For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శోభనం రోజు శృంగారం చేసి కన్యనో కాదో తేల్చుతారు.. కాకపోతే నరకం చూపిస్తారు

కొత్తగా పెళ్లైన జంట శృంగారంలో పాల్గొంటుంది. అప్పుడు పెళ్లికూతురికి ఓ తెల్లటి దుప్పటి ఇచ్చి.. శృంగార సమయంలో వాడాలని చెబుతారు. ఇక శృంగారం జరుగుతున్నప్పుడు బయట కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు కూర్చొంటారు.

By Bharath
|

ఆడదంటే అందరికీ ఆట బొమ్మ అయ్యింది. మగవాడు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకునే నాథుడే ఉండడు కానీ అమ్మాయిలను మాత్రం పుట్టినప్పటి నుంచి రకరకాలుగా వేధిస్తుంటూనే ఉంది మన సమాజం. ప్రపంచం మొత్తం ఆధునికతవైపు పరుగెడుతున్న ఇంకా మనదేశంలో స్త్రీలకు కన్యత్వ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మనదేశంలోనే కాదు ప్రపంచలో చాలా చోట్ల మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.

శోభనం రోజు రాత్రి తెల్లటి దుప్పటి

శోభనం రోజు రాత్రి తెల్లటి దుప్పటి

మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ లో ఈ మధ్యే ఒక సంఘటన జరిగింది. ఒక పెళ్లికొడుకు ( ఈయన వయస్సు కూడా నలభై పైనే ఉంది) పెళ్లి చేసుకున్నాక తర్వాత ఆ అమ్మాయితో శోభనంలో కూడా పాల్గొన్నాడు. అయితే శోభనం రోజు రాత్రి పెళ్లి కూతురు కింద తెల్లటి దుప్పటి పరచడం అక్కడి ఆచారం. దానికి ప్రధాన కారణం అమ్మాయి కన్యనా అని తెలుసుకోవడమే. ఇక ఈయనగారు అమ్మాయితో ఫస్ట్ నైట్ బాగానే ఎంజాయ్ చేశారు.

నా భార్యకు చాలా మంది వ్యక్తులతో సంబంధం

నా భార్యకు చాలా మంది వ్యక్తులతో సంబంధం

అయితే ఉదయం లేచి తన పెళ్లి చేసుకున్న అమ్మాయి కన్య కాదని దబాయించాడు. ఊరందరి ముందు పంచాయతీ పెట్టించాడు. తన భార్య అప్పటికే చాలా సార్లు అందులో చాలా మంది వ్యక్తులతో పాల్గొందని కూడా అందరి ముందు సిగ్గు లేకుండా చెప్పాడు. ఆమెను తన భార్యగా ఒప్పుకోలేను అన్నాడు. ఇక రాత్రి పడుకున్న తెల్లని దుప్పటిని పెళ్లికూతురి తల్లిదండ్రులకు, గ్రామపెద్దలకు చూపించాడు.

పెళ్లికి ముందే చెడిపోయిందని ముద్ర

పెళ్లికి ముందే చెడిపోయిందని ముద్ర

కన్య కాదని తేల్చాడు. ఇక ఊర్లోని పెద్దలు కూడా ఆయనగారికే వత్తాసుపలికారు. పెళ్లికూతురు పెళ్లికి ముందే చెడిపోయిందని

ముద్ర వేశారు. తర్వాత పెళ్లి కూతురు ఆయనగారిని మోసం చేసిందని ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు.

డబ్బు చెల్లిస్తే వదిలేశారు

డబ్బు చెల్లిస్తే వదిలేశారు

వదిలేయాలని ఆమె తల్లిదండ్రులు ఎంత ప్రాధేయపడినా వినలేదు. తర్వాత తల్లిదండ్రులు పెద్దలతో మాట్లాడి ఆయనగారికి

డబ్బు చెల్లిస్తే అమ్మాయిని క్షమించి వదిలేశారు. ఇది జరిగింది కూడా ఈ మధ్యనే.

