For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోరిక తీర్చితేనే సాయం చేస్తాం.. యువతులకు నరకం చూపిస్తున్నారు..సెక్స్ సర్వీస్ చేయించుకుంటున్నారు

సిరియా యువతుల దీనస్థితిని కొందరు స్థానిక అధికారులు, దళారి సంస్థల ప్రతినిధులు అవకాశంగా చేసుకున్నారు. తాము సాయంత అందించాలంటే ప్రతిగా యువతులు తమ లైంగిక వాంఛను తీర్చేలని డిమాండ్ చేస్తున్నారు.

|

సిరియా ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. తిరుగుబాటుదారుల గుప్పిట్లో వణికిపోతుంది. ముఖ్యంగా గౌటా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం అసద్‌ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది. వారం రోజులుగా ప్రభుత్వ దళాలు ఈ నగరంపై జరుపుతున్న దాడుల్లో రెండువందల మంది పిల్లలతో సహా ఏడువందల మంది పౌరులు చనిపోయారు. వైమానిక దాడుల్లో గౌటా మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇదీ క్లుప్తంగా సిరియాలోని గౌటా ప్రాంతంలోని పరిస్థితి.

మహిళల పరిస్థితి మరీ దారుణం

మహిళల పరిస్థితి మరీ దారుణం

గౌటాలో పరిస్థితి అంత దారుణంగా ఉంటే ఇక సిరియాలో మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అందే మానవతా సహాయానికి ప్రతిగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి.

ఉచిత సాయం పొందాలంటే

ఉచిత సాయం పొందాలంటే

ఐరాస, ఇతర అంతర్జాతీయ సేవా సంస్థలు వివిధ రూపాల్లో ఉచిత సహాయం అందజేస్తున్నాయి. ఆ సాయం పొందాలంటే దళారుల వద్ద ఆ దేశ యువతులు, అమ్మాయిలు పడుకోవాల్సి వస్తుంది. అలా చేస్తేనే దళారులు సాయం అందజేస్తున్నారు.

దళారులు, స్థానిక అధికారులదే హవా

దళారులు, స్థానిక అధికారులదే హవా

సిరియాలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న అక్కడకు స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐరాస, ఇతర సంస్థలిచ్చే సహాయాన్ని బాధితులకు చేరవేసే బాధ్యతను దళారులు, స్థానిక అధికారులకు అప్పగించారు.

నిత్యావసరాలు దొరకడం లేదు

నిత్యావసరాలు దొరకడం లేదు

యుద్ధ బీభత్సం కొనసాగుతుండడంతో సిరియా ప్రజలు ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు రోజుకు ఒక్క పూట కూడా తిండి లేక అల్లాడిపోతున్నారు. అలాగే నిత్యావసరాలు కూడా దొరకడం లేదు.

లైంగిక వాంఛ తీర్చండి

లైంగిక వాంఛ తీర్చండి

సిరియా యువతుల దీనస్థితిని కొందరు స్థానిక అధికారులు, దళారి సంస్థల ప్రతినిధులు అవకాశంగా చేసుకున్నారు. తాము సాయంత అందించాలంటే ప్రతిగా యువతులు తమ లైంగిక వాంఛను తీర్చేలని డిమాండ్ చేస్తున్నారు.

పడుకుని కోరిక తీర్చాలి

పడుకుని కోరిక తీర్చాలి

మహిళలకు ఎలాంటి సహాయం అందకుండా కొందరు నిలిపేస్తున్నారు. తమ దగ్గర పడుకుని తమ కోరిక తీర్చిన వారికే సాయం అందిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు.

నేటికి కొనసాగుతున్నాయి

నేటికి కొనసాగుతున్నాయి

ఇలాంటి వేధింపులు సిరియాలో చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. మూడేళ్ల క్రితమే ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డాయి. అయినా సిరియాలోని దక్షిణ ప్రాంతంలో నేటికీ ఇవి కొనసాగుతున్నాయి.

భయపడుతున్నారు.

భయపడుతున్నారు.

సిరియాలో ఇలాంటి అనైతిక కార్యకలాపాలు పెచ్చు మీరడంతో అంతర్జాతీయ సేవా సంస్థల ద్వారా ఉచితంగా అందే సహాయాన్ని తీసుకునేందుకు కూడా మహిళలు భయపడుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ అమానవీయ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఈ సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు అక్కడి మహిళలు నిరాకరిస్తున్నారు.

