ఓ మై గాడ్, చెవిలో సాలీడు గూడు కట్టుకుని నివసిస్తోందా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీకు వచ్చిన పీడ కలల్లో దారుణమైంది ఏమిటి ? జీవితంలో ఊహించలేని సంఘటనలు కలలో వచ్చి భాదపెడుతుంటే, ఖచ్చితంగా పీడకలే అని అంటాం. కొందరికి జంతువులు తరిమినట్లుగా, కొందరికి చీకటి ఆవరించుకుని ఉన్నట్లుగా, కొందరికి దెయ్యాలు భూతాలూ, కొందరికి యాక్సిడెంట్లూ, హాస్పిటళ్ళూ పీడ కలలుగా వస్తుంటాయి. జీవితంలో కొన్ని సంఘటనలు తిరిగి రాకూడదు అని కోరుకుంటూ ఉంటాము, అలాగే కొన్ని కలలు కూడా.

కలల సంగతేమో కాని ఇలలో కూడా అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఏమనాలి చెప్పండి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన అలాంటి చెత్త పీడకల వంటిదే మరి. మనుషులు ఒక్కోసారి ఏ ఇతర వ్యక్తి ఎదుర్కొనని కొన్ని అసాధారణ పరిస్థితులకు లోనవుతుంటారు, అప్పుడే అది వింతగా పరిగణించబడుతుంది. తద్వారా ప్రపంచమంతా చక్కర్లు కొడ్తుంది. అలాంటి ఘటనే ఇది. ఒక మహిళ, తల నొప్పి తీవ్రంగా భాదిస్తూ ఉందని వైద్యుని వద్దకు వెళ్తే, పరీక్షించిన డాక్టర్ ఆవిడ చెవిలో సాలీడు పురుగు, దాని నివాసాన్ని చూసి నివ్వెరపోయాడు. చూసిన వైద్యుడే నివ్వెరపోతే, మరి రోగి గతేంటి.

Womans Headache Turns Out To Be Due To A Spider Living In Her Ear!

మరియు ఆ సాలీడు బ్రతికి ఉండడమే కాకుండా, ఒక చోటి నుండి మరొక చోటికి స్వేచ్చగా కదులుతూ ఉండడం వలన తీవ్రమైన భాధకు లోనవ్వడం ఆవిడ వంతైంది. సామాజిక మాధ్యమాల్లో, అక్కడ అంతా డొల్లనా అంటూ కామెంట్లు పెడుతున్నారు కూడా.

ఈ వింత సంఘటన గురించిన పూర్తి వివరాలు మీకోసం :

ఈ పరిస్థితి ఎక్కడో కాదు, జరిగింది భారత దేశంలోనే :

ఈ మహిళ భారత దేశానికి చెందిన మహిళ. నిద్ర లేచినప్పుడు, తన చెవిలో ఏదో అసాధారణ మార్పులను గమనించింది. మరియు ఏదో తెలియని భాద పీడించసాగింది. నెమ్మదిగా ఆ నొప్పి చెవి నుండి తలకు కదలడంతో సమస్య పరష్కారం దిశగా వైద్యుని సంప్రదించింది. మొదట్లో ఈ నొప్పిని పెద్ద సమస్యగా భావించకపోయినా, నొప్పి జఠిలమవుతున్న దృష్ట్యా, కనీసం ఏదేని పిన్ ను కూడా చెవిలోనికి పెట్టలేని పరిస్థితికి చేరుకున్న ఎడల, అసలు ఎందుకు ఆనొప్పి వచ్చిందో కూడా కనీస అవగాహన లేని తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించింది.

వైద్యులు పరీక్షించి, షాక్ కు గురయ్యారు :

ఆమె నొప్పికి గల మూల కారణాన్ని వైద్యులు కనుక్కొన్నప్పుడు, షాక్ కు గురవడం వారి వంతైంది. చెవిలో ఒక సాలీడు పురుగుని, దాని నివాసాన్ని కనుగొన్న వారికి ఇదొక అసాధారణ విషయంగా తోచింది.