దురాచారం ఇలా కొనసాగుతుంది

దురాచారం ఇలా కొనసాగుతుంది

మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ లోని కంజర్‌భట్ కులస్థుల్లో (కంజర్భట్ వర్గంలో) పెళ్లిరోజే పెళ్లికూతురికి పెళ్లి కొడుకు కన్యత్వ పరీక్షలు చేస్తాడు. ఇలాంటి దురాచారం అక్కడ చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. దీని వల్ల చాలామంది అమాయక ఆడవాళ్లు బలైపోతున్నారు.

శృంగార సమయంలో

శృంగార సమయంలో

కొత్తగా పెళ్లైన జంట శృంగారంలో పాల్గొంటుంది. అప్పుడు పెళ్లికూతురికి ఓ తెల్లటి దుప్పటి ఇచ్చి.. శృంగార సమయంలో వాడాలని చెబుతారు. ఇక శృంగారం జరుగుతున్నప్పుడు బయట కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు కూర్చొంటారు. ఆ పని పూర్తయ్యాక దుప్పటిపై రక్తపు మరకలు ఉంటే కన్య అని నిర్ణయిస్తారు. లేదంటే పతిత అని పెద్దలు తేలుస్తారు. ఇలాంటి కట్టుబాట్లు ఇంకా కొనసాగుతున్నాయి.

చిత్రహింసలు

చిత్రహింసలు

ఇక కన్యకాదని గ్రామపెద్దలు నిర్ణయించిన ఆ మహిళను బహిరంగంగానే చిత్రహింసలకు గురిచేస్తారు. నోటికొచ్చిన ప్రశ్నలు వేసి మానసికంగా హింసిస్తారు. తమ పరువు తీశావంటూ కుటుంబ సభ్యులు కూడా ఆమెను కొడతారు.

చదువుకున్న వారు కూడా ఇలాగే చేస్తున్నారు

చదువుకున్న వారు కూడా ఇలాగే చేస్తున్నారు

కేవలం నిరక్షరాస్యులు మాత్రమే ఇలాంటి కట్టుబాట్లను పాటిస్తున్నారనుకుంటే పొరపాటు. బాగా చదివిన వారు కూడా ఇలాంటి వాటికి మద్దతు ఇస్తున్నారు. బాగా చదువుకుని జాబ్ లు చేస్తున్న అత్తమామ కూడా తమ కోడలికి ఇలాంటి పరీక్షలు చేస్తున్నారు కొన్నిప్రాంతాల్లో.

కన్యకాకపోతే

కన్యకాకపోతే

ఇంకొన్ని ప్రాంతాల్లో ముందే కన్యత్వ పరీక్షలు నిర్వహించి తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో అమ్మాయిలు తల్లిదండ్రులు ఇబ్బందులుపడుతున్నారు. అమ్మాయి కన్య కాకపోతే అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లికి అంగీకరించడం లేదని అమ్మాయిలు తల్లిదండ్రులు ఇబ్బందిపడిపోతున్నారు.

సాధారణ స్థితికి మార్చేందుకు ఆపరేషన్లు

సాధారణ స్థితికి మార్చేందుకు ఆపరేషన్లు

పలువురు అమ్మాయిల తల్లిదండ్రులు వారి కూతుళ్లను డాక్టర్ల వద్దకు తీసుకెళ్తున్నారు. హైమనోప్లాస్టీ (హైమెన్ పొరను తిరిగి సాధారణ స్థితికి చేర్చే ఆపరేషన్) చేయిస్తున్నారు. అయితే, హైమెన్ పొర చెక్కు చెదరకుండా ఉన్నంత మాత్రాన అమ్మాయి కన్యేనని అనుకోవడం పొరపాటు. కొన్ని సందర్భాల్లో ప్రసవానంతరం కూడా హైమెన్ పొర చెక్కు చెదరకుండా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పనులు చేసినా అది దెబ్బతింటుంది.