కోరిక తీర్చాక తెచ్చుకున్నారనుకుంటారు

కోరిక తీర్చాక తెచ్చుకున్నారనుకుంటారు

ఇక శిబిరాలకు వెళ్తే అక్కడి మగవారి కోరికలను తీర్చాకే ఈ సంస్థలిచ్చే సహాయాన్ని తాము తెచ్చుకున్నామని అందరూ భావిస్తున్నారని అందుకే అలాంటి సహాయ కేంద్రాలకు అమ్మాయిలు వెళ్లడం లేదు.

లైంగిక దోపిడి

లైంగిక దోపిడి

ఇలాంటి ఆకృత్యాలు సాగుతున్నా కొన్ని స్వచ్ఛందసంస్థలు పట్టించుకోవడం లేదు. సిరియాలో గవర్నర్ల పాలనలోని వివిధ ప్రాంతాల్లో మానవతా సహాయానికి ప్రతిగా లైంగికదోపిడి సాగుతున్నట్టుగా గతేడాది ఐరాస జనాభా నిధి చేసిన పరిశీలనలో కూడా తేలింది.

సెక్స్ వల్ సర్వీసులు

సెక్స్ వల్ సర్వీసులు

కొంత కాలం పాటు తమకు సెక్సువల్‌ సర్వీసెస్‌ అందిస్తే తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని అక్కడి అధికారులు నేరుగా యువతులకు చెబుతున్నారు. అయితే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతులు అధికారుల డిమాండ్ కు ఒకే అంటున్నారు.

కోరిక తీరిస్తే బాగా చూసుకుంటున్నారు

కోరిక తీరిస్తే బాగా చూసుకుంటున్నారు

తమకు సహకరించి, కోరిక తీర్చిన యువతల మాత్రం కాస్త బాగా చూసుకుంటున్నారంటా అధికారులు. సహాయాన్ని తీసుకు నేందుకు వచ్చే వారి ఫోన్‌ నెంబర్లు తీసుకోవడంతో పాటు వారిని ఇంటివరకు వాహనాల్లో వదిలిపెడు తున్నారు. తాము అందజేస్తున్న సహాయాలకు ప్రతిగా అధికారులు, ప్రతినిధులు కోరిక తీర్చుకుంటున్నారు.

వారి పరిస్థితి మరీ దారుణం

వారి పరిస్థితి మరీ దారుణం

ఇక భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్న ఆడవారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. జోర్డన్‌లోని ఓ శరణార్థుల శిబిరంలో సిరియా మహిళ బృందం ఇలాంటి లైంగికదాడులకు గురైనట్లు మూడేళ్ల క్రితం మొదటిసారి బయటపడింది. దారా, క్యునీత్ర తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

గౌట్ అల్లకల్లోలానికి కారణం ఇదే

గౌట్ అల్లకల్లోలానికి కారణం ఇదే

ఇక ప్రస్తుతం అల్లకల్లోలంగా గౌటా మారడానికి కొన్ని కారణాలున్నాయి. దేశ రాజధాని డమస్కస్‌ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు.

జనాన్ని కాల్చుకు తింటున్నాయి

జనాన్ని కాల్చుకు తింటున్నాయి

ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్‌ అల్‌ షమ్‌, అల్‌ రహమాన్‌ లీజియన్‌, జైష్‌ అల్‌ ఇస్లామ్‌ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి.

నాలుగు లక్షల మంది

నాలుగు లక్షల మంది

గౌటా నగరంపై పట్టుసాధిస్తే తప్ప సిరియా ప్రభుత్వం మనలేని పరిస్థితి. ఉగ్రవాదుల చెర నుంచి మిగతా ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లే గౌటాను కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో సిరియా సైన్యం పనిచేస్తున్నది. ఆ సైన్యాలకు రష్యా పూర్తిస్థాయిలో అండగా నిలవడమేకాక, వైమానిక దాడులు సైతం నిర్వహిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గౌటా యుద్ధక్షేత్రంలో సుమారు 4లక్షల మంది జనం చిక్కుకుపోయారు.

అంతటా బాంబులే

అంతటా బాంబులే

లెక్కలు మిక్కిలిగా ఆసుపత్రిలో చేరుతున్న క్షతగాత్రులతో వైద్య సౌకర్యాల కొరత తీవ్రమైంది. కరెంటు లేదు, మెడికేషన్ లేదు, ఆక్సిజన్ లేదు, ఎక్కడ చూసినా బాంబులే. అనస్థీతియా మెడిసన్ కూడా అందుబాటులో లేదు. పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ ఊసే లేదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

English summary

women syria forced exchange sexual favours un aid

women syria forced exchange sexual favours un aid
Desktop Bottom Promotion