్రేమించుకున్న యువతీ యువకులకు ఆయన ప్రేమోపదేశాలు చేసేవారు. ఇష్టపడ్డ జంటలకు క్లాడియస్ కు తెలియకుండా ప్రేమ వివాహాలను జరిపించేవాడు. సెయింట్ వాలెంటైన్ కు రోజురోజుకు యువతలో మంచి పేరు వచ్చింది.

వాలైంటైన్ ను జైలులో నిర్బంధించాడు

వాలైంటైన్ ను జైలులో నిర్బంధించాడు

వాలెంటైన్ తన ఆదేశాలకు వ్యతిరేకంగా యూత్ కి ఇలా ప్రేమ సందేశాలు ఇస్తున్నారని, యువతని చెడగొడుతున్నారని రోమ్‌ రాజు క్లాడియస్‌కి తెలిసింది. సైన్యంలో చేరి దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి వారిని పక్కదోవ పట్టిస్తున్నాడని వాలైంటైన్ ను జైలులో నిర్బంధించాడుక్లాడియస్.

క్లాడియస్‌ కుమార్తె కూడా

క్లాడియస్‌ కుమార్తె కూడా

వాలెంటైన్‌ ను చంపితే తప్పా తన ఆశయం నెరవేరేటట్లు లేదనుకున్నాడు క్లాడియస్. వాలెంటైన్ కు మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో రోమ్ లోని యువత మొత్తం కన్నీరుగార్చింది. వాలెంటైన్‌ అభిమానుల్లో క్లాడియస్‌ కుమార్తె కూడా ఉండటం విశేషం.

వాలెంటైన్ ప్రేమనే నమ్మాడు

వాలెంటైన్ ప్రేమనే నమ్మాడు

క్లాడియస్‌ వాలెంటైన్ ను కారాగారంలో బంధించాడు. వాలెంటైన్ ను క్లాడియస్ తన మనుషులతో రాళ్లతో కొట్టించాడు. నానా హిం

సలు పెట్టాడు. అయినా వాలెంటైన్ మాత్రం ప్రేమనే నమ్మాడు. ప్రేమతోనే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు అనుకున్నాడు. కోపాలు, రాగద్వేషాలు పనికిరావని అనుకున్నాడు.

జైలర్‌ కూతురితో పరిచయం

జైలర్‌ కూతురితో పరిచయం

జైల్ లో ఉన్నప్పుడు వాలెంటైన్‌కు జైలర్‌ కూతురితో పరిచయం ఏర్పడింది. ఆమె అంధురాలు. ఆమెకు కూడా వాలెంటైన్ ప్రేమ గురించి వివరించాడు. ప్రేమకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏమి లేదని ఆమెకు కూడా బోధించాడు. ఆమెను ప్రేమించాడు కూడా.

చూపు వచ్చింది

చూపు వచ్చింది

కొన్ని రోజులకు జైలర్ కూతురికి కాస్త చూపు వచ్చింది. అప్పటికే వాలెంటైన్ ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరణించే ముందు వాలెంటైన్‌ ఆమెకు నీ వాలెంటైన్స్‌ నుంచి... అంటూ ఒక ప్రేమ సందేశం పంపాడు.

ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు

ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు

వాలైంటైన్ ను ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు క్లాడియస్. వాలెంటైన్‌ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్ కు సంబంధించిన రోజుగా అంటే వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు. అలా వాలెంటైన్ కు సంబంధించిన జ్ఞాపకార్థం రోజు ఇప్పుడు వాలైంటైన్స్ డేగా.. ప్రేమికుల రోజుగా మారింది.

English summary

who was st valentine how did he get killed

who was st valentine how did he get killed