For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ రాశిచక్రాలలోని వ్యక్తులు చెడు సంబంధాలలో ఉండడానికి కూడా ఇష్టపడుతారoటే నమ్మగలరా?

  |

  మీరు, మీ స్నేహితులు ఒక చెడు సంబంధంలో ఉన్నకారణంగా లేదా ప్రేమ విఫలమవడం కారణంగా భాదపడడం చూస్తూ విసుగు చెంది ఉన్నారా? కానీ కొందరు ఉన్నవి చెడుసంబoదాలు అని తెలిసినా కూడా, వాటిలోనే కొనసాగే ప్రయత్నాలు చేస్తుంటార కానీ, బయటకు తావాలన్న ఆలోచన కూడా చేయరు.

  ఇక్కడ, ఈ వ్యాసంలో అలాంటి మానసిక సంబంధిత లక్షణాలు కలిగిన రాశి చక్రాలకు సంబంధించిన సంకేతాల గురించి మేము మీకు వెల్లడి చేస్తున్నాము. చెడు సంబంధాలు తమ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి అని తెలిసి కూడా బయటకు రాకుండా, సంబంధంలోనే కొనసాగేలా ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు.

  దీనికి కారణం సంబంధం అంటే ఉన్నతమైన ఒప్పందం అని భావించడం కూడా ఒక కారణంగా ఉంటుంది. తద్వారా వీరు ఎంతటి చెడు సంబంధాలలో ఉన్నా కూడా, అంత తేలికగా వాటి నుండి బయటకు రావడానికి సుముఖతను చూపించరు.

  ఇలా చెడు సంబంధాలను కూడా భరించే ఆ రాశి చక్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  Zodiac Signs That Love Staying In Toxic Relationships

  వృషభ రాశి : ఏప్రిల్ 20-మే 20

  వృషభ రాశికి చెందిన వ్యక్తులు రాశిచక్రాలన్నింటిలోనూ విశ్వసనీయకు చిహ్నంగా ఉంటారు. అత్యంత గొప్ప ఆలోచణా ధోరణి, ప్రేమను కలిగి, భాగస్వామిపట్ల అత్యంత నిబద్దతను ప్రదర్శిస్తూ ఉంటారు. మిగిలిన వారితో పోలిస్తే ఈ ఆలోచనా ధోరణి, స్థిరత్వ లక్షణాలతో కూడుకుని కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్ల వారు భాగస్వాములతో ఎటువంటి పరిస్థితులలో అయినా విడిపోవుటకు సిద్దంగా ఉండరు. పరిస్థితులను చక్కబెట్టే మార్గాల గురించిన అన్వేషణలు ఎక్కువగా చేస్తారు. సంబంధాన్ని స్థిరంగా ఉండేలా వీలైనంత కృషి చేస్తారు. ఇలాంటి మానసిక స్థితి అందరికీ సాధ్యపడదు. భాధలను దిగమింగుకుని పైకి ఆనందాన్ని ప్రదర్శించే ఈ వ్యక్తులు ఎంతో ఉత్తములుగా చెప్పబడుతున్నారు. ఏనాటికైనా తమ ప్రేమను అర్ధం చేస్కుని, తమతో మంచి సంబంధాలను కొనసాగించగలరన్న కోరికతో జీవితాన్ని గడుపుతుంటారు.

  Zodiac Signs That Love Staying In Toxic Relationships

  తులా రాశి : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  తులా రాశికి చెందిన వ్యక్తులు భాగస్వాములను అధికంగా ప్రేమిస్తారు. ఒక సంబంధంలో ఉండడం అనేది ఒక ఉన్నతమైన అంశంగా వీరి భావన. ఈ వ్యక్తులు అనేక రకాల ప్రతికూలతలను జీవితంలో కలిగి ఉంటారు మరియు వారు ఎక్కడివారక్కడే అన్నట్లు ఉంటారు, తద్వారా పరిస్థితులను మధ్యస్థంగా వదిలి అసమతుల్యతతో బాధపడుతుoటారు. ఈ సూచన గురించి ఆసక్తికరమైన నిజం ఏమిటంటే ఈ వ్యక్తులు ఇతర సంబంధాల పరంగా అత్యంత స్వతంత్రులు ఉంటారు. కానీ ఒక్కసారి ప్రేమ సంబందాలలోనికి రాగానే, తమని తాము కట్టడి చేసుకునే వారిగా తయారవుతారు. వారు సంబంధాలలోని ప్రత్యేకతను మరియు భాగస్వామి యొక్క మద్దతును గుర్తిస్తారు. వారు సంబంధంలోని ప్రతికూలతలు పట్టించుకోకుండా తమకు కనిపించే చిన్ని చిన్ని సానుకూలతలనే ప్రధానంగా భావిస్తూ సంబంధాలను నిలుపుకునే దిశగానే అడుగులు వేస్తుంటారు. వీరు సంబంధాల పట్ల అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. అందువలన అవి చెడు సంబంధాలని తెలిసినా కూడా, వాటికే అంకితమై జీవిస్తుంటారు కాని, బయటకు వచ్చి ఆరోగ్యకర సంబoదాల పట్ల దృష్టిని కేంద్రీకరించరు. వీరు కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే ప్రాధాన్యతను సంబంధంలో భాగస్వామి పట్ల కలిగి ఉంటారు. తద్వారా భాగస్వామిని దూరం చేయడం అంటే, తల్లి దండ్రులను దూరం చేసినట్లే అన్నంత భావనను కలిగి ఉంటారు. అందుచేతనే, సత్వర నిర్ణయాలకు ఎన్నటికీ సుముఖంగా ఉండరు. కానీ ఒక్కసారి వీరు వ్యక్తులను దూరం చేయాలని ఆలోచిస్తే మాత్రం, జీవితంలో వారిని తిరిగి ఆహ్వానిoచుటకు సుముఖతను ప్రదర్శించరు.

