Just In
- 41 min ago
Today Rasi Phalalu :ఓ రాశి ఉద్యోగులకు ఈరోజు మంచి ప్రయోజనాలు...!
- 13 hrs ago
మామిడి పండ్లను తిన్న వెంటనే ఇవి తినడం శరీరానికి ప్రమాదకరం; వీటిని అస్సలు తినకండి
- 15 hrs ago
18 సంవత్సరాల తరువాత, ఐదు గ్రహాలు సరళ రేఖలో కనిపిస్తాయి, ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు మిస్ చేయకుండా చూడండి
- 16 hrs ago
మీకు చాలా జుట్టు ఊడుతుందా? ఐతే ఈ ఆకులను వాడండి...తిరిగి జుట్టు పెరుగుతుంది!
Don't Miss
- News
ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: జర్మనీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Travel
విజయవాడ టు కొండపల్లి.. ప్రయాణపు ముచ్చట్లు! రెండవ భాగం
- Sports
Rain Stopped Ind vs Ire 1st T20: ఈ ఐర్లాండ్ వెదర్ ఉందే.. ఎప్పుడు ఎలా ఉంటదో ఎవడికీ తెలీదు.. నెటిజన్లు ఫైర్
- Finance
భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్
- Movies
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
- Technology
Noise నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ విడుదల!
- Automobiles
వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి
Akshaya Tritiya 2022: 50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు శోభన యోగం.. ఏ రాశులకు లాభమంటే...
అక్షయ తృతీయ రోజును చాలా మంది హిందువులు పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.
ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఉదయం 5:39 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 4వ తేదీన తెల్లవారు జామున 5:38 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.
అదే విధంగా ఐదు దశాబ్దాలు(50 సంవత్సరాల) తర్వాత ఇదే రోజున శోభన్ యోగం కూడా ఏర్పడనుంది. అంతేకాదు రోహిణి నక్షత్రం కారణంగా ఈరోజున కుజుడు రోహిణి యోగం ఏర్పడనుంది. దీంతో రెండు ప్రధాన గ్రహాలు స్వయంగా మరియు 2 ప్రధాన గ్రహాలు ఉచ్చమైన రాశిలో కూర్చుంటాయి. ఈ సందర్భంగా కొన్ని రాశిచక్రాల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...
Akshaya
Tritiya
2022
Daan:అక్షయ
తృతీయ
రోజున
ఈ
వస్తువులను
దానం
చేస్తే
ఎంతో
పుణ్యఫలం...!
అక్షయ తృతీయ రోజున కుజుడు రోహిణి నక్షత్రం శోభన యోగంలో ఉంటారు. మరోవైపు చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇంకోవైపు శుక్రుడు మీన రాశిలో మరియు శని తన సొంత రాశిలో ఉంటారు. గురువు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నాలుగు గ్రహాలు ఏకకాలంలో అనుకూలమైన స్థితిలో ఉంటాయి. దీంతో ఈరోజున చాలా శుభకార్యాలు నిర్వహిస్తారు. శోభన్ యోగం, గ్రహాల కలయిక కలిసి ఈరోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. ఈ సందర్భంగా ఎవరెవరికి అదృష్టం వరిస్తుంది.. ఎవరెవరికి శుభ ఫలితాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని చిన్న ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇరుగు పొరుగు వారితో కొన్ని గొడవలు రావొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున మీరు నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున రక్తపోటు, తలనొప్పి, కీళ్లనొప్పులు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. మీరు కొంత అశాంతిని అనుభవించొచ్చు.
Akshaya
Tritiya
2022:అక్షయ
తృతీయ
రోజున
మీ
రాశిని
బట్టి
వీటిని
కొంటే..అద్భుత
ప్రయోజనాలు...!

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున అద్భుతంగా ఉంటుంది. మీరు ఈరోజున కొన్ని శుభవార్తలు వింటారు. మీరు చేసే పనులతో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు.

కన్య రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు కొంత గాయపడొచ్చు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ కాలంలో స్థిరంగా ఉంటారు.
Akshaya
Tritiya
2022:
అక్షయ
తృతీయ
రోజున
బంగారమే
కొనాలా?
ఇతర
వస్తువులను
కొనొచ్చా?

తుల రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీకు రక్తపోటు మరియు చక్కెర స్థాయిలు పెరగొచ్చు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈరోజు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈరోజున ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఈరోజంతా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలో అంతా మంచిగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఉద్యోగం లేదా ఉపాధికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు మంచి ప్రేమ జీవితాన్ని కలిగి ఉంటారు. చాలా విషయాల్లో సాధారణంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున పెండింగ్ పనులను ప్రారంభించొచ్చు. ఈరోజు మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజంతా మీరు మనశ్శాంతి మరియు సంత్రుప్తితో ఉంటారు.

మీన రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అందరితో ఈరోజు స్నేహపూర్వక వాతావరణాన్నిక లిగి ఉండాలి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.