శుక్రవారం మీ రాశిఫలాలు (17-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 17, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. మరోవైపు ఈరోజు కుటుంబ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే, అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు బదిలీ వార్త వంటివి వినిపించవచ్చు. దీని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోసంగా గడిపే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మీరు నష్టపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు చాలా శ్రద్ధగా పని చేస్తారు. బహుశా ఈ రోజు మీరు కష్టమైన పనిని సులభంగా మరియు సమయానికి పూర్తి చేయవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో సమస్య ఉండవచ్చు. జీవిత భాగస్వామి యొక్క స్వభావంలో చికాకు కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆదాయం విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. వ్యాపారులు ఈరోజు పెద్ద మార్పు ఉండవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కరోనా లాక్ డౌన్ : చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలు లాగా భావించకుండా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువ ఖర్చు చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్నిసమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో చిరాకు పడతారు. మీ మనస్సులో చాలా ప్రతికూల భావోద్వేగాలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మరోవైపు మీరు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పనిలో ఏవైనా అడ్డంకులుంటే, మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా సహనంతో పని చేయాలి. అప్పుడే మీ పని విజయవంతమవుతుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కుటుంబం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో చాలా తెలివిగా వ్యవహరించాలి. మీ సహోద్యోగులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గానే ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు ఆశ్చర్యం కలిగించే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు పెరగొచ్చు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ ప్రేమ ప్రతిపాదనకు సమాధానం కోసం మీరు ఎదురుచూస్తుంటే, ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను పొందవచ్చు. మీ ఉద్యోగంలో మీకు ఈరోజు అదృష్టం లభిస్తుంది. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. మీరు వ్యాపారం చేస్తే, మీరు ఈ రోజు చాలా సహనంతో, సంతృప్తితో పనిచేయాలి. ఇంటి వాతావరణం మామూలుగా ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో, మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి, మీ దినచర్యను కొంత మార్చుకోవాలి. దీని వల్ల మీకు ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. వ్యాపారులు లేదా ఉద్యోగులు ఈరోజు అకస్మాత్తుగా ఒక మంచి ప్రయోజనం పొందవచ్చు. మీ కృషి విజయవంతమవుతుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాగే, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ఏదైనా విషయంలో పెద్ద లాభం రావచ్చు. ప్రేమికులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. స్నేహితురాలితో విభేదాలుంటే, అవి మరింత ఉద్రిక్తంగా మారతాయి. మరోవైపు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏదైనా పనిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించాలి. దీని వల్ల మీకు భవిష్యత్తులో ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీరు వ్యక్తిగతంగా బిజీగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఈరోజు ఒకరికి ఆదాయ పరంగా సహాయం కూడా చేస్తారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు నిజాయితీగా పని చేసి మీ లక్ష్యం వైపు ముందుకు సాగాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యక్తిగత విషయానికొస్తే, ఈ రోజు మీరు మీ పిల్లలతో గడుపుతారు. చిన్న విషయాలు కూడా తరచుగా గొప్ప ఆనందాన్ని ఇస్తాయని ఈ రోజు మీరు అర్థం చేసుకోగలరు. జీవిత భాగస్వామితో సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు వివాదం ఉండొచ్చు. అయితే ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. ఈరోజు మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలను తొందరలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు చాలా ఓపికగా పని చేయాలి. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలుంటే పరిష్కారమవుతాయి. ఈ రోజు, మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం.

Story first published: Friday, April 17, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion