ఆమె రూపం అందవికారం.. ఆమె కథ విషాదం

Written By:
Subscribe to Boldsky

పాపం ఆమె ఒక ముసలావిడ. ఆమెకు రోజు గడవడమే చాలా కష్టం. రోజంతా పని చేస్తేగానీ మూడుపూటల అన్నం దొరకని దుస్థితి. అలాంటి ముసలావిడకు ఎక్వరికీ రాకూడని కష్టం వచ్చింది.

ఆమె పేరు వయాంగ్ బూన్మే. ఆమె వయస్సు 63. ఆమెది థాయ్ లాండ్.

నిరాకరణ

నిరాకరణ

డాక్టర్లు ఆమెకు సర్జరీ చేస్తే బాగు అవుతుందని చెప్పారు. కానీ ఆమె మాత్రం అందుకు నిరాకరిస్తుంది. ఒక వేళ సర్జరీ చేస్తే తాను చనిపోతానేమోనని బాధపడుతుంది. బ్యాంకాక్ లో ఈమె పూలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది.

కంటిచూపు లేదు

కంటిచూపు లేదు

అయితే ఈమెకు కంటిచూపు కూడా పోయింది. ఈమెకు ఏమి కనపడదు. రోజూ ఈమె కూతురు ఆమెను పూలు అమ్మే ప్లేస్ దగ్గరకు తీసుకొచ్చి వదిలిపెడుతుంది. ఆమె కూతురు కూడా ఈమెను పోషించలేని స్థితిలో ఉంది. అందుకే తల్లి అలా బాధపడుతున్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది.

న్యూరోఫిబ్రోమాటిసిస్

న్యూరోఫిబ్రోమాటిసిస్

ఈమె 'న్యూరోఫిబ్రోమాటిసిస్' అని వ్యాధితో బాధపడుతోంది. ఈమె చిన్నప్పుడే ఈ వ్యాధి బారిన పడింది. మొదట చిన్నచిన్న గడ్డలు శరీరంపై ఏర్పడ్డాయి. తర్వాత నరాలపై ప్రభావం పడింది. ఆ తర్వాత బాడీ మొత్తం కూడా మారిపోయింది. ముఖ్యంగా ఆమె ముఖం చాలా అందవికారంగా తయారైంది.

ఆరోగ్య సంక్షేమ సంఘం

ఆరోగ్య సంక్షేమ సంఘం

అయితే స్థానికులు ఈమె పరిస్థితిన చూసి ఆరోగ్య సంక్షేమ సంఘం సహాయాన్ని కోరారు. ఆ ముసలావిడకు ఎలాగైనా సాయం చేయడంటూ విన్నవించారు. దీంతో సంఘం వారి తరఫున డాక్టర్లు ముందుకొచ్చారు. ముసలావిడకు చికిత్స చేస్తామన్నారు.

సర్జరీ అంటే భయం

సర్జరీ అంటే భయం

ఆ ముసలావిడకు అన్ని రకాలుగా శస్త్ర చికిత్స చేసి మళ్లీ మునపటి స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. కానీ ఈ బామ్మకు సర్జరీ అంటే చాలా భయం. నేను ఇలాగే ఉంటాను కానీ సర్జరీ మాత్రం చేయించుకోను. దయచేసి నన్ను ఇలాగే ఉండనివ్వండి అంటూ వేడుకుంటుంది.

ఎందుకంటే..

ఎందుకంటే..

సర్జరీ చేయించుకుంటే చాలా రకాలుగా ఇబ్బందులుపడాల్సి వస్తుందని ఈ ముసలావిడ అనుకుంటుంది. సర్జరీ ఫెయిలైతే తాను చనిపోతానేమోమనని అని భావిస్తోంది. ముఖం అందవికారంగా ఉన్నా.. అంధత్వం ఉన్నా తాను ఇలాగే బతుకునానుంటుంది. అంతేకానీ సర్జరీ చేయించుకోని చనిపోవాలని తాను భావించడం లేదని ఆవేదన చెందుతోంది.

భయంకరంగా

భయంకరంగా

అయితే బ్యాంకాక్ లోని ప్రధాన వీధుల్లోనే ఈమె పూలు అమ్ముతూ రోజూ స్థానికులకు కనపడుతూ ఉంది. ఈమె రూపం చాలా భయంకరంగా ఉండడంతో రోజూ అటు వైపు వెళ్లే స్థానికులు ఈమెపై సానుభూతి చూపుతూ ఉంటారు.

అయినా పని చేస్తూనే

అయినా పని చేస్తూనే

అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారే ఏదైనా పని చేయాలంటే చాలా విసుగు చెందుతారు. అలాంటిది ఈమె కళ్లు కనపడుకున్నా.. శరీరం సహకరించకున్నా.. రూపం బాగా లేకున్నా రోజూ పూలు అమ్ముతూ బతుకుతోంది. చేసేపనిపై శ్రద్ద ఉండి.. సంకల్పంతో జీవనాన్ని సాగిస్తే చాలు అనడానికి ఈమె నిదర్శనం.

All Images Source :https://www.youtube.com/watch?v=NfS9b-umWOc

English summary

woman with rare melting face condition refuses surgery

woman with rare melting face condition refuses surgery
Story first published: Monday, January 15, 2018, 14:30 [IST]