  Zodiac Signs That Love Staying In Toxic Relationships

  మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీన రాశి వారు ఉన్నతమైన వ్యక్తిత్వ లక్షణాలకు తార్కాణంగా ఉంటారు. తద్వారా అనారోగ్యకర సంబంధాలలో కూడా సానుకూల అంశాలను మాత్రమే చూడగలిగే లక్షణాలు మెండుగా ఉంటాయి. తద్వారా వీరు అనారోగ్యకర సంబంధాలలోకి సులువుగా వెళ్ళేలా ఉంటారు. ఈ వ్యక్తులు త్యాగానికి నిలువెత్తు రూపాలుగా ఉంటారు, మరియు వారి ఆలోచనా విధానం, భావ వ్యక్తీకరణ ఎంతటి వారినైనా కన్నీళ్లు పెట్టించగలదు.

  వీరు రియాలిటీ నుండి పూర్తిగా బయటకు వచ్చేస్తుంటారు, ఆలోచనా విధానాలు ఊహాజనితాలుగా ఉండడం మూలాన, బయట ప్రపంచంతో ఇమడలేని పరిస్థితుల్లో ఉంటారు. తద్వారా చెడు సంబంధాలలో ఉన్నా కూడా, ఒక ఆశతో బ్రతికేస్తూ ఉంటారు. పరిస్థితులు శృతిమించినప్పుడు, ఎక్కువగా భాధపడేది కూడా వీళ్ళే. వీరు తమ ఆలోచనలకు, నిజ జీవితానికి పొంతన కుదరడం లేదన్న విషయాన్ని గ్రహించాలి.

  కొన్ని సందర్భాలలో ఈ చెడుసంబంధాలలో ఉన్న వ్యక్తులు వాస్తవిక పరిస్థితులను గుర్తెరుగక పోవచ్చు. తద్వారా పరిస్థితులు చేయి జారినప్పుడు, అత్యధికంగా భాద పడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కావున వీరికి కుటుంబ సభ్యుల మరియు ప్రియమైన వారి ఆదరణ, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి. వీరొక చెడు సంబంధంలో ఉన్నట్లు మీకు అనిపించిన ఎడల, వారిని హెచ్చరించడం, పరిస్థితుల గురించిన అవగాహన ఇవ్వడం వంటివి తప్పనిసరి. లేనిచో తర్వాతి కాలంలో వారి భాధలను ఓదార్చడానికి మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది.

  వీరిలో కొందరు తాము ఉండేది విష సంబంధాలని తెలిసినప్పటికీ, బంధాల మీద ఉన్న గౌరవంతో, ప్రేమలతో సంబoధాలను దూరం చేసుకోలేక, అలాగని అదే సంబంధంలో కొనసాగలేక అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారికి చేయూత నివ్వడం ప్రియమైన వారిగా మీ బాధ్యత అవుతుంది.

  వీటిలో మీరు ఏదైనా రాశి చక్రానికి చెందిన వారిగా ఉన్నారా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికర రాశిచక్రాల వాస్తవాల కోసం, మా విభాగాన్ని తరచూ తనిఖీ చేస్తుండండి. ప్రతి రాశిచక్రం గురించి మీకు ఆసక్తికరమైన మరియు తెలియని అంశాల గురించి మేము మీకు తెలియజేస్తాము.

  English summary

  Zodiac Signs That Love Staying In Toxic Relationships

  Certain zodiac signs can never breakup even if they are bound in a toxic relationship. These individual zodiac signs are known to be the worst in terms of breaking up, as they fear for being wronged when they breakup. These zodiac signs are: Taurus, Libra and Pisces. These zodiac individuals suffer being in a toxic relationship, but do not quit!
  Story first published: Thursday, May 17, 2018, 7:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more