For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళికి అత్యంత అనుకూలమైన రాశి చక్రకాలు

|

రాశిచక్రాల అనుకూలతలు ప్రస్తుత కాలంలో పాత ఫ్యాషన్ గా పరిగణించబడదు. ఎందుకంటే వాస్తవిక ప్రపంచంలో మొబైల్ ఫోన్లలో కనిపించే అనేక డేటింగ్ అప్లికేషన్లు, వారి వినియోగదారుల కోసం రాశిచక్రాల విభాగాన్ని కూడా జోడిస్తున్నారు. క్రమంగా, వినియోగదారులు వారి రాశి చక్రాన్ని పొందుపరచి, తమకు ఉత్తమంగా సరిపోగల భాగస్వామిని ఎన్నుకోవడంలో నిర్ణయం తీసుకోగలుగుతారు.

అనేక గొప్ప జంటల సంబంధాలను నిర్ణయించడంలో జాతక చక్ర అనుకూలతలు కీలకపాత్ర పోషిస్తుందని నమ్మబడుతుంది. రాశిచక్ర సంజ్ఞల అనుకూలతలు, సరిపోని జాతకాల మ్యాచ్లను గుర్తించడానికి మనకు ఉత్తమంగా సహాయపడుతుందని కూడా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తుంటారు.

Zodiac Signs

జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం రాశి చక్రాల అనుకూలతలను అధ్యయనం చేయడం ద్వారా, ఇద్దరి జాతకాలను సరిపోల్చే క్రమంలో భాగంగా జన్మకుండలి ఆధారితంగా పరీక్షించడం కీలకమైన అంశంగా ఉంటుంది. ఒక జ్యోతిష్కుడు 12 రాశులలో ఒక్కోదానికి ఎంతమేరకు అనుకూలతలు ఉన్నాయో పరిశీలించి, పరిస్థితిని వివరించగలడు. గ్రహాల స్థితిగతులను అధ్యయనం చేయడం ద్వారా ఈ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

మీ రాశి చక్రం, ఇతర రాశుల జాతక చక్రాలతో ఎంత అనుకూలంగా ఉందో తెలుసుకోవడం ద్వారా, కొంత అవగాహనతో కూడిన ప్రయోజనం ఉంటుందని చెప్పబడుతుంది. మీ రాశిచక్రాల అనుకూలతల గురించి తెలుసుకోవడం, మీ సోల్ మేట్ లేదా డేటింగ్ భాగస్వామిని కనుగొనే విషయానికి వచ్చినప్పుడు కూడా, ఒక కీలకమైన సాధనంగా పరిగణించబడుతుంది.

మీ రాశి అనుకూలతలను అధ్యయనం చేయడం ద్వారా, మీజాతకానికి సరిపోయేలా భాగస్వామిని ఎన్నుకున్న ఎడల, మీరు జీవితంలో స్వచ్ఛమైన ప్రేమను మరియు ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారని నమ్మబడుతుంది. పైగా ఇది అనాదిగా అనుసరిస్తున్న ఆచార సాంప్రదాయాలతో కూడిన వ్యవహారం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తుల యొక్క రాశిచక్రాలు వ్యక్తి యొక్క ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతాయి. కానీ ఒకవిధంగా చెప్పాలంటే, ఇది రాశి చక్రాల అనుకూలతల ఆధారంగా ఒక సంబంధం యొక్క విజయావకాశాల గురించి ఖచ్చితమైన ఫలితాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది.

Zodiac Signs

రాశి చక్రాల అనుకూలతలను గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి నీరు, భూమి, వాయు మరియు అగ్ని రాశుల ప్రాథమిక వివరాలను తెలుసుకోవలసి ఉంటుంది.

సాంప్రదాయకంగా, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మరియు మీన రాశుల వంటి నీటి సంబంధిత రాశులు, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వంటి భూమి ఆధారిత రాశులతో అత్యుత్తమ సంబంధాలను నిర్వహించగలవని చెప్పబడుతుంది.

మరోవైపు, మిథున రాశి, తులా రాశి మరియు కుంభ రాశి వంటి వాయు సంబంధ రాశులు, అగ్ని రాశులైన మేష రాశి, సింహ రాశి, మరియు ధనుస్సు రాశులతో ఉన్నతమైన సంబంధాలను కలిగి నిర్వహించగలవని చెప్పబడుతుంది.

అనుకూలతల పరంగానే కాకుండా, రాశులలో ఉన్న వ్యతిరేక స్థానాల జాబితా కూడా ఇవ్వబడుతుంది. ఈ వ్యతిరేక స్థానాల సంకేతాలను కలిగి ఉన్న ఎడల, జీవితంలో అనేక సంఘర్షణలను ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పబడుతుంది. మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కొరకు క్రింది జాబితాను తనిఖీ చేయండి.

Zodiac Signs

అననుకూల సంకేతాల జాబితా :

• మేష రాశి - తులా రాశి
• వృషభ రాశి - వృశ్చిక రాశి
• మిథున రాశి - ధనస్సు రాశి
• కర్కాటక రాశి - మకర రాశి
• సింహ రాశి - కుంభ రాశి
• కన్యా రాశి - మీన రాశి.

మరోవైపు అత్యంత అనుకూల రాశుల జాబితాను కూడా పొందుపరచబడింది. మీకు, మీ భాగస్వామికి అనుకూలతలు ఉన్నాయో లేదా చూసుకోండి.

• సింహ రాశి - ధనస్సు రాశి
• కన్యా రాశి - వృషభ రాశి
• తులా రాశి - మిథున రాశి
• వృశ్చిక రాశి - కర్కాటక రాశి
• ధనుస్సు రాశి - మేషం రాశి
• మకర రాశి - వృషభ రాశి
• కుంభ రాశి - మిథున రాశి
• మీన రాశి - వృశ్చిక రాశి

ఒకవేళ అననుకూల రాశిచక్రాలను కలిగి పక్షంలో మీ జ్యోతిష్య శాస్త్ర నిపుణుని సందర్శించి, గ్రహస్థితుల అనుకూలతల ప్రకారం సూచనలను పొందండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

The Most Compatible Zodiac Signs

As per astrology rules, zodiac sign compatibility needs birth themes to be studied and compared. An astrologer can find out how compatible each of the 12 zodiac signs is. This study is done by studying the position of the planets. Horoscope compatibility is believed to play a vital role in making great couples.
Desktop Bottom Promotion