For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు సంతోషం కలిగించే, మీకు నచ్చే ఈ జూ అనిమల్స్ చూడటానికి స్టాఫ్ అనుమతించదు

|

జంతు ప్రదర్శన శాలల్లో నివసించే జంతువులు, పక్షుల పరంగా తీసుకునే సంరక్షణా చర్యలు ప్రపంచమంతా ఒకటిగా ఉండదు. కొన్నిచోట్ల వీటిని చిత్ర వధకు గురిచేస్తూ సంతోషించే వాళ్ళు కూడా లేకపోలేదు. పసితనంలో ఉన్నప్పుడు కొందరు పిల్లలు, జంతువులను రాళ్ళతో కొట్టి హింసకు పాల్పడి, అవి భాదతో గిలగిల్లాడుతూ ఉంటే వీరు సంతోషిస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. కానీ, అది తెలియని తనం మరియు వారి మానసిక స్థితిగతుల పరంగా జరుగుతుంటుంది. వారి పరిస్థితిని గమనించి పెద్దలు కొన్ని నేర్పించాల్సి ఉంటుంది. కానీ కొందరు ఇంకా అటువంటి మానసిక స్థాయిలనే కొనసాగిస్తున్నారేమో అనిపిస్తుంది. జంతు ప్రదర్సన శాలలలో తెరవెనుక జరిగే కొన్ని సంఘటనల చిత్రాలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

ఈ చిత్రాలు మీరు జంతు ప్రదర్శన శాలలను చూసే విధానాన్ని తప్పక మారుస్తాయి. మరియు కొన్ని జంతు ప్రదర్శన శాలలలో ఆ జంతువుల పట్ల చూపే క్రూరత్వం ఎలా ఉంటుందో ఒక అవగాహనకు వస్తారు.

గమనిక : అన్ని చోట్లా ఒకేలా ఉండదు. కొన్ని సంరక్షణా కేంద్రాలు తల్లి వలె భాద్యతలను తీసుకున్నాయి అన్నది కూడా వాస్తవం.

అటువంటి కొన్ని జంతు ప్రదర్శన శాలలలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఈ చిత్రాలలో గమనించండి.

జంతువులను ఇతర జంతువుల కనపడేలా, వాటి మీద పెయింటింగ్ వేయడం :

జంతువులను ఇతర జంతువుల కనపడేలా, వాటి మీద పెయింటింగ్ వేయడం :

కొన్ని జంతువులు పరిస్థితుల కారణంగా తరచుగా చనిపోవడం లేదా, వేరే ప్రాంతాలకు తరలడం జరుగుతుంటుంది. కానీ తమ దగ్గర ఆయా జంతువులు లేవు అని చెప్పేందుకు సంకోచిస్తారో లేక, లెక్కల పరమైన సమస్యలు ఉంటాయనో తెలీదు కానీ, ప్రజలను మభ్యపెట్టే క్రమంలో భాగంగా కొన్ని జాతుల జంతువులను వేరే జాతికి చెందినవిగా చూపడంలో భాగంగా వాటి మీద పెయింటింగ్ చేయడం చేస్తుంటారు. ఈ చిత్రాన్ని సరిగ్గా తనిఖీ చేయండి, నిజానికి ఇది ఒక గాడిద, కానీ ఒక జీబ్రా (కంచర గాడిద) వలె కనిపించేలా చిత్రించబడింది. ఈ ప్రాణాంతకమైన రంగులతో జంతువులకు పెయింటింగ్ చేయడం వల్ల, అవి కొన్ని రియాక్షన్లకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.పైగా ఈ రంగులు వీటిని కొంత అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. కానీ అవేమీ ఈ సంరక్షకులకు పట్టదు, వచ్చే సందర్శకులను దూరం నుండి ఆపడమే వీరి పని.

ఇక్కడ ఒక జంతువు ఉంది గమనించారా :

ఇక్కడ ఒక జంతువు ఉంది గమనించారా :

ఎందుకని జంతువుల పట్ల కొందరు ఇంతటి తీవ్రమైన క్రూరత్వాన్ని చూపుతుంటారో అర్ధం కాదు. మూగజీవాలు, కల్లా కపటం తెలీనివి అన్న కనీస జాలి కూడా ఉండదు కొందరికి. ఇక్కడ ఈ చిత్రం చూడండి. ఇవన్నీ ప్లాస్టిక్ వ్యర్ధాలు, వేస్ట్ బాటిల్స్ మాత్రమే అనుకుంటే పొరపాటే. వీటి మద్యలో ఇగువాన రకం జీవి ఒకటి ఉంది గమనించారా. జూ అధికారుల నిర్లక్షానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

పెద్దవైపోయిన జంతువులను …

పెద్దవైపోయిన జంతువులను …

ఇది అత్యంత దారుణమైన విషయం. కొన్ని చోట్ల వయసు పైబడిన జంతువులను, సింహాలకు పులులకు ఆహారంగా పడేస్తూ ఉంటారు. అది కూడా బ్రతికుండగానే. ఇంత దారుణానికి ఎలా సిద్దమవుతారో ఏమో మరి.

క్లీనింగ్ సమయంలో చూపే నిర్లక్ష్యానికి తార్కాణం ఈ దృశ్యం!

క్లీనింగ్ సమయంలో చూపే నిర్లక్ష్యానికి తార్కాణం ఈ దృశ్యం!

సముద్రపు జంతువులైన చేపలు మరియు డాల్ఫిన్లు, వాటి పరిసరాలను శుభ్రం చేసే సమయంలో అత్యంత క్లిష్ట సమయాన్ని కలిగి ఉంటాయి. ట్యాంకుల నుండి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతనే ఈ పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంటుంది. సమయపాలన లేని పక్షంలో వీటి ప్రాణాలు కూడా పోవచ్చు. క్రింది చిత్రంలో డాల్ఫిన్స్ పరిసరాలను శుభ్రం చేసే క్రమంలో భాగంగా ట్యాంకుల నుండి నీటిని తీసివేసి పనిచేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.

వాటికి యాంటీడిప్రెసెంట్ ఇవ్వగానే !

వాటికి యాంటీడిప్రెసెంట్ ఇవ్వగానే !

చాలా వరకు జంతువులకు, తరచుగా యాంటీ డిప్రెసెంట్ మందులను ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మందులు వాటి భావోద్వేగాలను నియంత్రణలోనికి తీసుకుని, వీటిని ఒక నిస్తేజమైన స్థితికి తీసుకుని వెళ్తాయి. ఇటువంటివి తరచుగా తమను తాము హాని చేసుకోవడానికి దారితీస్తుంది.

ఇంత దారుణాలు జరిగే అటువంటి జంతు ప్రదర్శన శాలలకు మేము వెళ్ళము అని కొందరు అంటూ ఉంటారు, కానీ అలా అనేవారు సగానికి సగం జంతు ప్రేమికులే. ఆ పంజరాలలో ఉన్న వాటికి స్వాంతన కలిగించడానికి, మేము మీకు ఉన్నాం అన్న కనీస భరోసా ఇవ్వడానికైనా వాటి వద్దకు తరచూ వెళ్ళడం మంచిది. మరియు అందరూ ఒకేలా ఉండరు, పైన చెప్పినట్లు జంతువులను పసిపిల్లలుగా చూసుకునే జంతు ప్రదర్శన శాలలు కూడా ఉన్నాయని మరిచిపోకండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: life
English summary

5 disturbing pics of animal life in a zoo

Some of these pictures can stress you out if you are an animal lover! Check out these disturbing pictures of zoo life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more