For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక : మాస్క్ లేకుంటే మందు ఇవ్వరట... మంది జమైతే లైసెన్స్ కట్ చేస్తరట...

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్యం షాపులను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఏ చిన్న పొరపాటు జరిగినా శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించాడు.

|

'మందు కొట్టనివాడు మహనీయుడు.. మరి మందు కొట్టేవాడు మన దేవుడు.. మందు కొట్టేవాడు స్వర్గాన్ని ఏలుతాడు.. మరి స్వర్గాన్ని ఏలేవాడు లోకాన్నే ఏలుతాడు' ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉంది కదా... అదేనండీ ఓ కామెడీ షోలో చలాకీ చంటి మందు గురించి కామెడీ చేస్తే.. అదే విషయాన్ని నిజం చేస్తున్నారు మందుబాబులు. ఇన్ని రోజులు కరోనా వైరస్ కారణంగా మద్యం షాపులు బంద్ చేయడంతో ఒక్కసారిగా వైన్స్ షాపుల వద్దకు ఎగబాకారు.

Bizarre Alcohol Laws From Around The World

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల్లో ఇతర రాష్ట్రాల వారు కూడా మద్యం ప్రియులు చేసిన నానా హంగామాను మీరు చూసే ఉంటారు. మందుకోసం వచ్చిన వారిలో చాలా మందికి మాస్కులు లేవు. ఇంకా కొంతమందేమో మందే ముందు అంటారు. ఇంకా కొందరేమో ఈ మందు తాగితే కరోనా చచ్చిపోతుంది అని ఎవరికిష్టమొచ్చినట్లు వారు మాట్లాడారు.

Bizarre Alcohol Laws From Around The World

కరోనా వైరస్ సోకుతుందనే భయం లేకుండా. కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును మనం కళ్లారా చూశాం. అయితే తాజాగా తెలంగాణలో కేసీఆర్ మద్యం షాపులు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినప్పటికీ నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని కూడా హెచ్చరించాడు. ఆ నిబంధనలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగి తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

మద్యం తాగేందుకు..

మద్యం తాగేందుకు..

భారతదేశంలోని చట్టం ప్రకారం మద్యం సేవించాలంటే కనీసం 21 సంవత్సరాలు ఉండాల్సిందే. అయితే మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మద్యపాన చట్టాలు నిర్ణయించబడతాయి.

తెలంగాణలో కఠిన శిక్షలట..

తెలంగాణలో కఠిన శిక్షలట..

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులు అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైన్స్ షాపులు తెరచుకున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతులిచ్చారు. అయితే ప్రస్తుతం కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చిండు సీఎం కేసీఆర్. అవి పాటించకపోతే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించిడు.

నో మాస్క్ నో లిక్కర్...

నో మాస్క్ నో లిక్కర్...

మద్యం షాపులకు ఎవరైతే మాస్కు లేకుండా వస్తారో వారికి మందు అమ్మరట. అలాగే మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు సామాజిక దూరం కచ్చితంగా పాటించాల్సిందేనట. పొరపాటున గుంపులు గుంపులుగా... దగ్గరగా ఉంటే మాత్రం షాపుల వారే అందుకు బాధ్యత వహించాలట. లేకపోతే వారి లైసెన్సులు కట్ అవుతాయనే నిబంధన పెట్టారు. అలాగే శానిటైజర్లు కూడా అందుబాటులో పెట్టాలన్నారు.

ప్రపంచంలో ఎలా ఉన్నాయంటే..

ప్రపంచంలో ఎలా ఉన్నాయంటే..

మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి చట్టాలుంటే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంకా కొన్ని చిత్రవిచిత్రమైన చట్టాలు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

యుకెలో

యుకెలో

యునైటెడ్ కింగ్ డమ్(యుకె) చట్టం ప్రకారం, కేవలం పరిమితంగానే మద్యం సేవించాలట. ఒక లిమిట్ దాటాక క్లబ్ లేదా పబ్ ల్లో మద్యం తాగడం వంటివి చేస్తే అక్కడ అది చట్టవిరుద్ధమట. అలాంటి వారికి కఠినంగా శిక్షిస్తారట. ఈ చట్టం 1872 నుండి అమలులో ఉందట.

సాల్వడార్ లో ఫైరింగ్ స్క్వాడ్..

సాల్వడార్ లో ఫైరింగ్ స్క్వాడ్..

