For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అవమానానికి గురైనప్పుడు మీ రాశిని బట్టి మీరు ఏవిధంగా స్పందించాలో తెలుసుకోండి

|

ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దాటుతూ, మిమ్మల్ని హేళన చేస్తే మీ ప్రతిస్పందన ఏమిటి? సోషల్ నెట్వర్క్స్ లో మీ భావ ప్రకటనా స్వేచ్చ ప్రకారం మీరేదైనా పోస్టు పెడితే, దానికింద కామెంట్స్ లో అవమానకరమైన చర్చలు జరిగితే, మీ భావాలు ఎలా ఉంటాయి ? మీరు వాటిని సీరియస్ గా తీసుకుంటారా ? అసలు పట్టించుకోరా ? లేదా తప్పొప్పుల గురించిన సందేహాలతో ఆలోచనలకు పని చెప్తారా ? లేక రివేంజ్ ఆలోచనలు చేస్తారా ? ఇలా ఎవరైనా మిమ్ములను అవమానించినప్పుడు మీరు ఏవిధంగా ప్రతిస్పందిస్తారో తెలుసుకునేందుకు రాశి చక్రాలు ఉత్తమంగా దోహదపడుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మేష రాశి :

మేష రాశి :

వీరిని అవమానించడానికి ఎంత ధైర్యం మీకు ? ఒక మేషరాశికి చెందిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానాలన్ను తేలికగా తీసుకోడు. తమ పట్ల చెడుగా, లేదా అవమానకరంగా ప్రవర్తించిన వారిపట్ల కఠి నాత్ములుగా ఉంటారు. వీరి ప్రతిస్పందనను తట్టుకోవడం మీతరం కాదు. వీరిని హేళన చేసినందుకు, కొంతకాలం పాటు బాధపడేలా చేస్తారు. క్షణికావేశం ఎక్కువగా ఉండే మేష రాశి వారు వెంటనే ప్రతీకారాన్ని తీర్చుకునేలా ఉంటారు. క్రమంగా నోటికి పని చెప్తారు. కఠినమైన మాటలతో దాడులు చేస్తారు.

వృషభ రాశి :

వృషభ రాశి :

వృషభం, ఎద్దుకు సంకేతం. వీరు అంత సాధారణంగా ఏ విషయానికి పెద్దగా ప్రతిస్పందించరు. నిజానికి వీరు శాంతి కాముకులు. వీరికి కోపం వచ్చింది అంటే, ఖచ్చితంగా అహాన్ని దెబ్బతీసేలా ఉండాలి. ఎద్దు వంటి లక్షణాలు కలిగిన వీరు, ఒక్కోసారి అవమానాలను దిగమింగుకుని తమ లక్ష్యాల పరంగా ముందుకు సాగుతుంటారు. కానీ తమ అహాన్ని దెబ్బతీసేలా, లేదా కుటుంబాన్ని అవమానించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి గుణపాఠం చెప్పే దాకా తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. నిజానికి సమయం చూసి దెబ్బకొట్టే ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే, తమ ఎదుగుదలే ఒకరికి గుణపాఠం అని చాటి చెప్పేలా వీరి ప్రవర్తన ఉంటుంది.

మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి వారు ఎటువంటి హేళనలను, అవమానాలను పెద్దగా లెక్కచేయని వారిగా ఉంటారు. వాటిలో ఏ ఒక్కటి కూడా తమ జీవిత సోపానాలకు ఉపయోగకరంగా ఉండవని వారి అభిప్రాయంగా ఉంటుంది. కానీ తమను అవమానపర్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని శత్రువులుగా భావించడం, వారిని దూరంగా ఉంచడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. క్రమంగా, వారితో జీవితంలో సంబంధాలు లేకుండా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని పట్టించుకోవడం తమ లక్ష్యాలకు ఆటంకంగా భావిస్తారు. మరియు పగలు ప్రతీకారాలు జీవితంలో లక్ష్య సాధన ఉన్న వారికి ప్రతిబంధకాలని వీరి ప్రఘాడ నమ్మకం. వాటిపై స్పందించడం వల్ల వారి సమయం, శక్తి వృథా అవుతాయని బాహాటంగానే చెప్పగలరు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