ఆవిడకు పరిస్థితిని వివరించినప్పుడు :

వైద్యులు ఆమెకు పరిస్థితిని వివరించినప్పుడు, చాలా ఇబ్బందికరమైన అనుభూతికి, తద్వారా షాక్ కు లోనైంది. నిజానికి ఈ విషయం వినగానే, వెన్నులో వణుకు పుట్టి నిశ్చేష్టురాలైంది. వైద్యులు తెలిపిన ప్రకారం, ఇటువంటి అసాధారణ సంఘటనలు అరుదుగా సంభవిస్తాయని, మరియు పురుగు వెళ్ళడమే కాకుండా, నివాసం ఏర్పరచుకోవడం అత్యంత అరుదైన సంఘటన అని తెలిపారు. దీనికి ఆపరేషన్ కూడా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా ఉంటుందని, ఎటువంటి తేడా వచ్చినా అనేక ప్రతికూల సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తుందని కూడా తెలిపారు.

మహిళ యొక్క ఆందోళన స్థాయిలు అధికంగా పెరగడంతో, రక్త పోటు సమస్యల దృష్ట్యా ఆపరేషన్ చాలా కష్టమైంది. ఒకసారి ఆమె సత్యాన్ని కనుగొన్న తర్వాత, ఆమె దానిని ఎట్టిపరిస్థితుల్లో చెవిలో ఉంచుకోడానికి ఇష్టపడదు. మరియు సాలీడును తొలగించే ముందు వైద్యులు ఆమెకు మత్తుమందు ఇవ్వవలసి ఉంటుంది.

ఆపరేషన్ విజయవంతమైంది :

ఆమెకు సెడేట్(మత్తుమందు ఇవ్వడం) చేసిన తర్వాత, చెవి కెనాల్ ను పూరించడానికి సెలైన్ వాటర్ ను వినియోగించారు. తద్వారా చిన్ని పరికరాల ద్వారా నెమ్మదిగా సాలీడుని తొలగించగలిగారు. నొప్పి కూడా సద్దుమణిగి, మరలా సాధారణ జీవితానికి మార్గం సుగమం అయింది. చెవి కెనాల్ అత్యంత సున్నితంగా ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా అనేక సమస్యలు ఎదురవక తప్పదు.

మన చెవులలోకి కీటకాలు మరియు పురుగులు వెళ్ళకుండా అడ్డుకోవడం ఎలా?

చీమలు మరియు పేల(లైస్) వంటి చిన్న చిన్న జీవులు చెవుల లోపలికి చేరుతుంటాయి, ఎందుకంటే వాటికి సులభంగా అందుబాటులో ఉంటాయి. దీనిని నివారించడానికి, మీరు సాధారణంగా సాలెపురుగులు మరియు ఇతర చిన్న ప్రాణులచే నివసించే మురికి ప్రదేశాలలో నిద్రించకూడదు. మరియు కీటకాలు చేరకుండా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రపరచుకోవడం తప్పనిసరి.

ఇటువంటి అరుదైన సంఘటనలను మీ ముందుకు తీసుకురావడంలోని ఆంతర్యం, ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికే. తద్వారా జాగ్రత్తలు తీసుకోగలరని మానమ్మకం. ఒక్కోసారి తేలికగా తీసుకునే కొన్ని విషయాలు ప్రాణాలతో చెలగాటమాడుతాయని మనందరికీ తెలియనిది కాదు. కొంచం దూరమే కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లి, వాహనాల కిందకి వెళ్ళిన వారిని మనం తరచుగా చూస్తుంటాం. కావున ఏ విషయంలోనూ అజాగ్రత్త పనికి రాదు. ప్రపంచంలో ఏ విషయం అయినా చిన్నది అనేది ఉండదు. మనం ఆలోచించే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కావున ప్రతి అడుగులోనూ జాగ్రత్త తప్పనిసరి. అలాగని భయపడుతూ బ్రతకనవసరం లేదు, తెలివితో మెలగమని మా సూచన. అంతే.

ఇటువంటి వింతైన సంఘటనల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే తరచుగా మాపేజీని సందర్శిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఈ ఆర్టికల్ మీ ప్రియమైన వారితో పంచుకోండి.

English summary

Woman's Headache Turns Out To Be Due To A Spider Living In Her Ear!

A woman from India complained of a tingling sensation inside her head and assumed it to be a headache. It sent her into a fit of rage and profound pain, as she had no idea of what was going on inside her head. When she visited the hospital, the doctors found out the main reason was a "SPIDER"!She Had A Living Spider In Her Ear
Story first published: Thursday, May 10, 2018, 18:00 [IST]