Just In
Don't Miss
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Movies
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
చిల్డ్రన్స్ డే రోజున ఈ చిన్న పనులను చేయండి.. చిన్నారులను ఆకట్టుకోండి..
పిల్లలు సున్నితమైన వారు. చిన్నచిన్న వాటికే ఆనందపడటం లేదా ఏడవటం వంటివి చేస్తుంటారు. పెద్దవారి లాగా వారికి ఎలాంటి లక్ష్యాలు, ఆశలు, కోరికలు ఉండవు. కాకపోతే కాస్త అల్లరి మాత్రం చేస్తారు. అది హద్దు దాటకుండా తల్లిదండ్రులు, గుురువులే బాధ్యత తీసుకోవాలి. ఇంకొందరు పిల్లలు బుద్ధిగా ఉంటారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు, గురువులు, ఇతర పెద్దలు వారికి మంచి ప్రవర్తన, విద్యను బలవంతంగా కాకుండా వారు ఇష్టపడేలా నేర్పించాలి.
ఎందుకంటే ఇప్పటితరం పిల్లలు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. వాటిని వెలికి తీస్తే చాలు మీ పిల్లలు భవిష్యత్తులో మీరు ఊహించినదాని కంటే ఎదుగుతారు. దీని కోసం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం రోజున వారిని సర్ ప్రైజ్ చేయాలి. అందుకోసం మీరు వారి కోసం తగినంత సమయం కేటాయించాలి. ఇంతకీ ఆరోజు ఏమేమీ చేయాలో.. పిల్లలను ఎలా ఆకట్టుకోవాలో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.

బాలల దినోత్సవం ఎందుకో చెప్పాలి..
మన దేశంలో తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆయన చిన్నపిల్లలను ఎక్కువగా ఇష్టపడ్డారని మరియు వారే మన దేశ భవిష్యత్తు అని గాఢంగా నమ్మాడు. అందుకే నెహ్రు పుట్టినరోజున పాఠశాలల్లో విద్యార్థుల చుట్టూ ఉల్లాసం ఉండేలా చూసుకుంటారు.

స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలి..
ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు అనేదే లేదు. ఒక వేళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా కనీసం సాధారణ ఫోన్ అయినా కచ్చితంగా ఉంటుంది. ఇక ఆ ఫోన్ తో మనకు లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలోనూ ఇది రోజురోజుకు పెరుగుతుంది. అందుకే ఈరోజంతా మీతో పాటు మీ పిల్లలు అందరూ ఫోన్ ను పక్కనపెట్టాలి. సరదాగా బయటకు వెళ్లాలి. అందుకోసం ఎక్కడికి వెళ్లాలంటే..

పిల్లలతో పిక్నిక్..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలతో మీరు పిక్నిక్ ప్లాన్ చేయాలి. మీకు దగ్గర్లోని పార్కుకు గాని లేదా మీ నగర, పట్టణ శివారుల్లోని ప్రశాంతమైన ప్రదేశాలకు లేదా ఏదైనా తోట వద్దకు తీసుకెళ్లాలి. అలాగే మీకు అందుబాటులో బీచ్ ఉంటే సాగర తీరానికి తీసుకెళ్లాలి. అక్కడికి వాలీబాల్, రింగ్స్ వాటిని కూడా తీసుకెళ్లాలి. పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని కూడా తీసుకెళ్లాలి. మీకు ఇంకా వీలైతే మీ పిల్లలతో ఆ రోజంతా వినోదాత్మకమైన యాత్రను చేయాలి.

పాఠశాల నుండి తిరిగొచ్చాక పార్టీ..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలు పాఠశాల నుండి తిరిగి ఇంటింకి వచ్చాక, మీరు ఒక థీమ్ పార్టీని ఏర్పాటు చేయవచ్చు. ఈ పార్టీ సందర్భంగా మీ పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వండి. అలాగే మీ పిల్లల బెడ్ రూమ్ లలో కొన్ని సరదా చిత్రాలను వేలాడదీయండి. అవి వారిని ఆకట్టుకునేలా ఏర్పాటు చేయండి. అవి ఆసక్తికరంగా మరియు ప్రత్యేకంగా కనబడేలా చేయండి.

పిల్లలతో డ్యాన్స్..
బాలల దినోత్సవం రోజున మీరు మీ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయండి. ఇలాంటి వాటిని మీ పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు. దీని కోసం వారికి ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయండి. ఇందుకు మీ పిల్లల స్నేహితులను కూడా ఆహ్వానించండి. మీరు గడిపిన ఆ మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోండి. ఆ తర్వాత పిల్లల్లో ఆనందాన్ని చూడండి.

కొవ్వొత్తుల మధ్య..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చాక సాయంత్రం ముగిశాక చీకటి పడ్డాక పవర్ ను కాసేపు కట్ చేయండి. వారు అప్పుడు కేక్ కట్ చేస్తారని అనుకుంటారు. కానీ మీరు అలా చేయవద్దు. వారిని ఆశ్చర్యపరచడానికి ఇంటి చుట్టూ టార్చెస్ వేయండి. కొవ్వొత్తుల మధ్యలో మంచి కథలను చెప్పండి. కానీ పిల్లల్ని భయపెట్టేవి మాత్రం చెప్పకండి. అప్పుడు మీ పిల్లలు కచ్చితంగా ఆనందిస్తారు.

పిల్లలతో ఆటలు..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలతో పాటు మీ చుట్టుపక్కల ఉండే వారికి చిన్న చిన్న ఆటల పోటీలు నిర్వహించండి. ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ ను కొందరు ఇష్టపడతారు. ఇంకొందరు అవుట్ డోర్ గేమ్స్ ను ఇష్టపడతారు. అందుకే వారికి ఏయే ఆటలు క్రికెట్, చెస్, క్యారమ్స్, షటిల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ వంటి వాటితో పాటు ఇంకా వారికి ఏవి ఇష్టమో వాటిని నిర్వహించండి. గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఉంటాయని చెప్పండి. అప్పుడు పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. మీరు కూడా పిల్లలతో కలిసి ఆడండి. వారిని ఆనందరపరచండి.

పిల్లల పాటలు..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలతో పాటు మీ చుట్టుపక్కల ఉండే పిల్లలను పిలిచి మంచి పాటలను పాడాలి. వారు నేర్చుకోవడానికి అనువుగా, సులువుగా ఉండే పాటలను పాడి వినిపించాలి. ప్రతి పాటలో ఏదైనా సందేశం ఉండేటట్టు మంచి పాటలను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వారితోనూ పాటలు పాడించాలి. దీని వల్ల పిల్లల్లో వికాసం పెరుగుతుంది. భాషపై పట్టు పెరుగుతుంది. అలాగే మనో వికాసం, బిడియం పోవడం మరియు ఉద్వేగ పరిపక్వత పెరుగుతుంది.

ఇతర కార్యక్రమాలు..
బాలల దినోత్సవం రోజున పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలి. కూరగాయలతో ముద్రలు వేయడం, మట్టి బొమ్మలు చేయడం, వాటికి రంగులు వేయడం వంటివి చేయాలి. వీటిని మీ పిల్లలతో కూడా చేయించాలి. దీని వల్ల మీ పిల్లల్లో రంగుల గురించి అవగాహన ఏర్పడుతుంది. చిన్న కండరాలు కూడా మెరుగవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.

కేక్ కటింగ్..
బాలల దినోత్సవం రోజున మీ పిల్లలతో చుట్టుపక్కల పిల్లల్ని అలాగే, వారి స్నేహితుల మధ్య వారికి ఇష్టమైన కేక్ ను వారితో కట్ చేయించండి. అందరూ కలిసి ఆనందంగా ఈ వేడుకలను జరుపుకోండి. అంతకుముందు మీ పిల్లలకు ఎలాంటి కేక్ అంటే ఇష్టమో తెలుసుకోండి.