ఒక కర్కాటక రాశి వారిని అవమానించారు అంటే, ఆకలిగొన్న వారి ఆలోచనలకు ఆహారం వేసినట్లే అని అర్ధం. మీరు వారిని అవమానించినా, హేళన చేసినా వెంటనే విశ్లేషణకు పూనుకుంటారు. మిమ్ములను కూర్చోబెట్టి చర్చలు చేపడుతారు. చివరికి మీదే తప్పు అని మీచేతే అనిపించగల సమర్ధులు. ఈ తాత్వికులు అవమానాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు. వీరి ప్రతిచర్యలకు మీరు దొరకలేదని భావిస్తే, సమయం కోసం ఎదురుచూసి దెబ్బకొట్టగలరు. సూటిపోటి మాటలకు పని చెప్పడం, లేదా మీకు సంబంధించిన విషయాలలో అడ్డుకట్టలు వేయడం వంటివి చేస్తుంటారు. తాము తప్పు చేయని పక్షంలో, ఎదుటి వారి అవమానాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు.

సింహ రాశి :

సింహ రాశి :

ఎటువంటి విషయాన్నైనా నవ్వుతోనే పరిష్కరించవచ్చునని వీరి నమ్మకం. కానీ, పొరపాటున వీరిని ఎగతాళి చేసినా, అవమానించినా తక్షణమే కోపోద్రిక్తులవుతారు. క్రమంగా వారి వంతు మొదలవుతుంది. ఈ ప్రతీకారాలకు అంతం ఉంటుందా అంటే, చెప్పడం కష్టమే. అవకాశం దొరికినప్పుడల్లా మీతో ఆడుకుంటారు. ఏ చిన్న విషయాన్ని విడిచిపెట్టరు. ఒకవేళ వీరిని మీరు అవమానించి ఉంటే, వీరికి దూరంగా ఉండడం ఉత్తమం.

కన్యా రాశి :

కన్యా రాశి :

ఒక కర్కాటక రాశి వారి వలెనే, వీరు కూడా పగను వ్యక్తిగతంగా తీసుకుంటారు, కానీ వారిలా కాకుండా, ముందుగా ఎవరిది తప్పు ఉందోనన్న అవగాహనకు వస్తారు,. క్రమంగా విచక్షణతో కూడిన అడుగులు వేస్తుంటారు. కానీ, మరోకోణంలో అసత్యాలనే సత్యాలని నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. క్రమంగా నిర్ణయలోపాలతో కూడా పగలు పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా, తమ నిర్ణయాలే అంతిమంగా ఒప్పు అనే ఆలోచన కలిగి ఉంటారు. క్రమంగా తమను అవమానపరిచారు అని భావించిన వ్యక్తులను జీవితకాలం శత్రువులుగా భావించే అవకాశాలు ఉన్నాయి. కావున వీరితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి.

తులా రాశి :

తులా రాశి :

తులా రాశి వారు ఒకరి చేత అవమానించబడినప్పుడు తక్షణమే స్పందించకపోవచ్చు. వీరు నిర్ణయ లోపం లేకుండా ఇరుపక్కల అంశాలను పరిగణనలోని తీసుకుని నిజనిర్ధారణ గావించిన తర్వాతనే చర్యలకు పూనుకుంటూ ఉంటారు. వీరిని అర్ధం చేసుకోకుండా కించపరిచారు అని తెలిస్తే, వారికి పరిస్థితిని వివరించే ప్రయత్నం కూడా చేస్తారు. అయినా వారిలో మార్పు రాకుంటే, తక్షణమే దూరం పెట్టేస్తారు. కానీ వీరి కోపం కొనసాగదు. ఏదిఏమైనా మరలా మరలా వీరిపట్ల తప్పులు చేస్తూ ఉంటే మాత్రం వ్యక్తిగత శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఒక అవకాశం కోసం వేచి ఉంటారు. అవకాశం వచ్చినా కూడా పరిస్థితుల నేపధ్యంలోనే చర్యలకు దిగేవారిలా పరిణితిని ప్రదర్శిస్తుంటారు. మిధునరాశి వారి వలెనే పగలు ప్రతీకారాలు లక్ష్యసాధనకు ఎందుకూ పనికి రావన్న ఆలోచన వీరిది.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

