Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
కరోనా వంటి కష్టకాలంలోనూ ‘జగనన్న విద్యా దీవెన‘కు నిధులు విడుదల చేసిన సీఎం జగన్...
విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించి ఇంతకుముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు.
మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కర్నూలు జిల్లాలో విలయతాండవం చేస్తుంటే, గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో రోజురోజుకు భయాందళన చెందేలా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇంతటి కష్టకాలంలోనూ విద్యార్థుల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ పథకాన్ని ఈ కష్టకాలంలో ఎందుకు ప్రారంభించారో వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
రాజశేఖరరెడ్డి హయాంలో..
విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించి ఇంతకుముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు.
చరిత్రలోనే తొలిసారిగా..
ఈ ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద 4 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎవ్వరూ చేయని విధంగా విద్యార్థులకు చెందిన పూర్తి ఫీజును, రీఎంబర్స్ మెంట్ ను అందజేయనున్నారు. అంతేకాదు గత టిడిపి ప్రభుత్వం చెల్లించాల్సిన 1,880 కోట్ల రూపాయల బకాయిలను కాలేజీలకు చెల్లించారు.

పేదరికం పోతుందని..
ఈ పథకాన్ని ఉద్దేశించి జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘పెద్ద చదువులు చదివితేనే పేదరికం పోతుందని.. అప్పుల పాలు కాకుండా ఉన్నత చదువులు చదివితేనే పెద్దవాళ్ల తలరాతలు మారతాయని, బతుకులు కూడా మెరుగవుతాయని నాన్న గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు అన్నివర్గాల్లోని పేదలందరికీ భరోసా ఉండేది.

తూతూమంత్రంగా..
ముఖ్యమంత్రి స్థానంలో మనసున్న మహారాజు ఉండేవాడని ఒక భరోసా ఉండేది. ఆయన మరణం తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. చాలిచాలని ఫీజులు, ఏదో తూతూ మంత్రంగా ఇవ్వడం వంటివి చేశారు. ఫీజులు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కాకుండా ఎలా కత్తిరించాలి అన్న ఆలోచన చేశారు.

నెల్లూరు పాదయాత్రలో..
నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గోపాల్ అనే ఒక తండ్రి తన కొడుకు ఉన్నత చదువులు చదువుకోలేక, తాను కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం ఇష్టం లేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవాడు అప్పుల పాలు అవుతున్నాడు.

దేవుని దయతో..
ఆరోజే నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుని దయతో, అందరి ఆశీర్వాదంతో ఈరోజు ప్రారంభిస్తున్నాం. విద్యాదీవెన అనే రెండు పథకాలనుు తీసుకొచ్చి, పిల్లలకు ఇవ్వగలిగినంత ఇస్తున్నాం. మనం వారికి ఏదైనా ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే.. ఒక్క చదువు అన్నది.. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ దిశగా అడుగులు వేస్తే.. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మార్చి 31 వరకూ ఉన్న పూర్తి బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగులో పెట్టకుండా ఇస్తున్నాం.

వసతి దీవెన..
విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా ప్రారంభించాం. పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం ఏడాదికి 20 వేల రూపాయల వరకు ఇస్తున్నాం. ఇది కూడా వారి తల్లుల అకౌంట్లలోకే వేస్తున్నాం. దీని వల్ల ఆ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా, తమ పిల్లలను గొప్పగా చదివిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీకు ఏమైనా సమస్యలుంటే 1902 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు చెప్పండి. సీఎం కార్యాలయం పర్యవేక్షణ కూడా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, ఈ స్థానంలో ఉన్నాడు. మీ పిల్లలను అన్ని రకాలుగా చదివిస్తానని హామీ ఇస్తున్నాను. దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను‘ అని తెలిపారు.



Click it and Unblock the Notifications