ఈ దేశంలో తాగి డ్రైవ్ చేస్తే తమ ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఆ దేశంలో అక్కడి శిక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఇది విని మీరు ఆశ్చర్యపోవచచు. ఎందుకంటే అక్కడ మొదటిసారి తాగి వాహనం నడిపితేనే ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణ శిక్ష విధిస్తారట.

స్కాట్లాండులో..

స్కాట్లాండులో..

స్కాట్లాండులో మద్యానికి సంబంధించి ఒక విచిత్రమైన చట్టం ఉంది. అక్కడి చట్టం ప్రకారం కిలోట్ కింద లోదుస్తులు ధరించి రెండు బీర్లు తీసుకెళితే జరిమానా విధిస్తారట. దీని కోసం ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని మరీ పోలీసులు చెక్ చేస్తారట..

ఆస్ట్రేలియాలో..

ఆస్ట్రేలియాలో..

ఆస్ట్రేలియాలో మీ ఛాతి భాగంలో ఒక బీరును చూర్ణం చేయడం వంటివి చేస్తే అక్కడి చట్టవిరుద్ధంగా భావించి.. వారికి జరిమానా విధిస్తారట. అక్కడ కొందరు మద్యంప్రియులు బీరుబాటిల్ ను అలా ఒకసారి చూర్ణం చేసినందుకు వారికి వెంటనే జరిమానా విధించారట. అంతేకాదు అర్ధరాత్రి తర్వాత రోడ్ల మీద మద్యం తాగితే కూడా జరిమానాలు, కఠిన శిక్షలు ఉంటాయట.

కెనడాలో..

కెనడాలో..

కెనడాలో మీరు ఎప్పుడూ ఎలాంటి బ్రాండ్లు తాగుతారో వాటిపైనే ఆధారపడాలట. అక్కడ ఒక బార్టెండర్ ఒక కస్టమర్ ప్రత్యేకంగా అడగకపోతే మినహా మద్యం చొప్పించడం, రుచి చూడటం వంటివి చట్టవిరుద్ధమట.

ఫ్రాన్సులో..

ఫ్రాన్సులో..

ఫ్రాన్స్ లో మీరు డ్రైవింగ్ చేసే సమయంలో, మీరు కచ్చితంగా సొంత బ్రీత్ అనలైజర్ ను కలిగి ఉండాలట. పోలీసులు ఎప్పుడైనా తనిఖీ చేసినప్పుడు మీతో అది లేకపోతే మీరు శిక్షకు గురవుతారట.

నైజిరీయాలో..

నైజిరీయాలో..

నైజిరీయాలో బీర్ల పరిశ్రమ చాలా పెద్దది. అత్యంత ఎక్కువ మార్కెట్ ఉన్న ఆఫ్రికన్ దేశం దక్షిణాఫ్రికా. అయితే నైజిరీయాలో ఆశ్చర్యమేమిటంటే అక్కడ మీరు బీరును దిగుమతి చేసుకోలేరట. స్థానిక బ్రూవరీలను పోటీ నుండి రక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందట.

జర్మనీలో..

జర్మనీలో..

జర్మనీలో తాగి సైక్లింగ్ చేయకూడదట. మీరు ఇలా చేస్తే మీపై తీవ్రమైన చర్యలు తీసుకుంటారట. అంతేకాదు మీ మానసిక స్థితిని కూడా అంచనా వేయాలని ఆదేశిస్తారట.

బొలివియాలో..

బొలివియాలో..

బొలియాలో వింత చట్టాన్ని రూపొందించారు. ఈ దేశంలో వివాహితులు, మహిళలు బార్ లేదా రెస్టారెంటులో ఉన్నప్పుడు మాత్రమే గ్లాసు వైన్ ను తాగొచ్చట. వివాహం తర్వాత బహిరంగ ప్రదేశాల్లో పురుషులతో కలిసి మద్యం తాగడం చట్ట విరుద్ధమట. ఇలా చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారట.

థాయ్ లాండ్ లో..

థాయ్ లాండ్ లో..

ఈ దేశంలో బూజ్ కొనడం అనేది చట్టబద్ధమేనట. అయితే రోజుకు కేవలం కొన్ని గంటలు మాత్రమే. ముఖ్యంగా రాత్రి 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దీనికి ఎలాంటి అనుమతి ఉండదట. ఈ చట్టం అక్కడున్న బార్లు మరియు రెస్టారెంట్లకు వర్తిస్తుందట.

English summary

Bizarre Alcohol Laws From Around The World

Here are the bizarre alcohol laws from aroun the world.Take a look
Desktop Bottom Promotion