Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఈ రాశుల వారు అలాంటి విషయాలను చెప్పడానికి అస్సలు సిగ్గుపడరంట...! ఇంతకీ అవి ఏంటంటే...
ఈ రాశి వారు మధురమైన మాటలను అస్సలు నమ్మరు. వీరి ప్రేమ చర్యలు మరియు హావాభావాల ద్వారా నిండి ఉంటుంది.
ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన ప్రేమ గురించి ఎందరో ప్రేమికులు.. ఎన్నో విధాలుగా తమ భావాలను మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించారు. మీరు కూడా నిజమైన ప్రేమికులు అయితే మీరు కళ్లు మూసుకుని.. మీ మనసులో అద్భుతమైన వాటిని ఊహించుకుని..

మీ ప్రేమ భావాలను పంచుకుని ఒకరినొకరు తమను అర్థం చేసుకుని, మీలో మార్పులు చేసుకోవడానికి సిద్ధమైనప్పుడే మీది పరిపూర్ణమైన ప్రేమ అని చెప్పొచ్చు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ రాశి చక్రాల సంకేతాలను బట్టి మీరు కూడా మీ ప్రేమను సమర్థవంతంగా వ్యక్తపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

అంతేకాదు మీరు కూడా ఇతరుల చేత ప్రేమించబడ్డారని భావిస్తారు. అయితే కొంతమంది ఇలాంటి భావాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. అంతేకాదు వాటి గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ఇష్టపడరు. ఇంతకీ ఏయే రాశుల వారు ఎక్కువగా ఇలా చేస్తారో తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో సౌకర్యవంతంగా ఉంటారు. వీరు ప్రేమ విషయంలో చాలా సరదాగా ఉంటారట. మేష రాశి వారు ప్రేమలో ఆ దశకు చేరుకోవడానికి.. తమ భాగస్వామి విషయంలో నమ్మకాన్ని మరియు ప్రేమను గెలుచుకునేందుకు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు మధురమైన మాటలను అస్సలు నమ్మరు. వీరి ప్రేమ చర్యలు మరియు హావాభావాల ద్వారా నిండి ఉంటుంది. ఒకవేళ వీరికి ప్రేమ విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా వీరు సురక్షితంగా బయటపడతారు. వీరు సంతోషంగా ఉన్నంత కాలం వీరి భాగస్వామిని కూడా సంతోషపెడతారు. అంతేకాదు ఈ రాశి వారు అంత తేలికగా ప్రేమలో పడరు. అయితే సంబంధాల విషయంలో చాలా సానుకూలంగా ఉంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ ప్రేమ విషయాలను జోక్స్ ద్వారా వ్యక్తపరుస్తారు. వీరు చిరునవ్వుతో ప్రతిరోజూ ప్రకాశవంతం చేసే వ్యక్తులు కావాలని కోరుకుంటారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. వీరు ప్రేమ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వీరు ఎవరిచేత ప్రేమించబడ్డారో కూడా తెలుసుకుంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ప్రేమలో పడిన తర్వాత బహుమతులు మరియు అభినందనలు చేస్తూ ఉంటారు. అయితే వీరి బహుమతుల ఎంపిక చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ద్వారానే తమ ప్రేమ విషయాలను వ్యక్తం చేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ప్రేమకు కొత్త అర్థం చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వీరు తమ భాగస్వామికి నిజమైన ప్రేమను పంచుతారు. అలాగే తమ భాగస్వాముల పట్ల గర్వంగా ఉంటారు. ఈ రాశి వారు ఇష్టపడే వ్యక్తులు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా సింహ రాశి వారిని ప్రేమించడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ప్రేమలో పడితే వారి భాగస్వామి ఎప్పుడూ తమ చుట్టూనే ఉండాలని కోరుకుంటారు. వీరు తమ భాగస్వామి లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ఎక్కువగా సహాయపడతారు. వీరు ఎవ్వరినైనా ప్రేమిస్తే జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తారు.

తుల రాశి..
ఈ రాశి వారు తెలివిగా మాట్లాడే వారిని మరియు జోక్స్ చెప్పే వారి పట్ల ఎక్కువగా ఆకర్షణగా ఉంటారు. వీరు చాలా సింపుల్ గా ఉంటారు. వీరు స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అందంగా ఉండే వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారితో రొమాంటిక్ గా గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. వీరు తమ ప్రేమ కోసం ఎంత దూరం అయినా వెళతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు తమ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు. సంప్రదాయాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. వీరి ప్రేమ వంటి విషయాలకు కొంచెం దూరంగా ఉంటారు. అయితే స్నేహితులతో ఎక్కువగా కలిసిపోతుంటారు. ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తే వారు చాలా లక్కీ పర్సన్స్ అవుతారు.

మకర రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అయితే వీరికి ఎవ్వరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే వారికి చాలా ఓపిక మరియు సహనం ఉండాలి. ఇది రోజులు, నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అయితే వీరు మిమ్మల్ని నమ్మితే మాత్రం మీకు జీవితాంతం తోడుగా ఉంటారు. వీరి విధేయత మరియు నిబద్ధత రూపంలో ఆప్యాయతను వ్యక్తం చేస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా రొమాంటిక్ హావభావాలను ప్రదర్శిస్తారు. వీరు తమ పార్ట్ నర్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరికి ఎవ్వరైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం తట్టుకోలేరు.

మీన రాశి..
ఈ రాశి వారు పైన ఉన్న అన్ని రాశి చక్రాల వారి నుండి అభిమానాన్ని పొందుతారు. అలాగే తమ ప్రేమను వ్యక్తం చేయడంలో కూడా సానుకూలంగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయం చెప్పడాని అస్సలు సిగ్గుపడరు. అయితే వీరిని మోసం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ క్షమించరు.
ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు ఎవరకైతే ఎంతగా ప్రేమను ఇస్తారో, అంతే ఎక్కువగా ప్రేమను పొందుతారు. మీ అందరికీ ప్రేమ విషయంలో ఎప్పటికీ మంచి జరగాలి..



Click it and Unblock the Notifications