హైమన్ పొరపై ఉండే అపోహ

హైమన్ పొరపై ఉండే అపోహ

హైమన్ అనే పొర(కన్నె పొర) ఉంటేనే స్త్రీ శీలవతి లేదా కన్య. హైమన్ పొర ఉంటే గర్భం ధరించడం సాధ్యం కాదు. మొదటి రాత్రి భర్తతో కలయికలో నొప్పి, రక్తం రావాలి. ఇది అపోహ

కన్నె పొర గురించి వాస్తవం

కన్నె పొర గురించి వాస్తవం

అసలు కన్నెపొర అనే పదమే చాలా అసభ్యకరమైంది. స్త్రీ వ్యక్తిత్వాన్ని అవమాన పరచి, కించ పరిచేది కాబట్టి దాన్ని హైమెన్ అని అందాం. హైమెన్ అభివృద్ధి, అది తెచ్చుకోవడం అనేది స్త్రీ స్త్రీకీ మధ్య తేడాగా ఉండవచ్చు. పల్చగా, మందంగా, ముక్కలు ముక్కలుగా సగం ఉండి సాగే గుణం కలదిగా గుండ్రంగా, యోని రంధ్రాన్ని కప్పుతూ మధ్య భాగంలో రంధ్రాలుండేదిగా ఉండచ్చు.

ఎగిరినప్పుడు.. దూకినప్పుడు

ఎగిరినప్పుడు.. దూకినప్పుడు

చాలామంది అమ్మాయిలకీ బాల్యంలో ఆటల్లో దూకినప్పుడూ, ఎగిరినప్పుడూ, పడినప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు, చెట్లు, బస్సులు ఎక్కినప్పుడు ఈ హైమెన్ పొర చిరిగే అవకాశం 90 శాతం ఉంటుంది. అప్పుడు నొప్పి పుట్టి రక్తం కారాలని ఏం లేదు. చాలా మందంగా ఉంటే కట్ అయ్యి రక్తస్రావమవుతుంది.

చాలాసార్లు అసలు రక్తస్రావం కానే కాదు

చాలాసార్లు అసలు రక్తస్రావం కానే కాదు

హైమెన్ పొరంటే యోని లోపల చివరి భాగంలో, బయటకు తెర్చుకునే యోని రంధ్రం లోపలి 1/3 వ భాగంలో, యోని నాళంకు అడ్డంగా ఉండే పల్చని పొర. భయంతో పీసీ కండరాలు బిగించినప్పుడు కూడా అక్కడి సున్నితమైన యోని పొరలు చిట్లి రక్తస్రావమై నొప్పి కలుగుతుంది. అలాగే, రక్తం చాలా పోవాలని ఏమీ లేదు. చాలాసార్లు అసలు రక్తస్రావం కానే కాదు.

అపోహలు వీడండి

అపోహలు వీడండి

కాబట్టి, హైమెన్ పొర అన్న అంశం మీద అపోహ వద్దు. కాబట్టి, ఆ మూఢ జ్ఞానాన్ని వదిలేస్తే పురుషుల మానసిక ఆరోగ్యం బాగుండి వివాహానంతర దాంపత్య జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. అప్పుడే అనుమానపు మొగుళ్ళ నుంచి భార్యలు రక్షింపబడతారు.

వ్యతిరేక ఉద్యమం

వ్యతిరేక ఉద్యమం

మహారాష్ర్టలో ఎంతోమంది మహిళల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్న కనత్య పరీక్షల దురాచారానికి ముగింపు పలకాల్సిందే అంటూ కంజర్భట్ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. స్టాప్‌ ద వి రిచువల్.. ఈ దురాచారాన్ని ఆపాలి అంటూ వాట్సాప్ గ్రూపును ప్రారంభించి కొందరు ఉద్యమానికి నాంది పలికారు.

దాడులు కూడా జరిగాయి

దాడులు కూడా జరిగాయి

మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ లోని కంజర్భట్ వర్గానికి వ్యతిరేకంగా.. కన్యత్వ పరీక్షలు ఆపండిని ఉద్యమానికి దిగిన యువతపై ఈ మధ్య దాడులు కూడా జరిగాయి. కన్యత్వపు పరీక్షలకు నిరసన తెలిపిన ముగ్గురిపై దాదాపు 40 మంది దాడి చేశారు.

బిడ్డకు కన్యత్వ పరీక్షలు నిర్వహించి

బిడ్డకు కన్యత్వ పరీక్షలు నిర్వహించి

కొందరు తల్లిదండ్రులు మరీ దారుణంగా ఉన్నారు. బిడ్డకు కన్యత్వ పరీక్షలు నిర్వహించి తన బిడ్డ కన్య అని వైద్యుని వద్ద నుంచిసర్టిఫికేట్ తీసుకుని మరీ కూతుర్ని అమ్మిన తల్లిద్రండులు కూడా ప్రపంచంలో చాలామందే ఉన్నారు. కాంబోడియాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన సెఫాక్ అనే అమ్మాయికి హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించింది ఆమె తల్లి.

విటులకు అప్పగించింది

విటులకు అప్పగించింది

ఆ తర్వాత ఓ సర్టిఫికేట్ అందుకుని అటు నుంచి అటే ఓ హోటల్ రూమ్‌లో విటులకు పదమూడేళ్ల సెఫాక్‌ను అప్పగించి వెళ్లిపోయింది. మూడు రోజులపాటు నరకయాతన అనుభవించిన అనంతరం జీవచ్ఛవంలా ఇంటికి తిరిగొచ్చింది సెఫాక్. ఈ సంఘటన ఆ మధ్యే చాలా దుమారంగా మారింది.

కన్య పిల్లలతో సెక్స్

కన్య పిల్లలతో సెక్స్

కన్య పిల్లలతో సెక్స్ చేయడానికి ఎంత డబ్బులైనా కుమ్మరించడం కాంబోడియాలోని విటులకు సరదా. సుమారు 6 వేల డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన సెఫాక్ తల్లి మరో గత్యంతరం లేక ఈ పనికి పూనుకున్నని చెప్పింది. తర్వాత కూడా ఆ అమ్మాయిని వ్యభిచారం చేయమని ఒత్తిడి తేవడంతో సెఫాక్ అనేక సంవత్సరాలపాటు నరకకూపంలోనే ఉండిపోయింది. ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అక్కడి నుంచి బయటపడిన సెఫాక్ ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతోంది.

ఇండోనేషియాలో

ఇండోనేషియాలో

ఇక ఇండోనీసియాలోని స్కూళ్ళలో బాలికలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం ఆ మధ్య పెను వివాదాస్పమైంది. విద్యార్థినులు గ్రాడ్యుయేట్లు కావాలంటే.. తాము కన్యలమేనని, సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనలేదని నిరూపించుకునే టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు మొదట ప్రతిపాదించారు. అయితే ఇందుకు ముస్లిం నేతలనుంచి, ఇతర వర్గాలనుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ లో కన్యత్వ పరీక్షలు

మధ్యప్రదేశ్ లో కన్యత్వ పరీక్షలు

మధ్యప్రదేశ్లో గత జూన్ లో నిర్వహించిన సామూహిక వివాహాల్లో 151 మంది యువతులకు కన్యత్వ పరీక్షలను ప్రభుత్వ అధికారులు నిర్వహించారు. భోపాల్ కు 600 కి.మీ దూరంలోని సంధోల్లో ఆ మద్య జరిగిన వివాహోత్సవాల్లో ఈ సంఘటన చోటు చేసుకొంది. అక్కడి అప్పటి ప్రభుత్వం కన్యాదాన్ యోజన కింద సామూహిక వివాహాలు నిర్వహించింది ఈ పథకం కింద పెళ్లి ఖర్చులు భరించలేని పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు సామూహిక వివాహాలు చేసి, వారికి ప్రభుత్వం రూ.6,500 చెల్లిస్తుంది.

అధికారులు కన్వత్వ పరీక్షలకు బలవంతం చేశారు

అధికారులు కన్వత్వ పరీక్షలకు బలవంతం చేశారు

అధికారుల బలవంతంపై అక్కడి అమ్మాయిలు కన్యత్వ పరీక్షను అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఉత్సవాల్లో పెళ్లి చేసుకుంటే నగదు ప్రోత్సాహకం ఉండటంతో చాలామంది మహిళలు కన్యత్వ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వాలు కూడా ఇలా వ్యవహరిస్తే ఇంకెవ్వరేమి చేస్తారు.

ఈజిప్ట్

ఈజిప్ట్

ఆ మధ్య ఈజిప్ట్ చట్ట సభల సభ్యుడు ఎల్హామీ అజీనా మరోసారి మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడారు. అమ్మాయిలు ప్రతి ఒక్కరూ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడానికి ముందు కన్యత్వ పరీక్షలు చేయించుకోవాలన్నారు. యూనివర్సిటీలోకి అడుగుపెట్టే ఏ అమ్మాయి అయినా సరే ఆమె కన్యయేనా? అనేదాన్ని తెలుసుకునేందుకు వైద్య పరీక్షల పత్రాలను పరిశీలించాలన్నారు.

ధ్రువీకరణపత్రం ఇవ్వాలన్నారు

ధ్రువీకరణపత్రం ఇవ్వాలన్నారు

తాను కన్యే అంటూ అందుకు సంబంధించి ప్రతీ అమ్మాయి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని పేర్కొన్నారు. దీంతో అప్పట్లో ఈజిప్టు వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అజీనాపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్, ఫేస్ బుక్ లో డిమాండ్లు పెరిగిపోయాయి. ఎల్హానీ అజీనా అక్కడ ఇలాంటి కామెంట్లు చాలానే చేశారు. ‘ఈజిప్టు పురుషులు శృంగారంలో బలహీనులు. అందుకని మహిళలు వారి వాంఛలు తగ్గించుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకోవాలి' అని కూడా అన్నారు.

స్వీడన్ లోనూ

స్వీడన్ లోనూ

ప్రపంచంలో మహిళా హక్కుల కోసం కృషి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉండే స్వీడన్ లో కన్యత్వ పరీక్షలు ఆ మధ్యసాగాయి. యువతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అక్కడ కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, లేదంటే భర్తలు, బాయ్ ఫ్రెండులు యువతులకు కన్యత్వ పరీక్షలు జరిపించారు. నిజానికి ఇలాంటివి పరీక్షలు స్వీడన్ లో చట్ట విరుద్ధం. కానీ కొందరు వైద్యులు మాత్రం అధిక మొత్తాలు తీసుకుని ఈ పరీక్షలు చేస్తున్నారు.

అంతారికార్ట్ అయ్యింది

అంతారికార్ట్ అయ్యింది

అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేస్తూ స్వీడన్ వైద్యులు సీసీ కెమెరాలకు అప్పట్లో దొరికిపోయారు. ఓ మహిళా జర్నలిస్టు 17 ఏళ్ల బాలికను తీసుకెళ్లి కన్యత్వ పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్యులను కోరింది. కానీ ఆ బాలిక వద్దువద్దంటున్నా వినకుండా వైద్యులు పరీక్షలు చేయడానికి రెడీ అయిపోయారు... ఇదంతా కెమెరాల్లో రికార్డయింది.

దక్షిణాఫ్రికాలో కన్యలకే స్కాలర్ షిప్ లు

దక్షిణాఫ్రికాలో కన్యలకే స్కాలర్ షిప్ లు

దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులా నాతల్‌ రాష్ట్రంలోని ఉతుకెలా జిల్లాలో మాత్రం స్కాలర్‌షిప్‌ రావాలంటే బాలికలు, యువతులు కచ్చితంగా కన్యలే అయి ఉండాలి. అయితే అక్కడ చదువుకునే బాలికలు చదువు పూర్తయ్యేలోపు తల్లులవుతున్నారట. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట.

ఈ నిర్ణయం సరికాదు

ఈ నిర్ణయం సరికాదు

చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీని అరికట్టుందుకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ లాంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవటం, బాలికలు చదువు పూర్తయ్యే వరకు పూర్తిగా దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తూ ఆ ప్రాంత మేయర్‌ స్కాలర్‌షిప్‌లపై ఈ నిర్ణయం తీసుకున్నారు. మేయర్‌ నిర్ణయంపై కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు ఉద్యమాలు చేశారు. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు ఇంతలా ముందుకెళ్తున్నా ఇంకా ఇలాంటి కన్యత్వ పరీక్షలు చేయడం సరికాదని చాలామంది అంటున్నారు.

English summary

women suffer the myths of the hymen and the virginity test

women suffer the myths of the hymen and the virginity test
Desktop Bottom Promotion