Latest Updates
-
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా..
2020 నూతన సంవత్సర రాశి ఫలాలు : ఈ ఐదు రాశుల వారు చాలా అదృష్టవంతులట..
2020 నూతన సంవత్సరంలో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ మదిలో ఉండే ఆలోచనలు అన్నీ ఆచరణలోకి రాబోతున్నాయి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో తమ రాశి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా మంది కుతుహాలంతో ఉంటారు. ఇప్పటికే కొందరు కొత్త ఏడాది రాశి ఫలాలను ప్రకటించారు. 2020 కొత్త సంవత్సరంలో ముఖ్యంగా ఐదు రాశుల వారికి చాలా అదృష్టం కలసివస్తుందంట. ఆ రాశులు ఏమిటంటే వృషభ రాశి, సింహరాశి, కన్య రాశి, ధనస్సు రాశి, మకర రాశి. ఈ ఐదు రాశుల వారికి కొత్త సంవత్సరంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయట.

ఈ రాశి గ్రహాల ప్రయాణం అత్యంత అద్భుతంగా ఉంది. ఉద్యోగం, ఆదాయం, కుటుంబంలో ఆనందం, భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం సంపూర్ణంగా ఉంటుంది. అంతే కాదండోయ్ కొత్త సంవత్సరంలో ఈ ఐదు రాశుల వారికి అద్భుత వనరులు కూడా అందనున్నాయి. ఇంకా ఈ ఐదు రాశులలో ఒక్కొక్క రాశి వారిగా ఏమేమీ ప్రయోజనాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభ రాశి
2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ సంవత్సరమంతా ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది. వీరి జీవితంలో అనేక విషయాలలో మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గురు గ్రహ బలం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక కొందరు యువకుల్లో ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ప్రేమలో లోతైన అడుగులు వేస్తారు. ఆ ఫీలింగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. కొత్త సంవత్సరం మీకు అదృష్ట సంవత్సరంగా మారబోతోంది.

సింహ రాశి..
2020 నూతన సంవత్సరంలో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ మదిలో ఉండే ఆలోచనలు అన్నీ ఆచరణలోకి రాబోతున్నాయి. మీరు మీ బలాన్ని నమ్ముతారు. దానికి సంబంధించిన ఫలితాలను కూడా పొందుతారు. దీంతో మీకు ఈ ఏడాది విజయం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు. ఈ ఏడాదంతా శారీరక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వివాహం మరియు శృంగార జీవితం కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ ఏడాది మీ కుటుంబంలో ప్రశాంతత, ఆనందం లభిస్తాయి.

కన్య రాశి..
2020 కొత్త సంవత్సరంలో కన్య రాశి వారికి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన రంగంలో మీకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త నిర్ణయాలను సంతోషంగా తీసుకోండి. ఈ రాశి వారికి ఈ ఏడాది వివాహం కూడా ఆనందాన్ని తెస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి, కొత్త ఉద్యోగ అవకాశాలు మనసుకు చాలా ఆనందాన్ని కలిగించబోతున్నాయి. మొత్తం మీద 2020 కన్య రాశి వారికి లక్కీ ఇయర్ గా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటు బాధపడుతూ ఉంటారు. వీరు వారి వారి రంగంలో విజయం సాధించేందుకు అనేక ప్రయత్నాలను చేస్తారు. అయితే మంచి సమయం ఎదురుచూస్తున్న వీరికి 2020 కొత్త సంవత్సరం అద్భుతాలను తెస్తుంది. ఈ రాశి వారు వారి లక్ష్యాలను చేరుకోవడంలో సంపూర్ణంగా సఫలమవుతారు. వీరు చేసిన మార్పులు కుటుంబానికి మరియు వ్యాపారానికి మంచి అదృష్టాన్ని తెస్తాయి. అలాగే అనేక అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. పని కోసం చేసే ప్రయాణం కూడా విజయవంతంగా పూర్తవుతుంది. కొందరికి విదేశాలలో కూడా అవకాశం వస్తుంది.

మకర రాశి..
ఈ రాశి వారు 2020 సంవత్సరంలో కొన్ని అద్భుతాలు చేయనున్నారు. ఈ రాశి వారి ఆరోగ్యం ఈ ఏడాదంతా బాగుంటుంది. ఆర్థిక పరంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ఈ రాశి వారికి ఈ ఏడాదిలో శని వల్ల కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.



Click it and Unblock the Notifications
