ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడు గాని వారి భావోద్వేగాలను అస్సలు బయటపెట్టరు :

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ మనస్సులో ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టతరం అవుతుంది, అర్ధం చేసుకోలేరు కూడా. ఇలా జరగడానికి కారణం వారి రాశులే అంటే, నమ్మగలరా ?

జ్యోతిష్య శాస్త్రానికి చెందిన నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఏ వ్యక్తులు అయితే ఈ రాశికి చెందుతారో వారు, వారి భావద్వేగాలను దాచి పెడతారట. ఇందువల్ల ఈ రాశి వారు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయమై ఎదుటివారికి ఎక్కువగా ఆతురత ఉంటుంది. కానీ, అదే సమయంలో వారు కూడా తమ ఆలోచనలను పంచుకొని ఎదుటివారిని ఆశ్చర్యానికి లోనుచేస్తారు.

వ్యక్తులు ఎవరైతే ఈ 4 రాశులకు చెందుతారో, వారు వారి భావద్వేగాలను అస్సలు వ్యక్తపరచరు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి : జూన్ 21 నుండి జులై 22 వరకు

కర్కాటక రాశి : జూన్ 21 నుండి జులై 22 వరకు

తమ భావద్వేగాలను దాచిపెట్టుకొనే విషయంలో అందరికంటే, ఈ రాశి వారు సిద్దహస్తులు. ఈ రాశికి చెందిన వారు భావోద్వేగంగా వ్యవహరిస్తారు కానీ, వారి నిజమైన భావోద్వేగాలను, మనస్సుకు గాయపరిచిన క్షణాలను మిగతావారికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నిస్తారని నిపుణులు చెబుతున్నారు. వారి బాధలను దాచుకోవడానికి విపరీతమైన బాధను అనుభవిస్తారు. తమ భావోద్వేగాలను బయటపెడితే ఎక్కడ మిగతా వారు తమను అవకాశంగా తీసుకుంటారో అనే భావనతో వీరు తమ భావోద్వేగాలను దాచేస్తారు. వీరు ప్రేమించే వ్యక్తులను బాధపెట్టాలని అనుకోరు, అదే సమయంలో వీరి బాధలు చెప్పి వారిని బాధపెట్టడం కూడా ఇష్టం ఉండదు. అందుచేతనే, వీరిని మౌన బాధితులుగా పిలుస్తారు.

కన్య : ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

కన్య : ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు :

ఈ రాశికి చెందిన వారు తమకు సంబంధించిన విషయాల్లో చాలా క్లిష్టతరంగా వ్యవహరిస్తుంటారు. వీరి బలాలు బలహీనతలు వీరికి బాగా తెలుసు. అందుచేతనే, భావోద్వేగాలను లేదా ఆలోచనలను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఆనందంగా ఉన్నా లేదా విచారంగా ఉన్నా ఒకేరకమైన హావభావాలను ప్రదర్శించగల సమర్థులు. ఈ ప్రపంచంలో ఏ విషయం కానీ, వారి మనస్సులో ఉన్న ఆలోచనలను బయటపెట్టేలా చేయలేదు.

తులరాశి : సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

తులరాశి : సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు :

ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువ వారిలో వారే మదనపడుతుంటారు. ఇలా మదనపడటం అనేది కేవలం వ్యతిరేక భావోద్వేగాల వల్లనే వచ్చి ఉంటాయి అని అనుకోనవసరం లేదు. కానీ, వారి మదిలో పరిష్కారం కాని భావోద్వేగాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. వారు పైకి ఆనందంగా, హాయిగా అదృష్టవంతులుగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ, వారి మనస్సులో కూడా అంతే ఆనందం ఉండకపోవచ్చు. ఈ వ్యక్తులు తమ గురించి ఇతరులకు చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మిగతావారిని పూర్తిగా నమ్మి, సౌకర్యవంతంగా భావించినప్పుడు మాత్రమే తమ విషయాల గురించి మనస్సు విప్పి మాట్లాడతారు.

వృశ్చికం: అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

వృశ్చికం: అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు :

ఇతరుల పై నమ్మకం ఉంచడానికి ఈ రాశి కి చెందిన వ్యక్తులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ భావోద్వేగాలను అస్సలు బయటపెట్టకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఇతరులను నమ్మకపోవడం. వీరు తమ భావోద్వేగ విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తారు. ఆనందం లేదా బాధ, సందర్భం ఏదైనా ఇతరులతో ఎప్పుడు గాని పంచుకోరు. వారు జీవితంలో అత్యంత దీన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఇతరులకు అస్సలు తెలీదు. ఎటువంటి సందర్భనైనా ఎదుర్కొనే సత్తా వారిలో ఉందని భావిస్తారు. సమస్య ఇతరులది కాదు కదా నాదే కదా ? కాబట్టి నేనే పరిష్కరించుకోవాలని భావిస్తారు.

రాశుల గురించి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవాలంటే, మా ఈ వెబ్ సైట్ ని తరచూ సందర్శించండి.

English summary

Zodiac Signs That Never Reveal Their Emotions

Zodiac Signs That Never Reveal Their Emotions,These zodiac signs are known to never let others know about their inner emotions. The list of these signs will shock you!