వృశ్చికరాశి వారు అంత సున్నితంగా కనిపించకపోయినా కూడా, వారు తమ హృదయానికి సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణిస్తారు. తెలీకుండా అవమానాల గురించి తరచుగా ఆలోచిస్తూ, మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. క్రమంగా తమను అవమానించిన వాళ్ళు పతనం అయ్యే దిశగా, ఫలితం అనుభవించేలా ఆలోచనలు చేస్తుంటారు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారిని ఎవరైనా అవమానించే ప్రయత్నం చేసి ఉంటే, మీరు ఖచ్చితంగా ప్రతివాదనలను ఎదుర్కొనక తప్పదు. వాదనలు, పోరాటాలు, అపార్థాలు మరియు కక్షలు వంటి అంశాలతో వీరితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది. కావున, మీరు హేళన చేసి ఉంటే, వెంటనే క్షమాపణలు చెప్పడం మంచిది. కనీసం మీ వాదన వారికి అంగీకారంగా అయినా ఉండాలి. లేకుంటే, చిన్న విషయమే అయినా కాలంతో పాటు సాగదీస్తుంటారు. పైగా జీవితంలో ఏ చిన్న సమస్య తలెత్తినా, పాత విషయాలను లాగే ప్రయత్నాలు చేస్తుంటారు.

మకర రాశి :

మకర రాశి :

లక్ష్యసాధనకు అవసరం లేని విషయాలకు స్పందించాల్సిన అవసరం, సమయం తమకు లేదని మకర రాశి వారి నమ్మకం. వారిని అవమానించడానికి ప్రయత్నించే వారికి, వ్యాపార ప్రణాళికల పరంగా మంచి ఆలోచనలను సైతం ఇస్తారు. అటువంటి హేళనలకు ప్రతిస్పందించడమంటే సమయాన్ని వృధా చేయడమే అని వీరి భావన. క్రమంగా అవమానపరచిన వారే, వీరిని చూసి సిగ్గుపడేలా వక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు.

కుంభ రాశి :

కుంభ రాశి :

కుంభ రాశి వారు అవమానాలను, హేళనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షి౦చరు. అలాంటి వ్యక్తులు తమకు ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో ఉండాల్సిన అర్హత లేనివారిగా భావించడం ప్రారంభిస్తారు. క్రమంగా వీరితో పూర్తిస్థాయిలో సంబంధాలను తెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా వారి కంట పడకుండా తప్పించుకుంటూ తిరుగుతుంటారు.

మీన రాశి :

మీన రాశి :

మీన రాశి వారు తరచుగా అవమానాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు. అయితే వారు దానిని విస్మరించడానికి ప్రయత్నిస్తారు., కానీ అలా చేయడంలో విఫలమవుతుంటారు. హేళన చేసినవారు కూడా వీరు ఏవిధంగా వాటిని తీసుకున్నారో తెలుసుకోలేని విధంగా, తమ భావోద్రేకాలను దాచిపెట్టగల సమర్ధులు వీరు. అయితే, ఆక్షణం నుండి మీరు వారి ప్రయారిటీ లిస్టులో కిందకు దిగిపోతారు. మీతో ఇదివరకు ఉన్న ఆప్యాయతను కొనసాగించలేరు. మరియు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: zodiac sign రాశులు
English summary

Your Reaction When You Are Insulted Based On Your Zodiac Sign

Here is how you would respond if you are insulted by somebody you really do not like. Five kinds of responses have been given below. Check out which category you fall into. Read more.
Story first published: Saturday, March 9, 2019, 12:03 [IST]