For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral : కరోనా మాత.. ఆవు కథ... 9 నెంబరకూ ప్రాధాన్యత.. ఎందుకో మీరే చూడండి...

కరోనా నేపథ్యంలో కరోనా మాతను మహిళలు పూజించడం మొదలుపెట్టారు. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

|

ఒకవైపు కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటే.. మన దేశంలో మాత్రం కరోనా గురించి ఎవ్వరు భయపడటం లేదు. వందల కేసులున్నప్పుడు ఎంతలా భయపడ్డారో.. అదే సంఖ్య లక్షల్లో చేరేసరికి చాలా మంది కరోనాను లైట్ తీసుకుంటున్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే కరోనా గురించి తెలియని వారు.. టెక్నాలజీ అందుబాటులో లేని ప్రాంతాల్లో కరోనాను ఏకంగా దేవతగా కొలుస్తున్నారు. అంతేకాదు మూఢనమ్మకాలను విపరీతంగా వ్యాపింపచేస్తున్నారు. ఇదంతా ఏదో ఒక ప్రాంతంలో అయితే పర్వాలేదు కానీ... చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.

Corona became goddess due to epidemic and women are worshipping

ఇటీవలే మన తెలంగాణలో కొందరు 'కరోనా గో కరోనా గో' అంటూ మర్రిచెట్టుకు పసుపు నీళ్లు చల్లడం వంటివి మనం చూశాం. అయితే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అయితే మరీ విచిత్రంగా ఆదివాసీలు, ధన్ బాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు కరోనా మాతకు పూజలు చేస్తున్నారు.

Corona became goddess due to epidemic and women are worshipping

ఈ పూజలో మరో వింత కూడా ఉంది. ఈ పూజలో కూడా అంతా తొమ్మిదో నెంబరుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పూజ చేసేవారు 9 స్వీట్లు, 9 రకాల పూలు, 9 అగర్ బత్తీలు సమర్పిస్తేనే కరోనా మాత కరుణిస్తుందట... ఈ కరోనా పూజల గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా భజనలు కూడా..

కరోనా భజనలు కూడా..

జార్ఖండ్ లోని ధన్ బాద్ సమీపంలో ఉన్న ఝరియా ప్రాంతంలో కొందరు మహిళలు, ట్రాన్స్ జెండర్లు చేరి కరోనా మాత పేరిట పూజలు చేస్తూ కనిపించారు. అంతేకాదు కరోనా మాత భజనలు కూడా మొదలుపెట్టేశారు. తాజాగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు కేరళలో కూడా కరోనా మాతను కొలిచే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కరోనా కలలో కనిపించిందట..

కరోనా కలలో కనిపించిందట..

దీని గురించి స్థానిక మీడియా ప్రతినిధులు వారిని ఈ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. అందరికీ దిమ్మ తిరిగిపోయే సమాధానాలిచ్చారు. అక్కడి వారిలో ఓ మహిళకు కరోనా మాత కలలో కనిపించి.. 9 రకాల పూలు, పళ్లు, అగర్ బత్తీలతో పూజలు చేస్తే తాను ఎక్కడి నుండి వచ్చానో అక్కడి వెళ్లిపోతానని చెప్పిందని చెప్పారు. అసలు ఈ నెంబరుకు ఎందుకు వాడుతున్నారంటే కోవిద్-19 ప్రకారం అందులోని చివరి అంకె ఆధారంగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.

ఆ రెండు రోజులే...

ఆ రెండు రోజులే...

అసలు ఈ కరోనా మాత ఎలా వచ్చింది.. ఎక్కడి నుంచి వచ్చింది.. అని అందరూ ఆశ్చర్యపోతుంటే, కరోనా మాతకు అప్పుడే కథను కూడా అల్లేశారు. అంతేకాదు పూజా నియమాలు, సమయాలు కూడా నిర్ణయించేశారు. కరోనా మాతను ఎప్పుడుపడితే అప్పుడు కొలిస్తే లాభం ఉండదట. కేవలం సోమవారం, శుక్రవారం మాత్రమే కరోనా దేవిని పూజించాలట.

కరోనా కథ ఇలా..

కరోనా కథ ఇలా..

కరోనా మాత గురించి ఓ కథ కూడా అప్పుడే ప్రచారంలోకి వచ్చేసింది. ఒకరోజు కొందరు వ్యక్తులు ఆవులను మేపేందుకు పొలానికి వెళితే.. అప్పుడు అక్కడ ఉన్న ఓ ఆవు ఉన్నట్టుండి ముసలామెగా మారిపోయిందట. ఇది చూసి భయపడిన అక్కడి మహిళలందరూ వెంటనే పరుగెత్తగా.. ఆమె తనను చూసి భయపడకండి.. తాను కరోనా మాతనని వారితో చెప్పిందట. అంతేకాదు తనకు పూజలు చేస్తే వారి కుటుంబాల్లో ఎవ్వరికి కరోనా రాదని, కలకాలం ఆరోగ్యంతో సుఖంగా జీవనం సాగిస్తారని తెలిపిందట. దీంతో అక్కడి వారంతా కరోనా దేవికి పూజలు చేయడం ప్రారంభించారట..

English summary

Corona became goddess due to epidemic and women are worshipping

Here we talking about corona became goddess due to epidemic and women are worshipping. Read on.
Desktop Bottom Promotion