Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: వీటిని కలిగి ఉంటే భూమి కూడా స్వర్గమవుతుంది!
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితంపై అనేక విషయాలు వెల్లడించాడు. జీవితంలో సమస్యలు, సవాళ్లు, ఎదురుదెబ్బలను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశాడు.
క్లిష్టపరిస్థితుల్లో ఎలా మెలగాలో సూచించాడు. ఆచార్య చాణక్యుడి వ్యూహాలను అనుసరించడం ద్వారా ఆపద సమయం నుండి సులభంగా బయటపడవచ్చు. చాణక్యుడు తన అనుభవాలు, ఆలోచనాలు, జ్ఞానంతో ప్రజలు సంతోషంగా జీవించే మార్గాన్ని సూచించాడు.
ప్రతి మనిషి దగ్గర కొన్ని వస్తువులు ఉండాలని, అవి ఉంటే భూమి కూడా స్వర్గంలా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పిన ఈ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యస్య పుత్రో వశీభూతో భార్యాఛన్దానుగామినీ|
విభవేయశ్చ సన్తుష్టస్తస్య స్వర్గైహైవ హి||
'ఎవరి కుమారుడు చెప్పిన మాట వింటాడో, ఎవరి భార్య భర్త ఇష్టాయిష్టాలు గౌరవిస్తుందో, ఎవరైతే ఉన్నదాంతో సంతృప్తి పడతారో అలాంటి వ్యక్తికి భూమి కూడా స్వర్గంలా ఉంటుంది' అని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించాడు.
సమస్యలు సతమతం చేస్తుంటే, నిత్యం ఏవో కష్టాలు వెంటాడుతుంటే, మనశ్శాంతి లేకపోతే, భార్య కూడా ప్రేమగా చూసుకోకపోతే, నిత్యం నిరాశ నిస్పృహలు వెంటాడుతుంటే అలాంటి వారికి స్వర్గానికి వెళ్లాలని అక్కడ ఎలాంటి కష్టనష్టాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా, సంతోషంగా గడపాలని కోరుకుంటారని చాణక్యుడు చెప్పాడు.
భూమిపైనే అన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్న వారు స్వర్గానికి వెళ్లాలనుకోవడం వ్యర్థమని ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు చెప్పాడు. చెబితే వినే కుమారుడు, ఇష్టాన్ని గౌరవించి నడుచుకునే భార్య, సంపదపై అత్యాశ లేకుండా ఉన్నదాంతో సంతృప్తిగా గడిపే భార్య ఉన్న ఇల్లు కంటే స్వర్గం మరొకటి లేదని చెప్పాడు చాణక్యుడు. అలాంటి వారికి భూమే స్వర్గం లాంటిదన్నాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications