Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: తెలివైన వ్యక్తులు కూడా ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారన్న చాణక్యుడు
చాణక్యుడు తన నీతి గ్రంథంలో తెలివైన వ్యక్తులు, మేధావుల గురించి చెబుతూ.. వారు కూడా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. చాణక్యుడు అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, పండితుడు, వ్యూహకర్త, మార్గదర్శకుడు. రాజనీతి, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, ఆధ్యాత్మికత సహా అనేక అంశాలపై ఎన్నో సూచనలు చేశాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో శాంతియుతంగా జీవించడానికి ఎన్నో విధానాలను పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరంగా చెప్పాడు. నీతి శాస్త్రంలో వివరించిన విధానాలు నేటికీ ఆచరణీయమే. ఈ వ్యూహాలను అనుసరించడం ద్వారా, ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు పురోగతిని సాధించవచ్చు. చాణక్యుడి విధానాలు పాటించడం ద్వారా ఉత్తమంగా జీవించవచ్చు.
చాణక్యుడు తన నీతి గ్రంథంలో తెలివైన వ్యక్తులు, మేధావుల గురించి చెబుతూ.. వారు కూడా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. చాణక్యుడు అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
బుద్ధిహీనుడైన శిష్యునికి ఉపదేశించడం, దుష్ట స్త్రీని పోషించడం, సంపదను పోగొట్టుకోవడం, దుఃఖం లేని వ్యక్తితో వ్యవహరించడం ద్వారా తెలివైన వ్యక్తి కూడా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
మూర్ఖుడికి శిష్యరికం:
మూర్ఖుడు, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని అందించాలనుకోవడం పొరపాటే అవుతుందని చాణక్యుడు చెప్పాడు. వారికి విద్యాబుద్ధులు నేర్పించినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నాడు. బుద్ధిహీనులను శిష్యులుగా స్వీకరించి వారికి జ్ఞానాన్ని అందించాలనుకోవడం ద్వారా మేధావులు, జ్ఞానులు తమ సమయాన్ని నష్టపోవడంతో పాటు ఇబ్బందులూ ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పాడు.
దుష్ట స్త్రీ:
దుష్ట స్త్రీ, పనిలేకుండా ఉండే స్త్రీలతో ఎవరికైనా ఇబ్బందులు తప్పవని చాణక్యుడు చెప్పాడు. తెలివైన వ్యక్తులు కూడబెట్టిన సంపదను ఎలా ఖర్చు పెట్టాలా అనే చూసే స్త్రీలతో నష్టం, కష్టం తప్ప లాభాలు ఉండవని చెప్పాడు చాణక్యుడు.
రోగాలు ఉన్న వ్యక్తి:
అనేక రోగాలు ఉన్న వ్యక్తితో, సంపదన నాశనం చేసే వ్యక్తితో ఎప్పుడూ సంబంధం పెట్టుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారితో సంబంధం వల్ల ఇబ్బందులు తప్పవని చెప్పాడు ఆచార్యుడు.
దివాళా తీసిన వ్యక్తి:
డబ్బు పోగొట్టుకున్న, అప్పులు అధికమైన, దివాళా తీసిన వ్యక్తితో సాంగత్యం చేటు చేస్తుందని హెచ్చరించాడు చాణక్యుడు. అలాంటి వారికి అప్పు ఇస్తే తిరిగి రాదని, వారితో కలిసి మెలిసి ఉండటం వల్ల మీక్కూడా బయట ఎక్కడా అప్పు పుట్టదని చాణక్యుడు చెప్పాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications