Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Chanakya Niti: ఈ ఐదు విధి రాతలను ఎప్పటికీ మార్చలేమన్న చాణక్యుడు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పిన చాణక్యుడు విధి గురించి ప్రస్తావిస్తూ కొన్ని హెచ్చరికలు చేశాడు. మనిషి విధి తల్లి కడుపులో ఉన్నప్పుడే రాయబడుతుందని చాణక్యుడు చెప్పాడు. విధి రాతను ఎప్పటికీ మార్చలేమని చెప్పుకొచ్చాడు. ప్రతి మనిషిలో జీవితంలో ఉండే కొన్ని అంశాలను ఎప్పటికీ మార్చలేమన్నాడు ఆచార్యుడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వయస్సు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి పుట్టకముందే అతని జీవితం, విధి ఎలా ఉంటుందో రాయబడుతుంది. పుట్టుక, చావులు స్పష్టంగా రాయబడి ఉంటాయని చెప్పాడు చాణక్యుడు. ప్రాపంచిక సుఖాలు, బాధలను అనుభవించిన తర్వాత, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట తేదీన శరీరాన్ని విడిచిపెట్టాల్సిందేనని అన్నాడు ఆచార్యుడు. ఒక వ్యక్తి ఎంత కోరుకున్నా తన వయస్సును పెంచుకోలేడని, చావును ఆపలేడని చెప్పాడు.
కర్మ:
ఆచార్య చాణక్యుడు కర్మ గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. ఆచార్యుడి ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసే కర్మలు, వాటి ఫలితాలు ముందే రాయబడి ఉంటాయని చెప్పాడు.
ఒక వ్యక్తి తన పూర్వ జన్మ కర్మల ఫలితంగా వర్తమానంలో సుఖదుఃఖాలు అనుభవిస్తాడని చాణక్యుడు చెప్పాడు. కర్మ ఫలితాలు ప్రస్తుతం మన చేతుల్లో లేకపోయినా.. ఇప్పుడు చేసే సత్కర్మలు మరుజన్మలో సుఖాన్ని అందిస్తాయని చెప్పాడు.
ఆనందం, విచారం:
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వచ్చినట్లుగానే సుఖదుఃఖాలు ఉంటాయని చాణక్యుడు సూచించాడు.
దుఃఖం అనుభవిస్తున్న తర్వాత సుఖం వచ్చి తీరుతుందని చాణక్యుడు తెలిపాడు. సత్కర్మలు చేస్తూ పోవడం మాత్రమే మనిషి చేయాల్సిన విధి అని చెప్పాడు.
జ్ఞానం:
డబ్బులాగే జ్ఞానం కూడా విధిలో ముందే రాయబడి ఉంటుంది. గ్రంథాల్లో, వేదాల్లో జ్ఞానం ఉంటుంది. అలాగే జ్ఞానం ఒక్కరోజులో వచ్చేది కాదని, అది నిరంతర ప్రయత్నం ద్వారా వస్తుందని చెప్పుకొచ్చాడు చాణక్యుడు.
మరణం:
జనన మరణాలు పుట్టక ముందే నిర్ణయించబడతాయని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. నిర్ణీత సమయంలో ఒక వ్యక్తి మరణం ఖాయమని చెప్పాడు ఆచార్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications