For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా లాక్ డౌన్ : చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలు లాగా భావించకుండా ఉండాలంటే...

ఈ వైరస్ నుండి రక్షణ కోసం అందరూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే చాలా మందికి ప్రస్తుతం తమ ఇల్లే జైలులా మారిపోయిందని బాధపడుతున్నారు

|

మన భారత దేశ కాలచక్రంలో అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ మెరుస్తూ ఉండే మణిపూస ఎవరైనా ఉన్నారంటే అది చాణక్యుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు సభలలోనే కాకుండా అనేక చోట్ల చాణక్యుని సిద్ధాంతాలు పాటిస్తూనే ఉంటారు.

Remember These Chanakya Tips During Lockdown

అనేక మంది రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలను సైతం కొనసాగిస్తున్నారు. వీటన్నిటి సంగతి పక్కనబెడితే ప్రస్తుతం మన దేశంలో కరోనా లాక్ డౌన్ వల్ల చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

Remember These Chanakya Tips During Lockdown

ఈ వైరస్ నుండి రక్షణ కోసం అందరూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే చాలా మందికి ప్రస్తుతం తమ ఇల్లే జైలులా మారిపోయిందని బాధపడుతున్నారు. ప్రతికూల ఆలోచనలతో తీవ్రంగా చింతిస్తున్నారు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో ఎలా నడుచుకోవాలో చాణక్యుని సూత్రాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మంచి ప్లాన్ వేయండి.. కానీ

మంచి ప్లాన్ వేయండి.. కానీ

మీ జీవితంలో విజయం సాధించడానికి, లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరం. అయితే మీరు ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ప్లాన్ గురించి ఇతర వ్యక్తులతో అస్సలు చర్చించకండి. అలాంటివి మీ పనిని పెంచుతాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సమయాన్ని ఉపయోగించి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా అమలు చేయాలో కూడా ప్లాన్ చేయవచ్చు. అయితే దీని గురించి ఎవరిదగ్గర మాట్లాడకుండా ఉండాలి.

ప్రతికూలతల పట్ల..

ప్రతికూలతల పట్ల..

చాణక్యుడు మాత్రమే కాదు, మహాభారతంలో కూడా ప్రతికూలతల గురించి లేదా ఏదో ఒక విషయం గురించి ప్రస్తావించబడింది. అయితే వాటిలో చాలా వరకు మనకు అందుబాటులో లేవు. ఎక్కడో ఓ చోట మూలుగుతూనే ఉన్నాయి. వీటి సంగతి పక్కన బెడితే మీ కార్యాలయంలో లేదా మీరు పని చేసే చోట మీకు ఫోన్ చేసి లేదా మీకు మెసెజ్ లు పెట్టి వారు గోడును వెళ్లబోసుకునే వ్యక్తులుంటే అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది లేదా అలాంటి వారికి మీరే దూరంగా ఉండటం మంచిది. అలాంటి వారితో ఉండటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి వారు మీ ప్రతికూలతలను వ్యాప్తి చేయడానికి మాత్రమే ఉపయోగపడతారు.

ఎవరైతే శుభ్రత పాటిస్తారో...

ఎవరైతే శుభ్రత పాటిస్తారో...

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇంటి నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో కొంత మంది ఇప్పటికీ పరిశుభ్రతపై శ్రద్ధ చూపటం లేదు. చాణక్య నీతి ప్రకారం ఎవరైతే శుభ్రమైన బట్టలు ధరించరో, పళ్లు సరిగ్గా తొముకోకుండా ఉంటారో, ఎక్కువగా తింటూ అసభ్యకర పదజాలాన్ని వాడతారో, సూర్యోదయం తర్వాత ఎవరైతే మేల్కొంటారో వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదట.

గతం గురించి చింతించకుండా..

గతం గురించి చింతించకుండా..

చాణక్యుని నీతి ప్రకారం.. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ గురించి మనం చింతిస్తూ కూర్చోకూడదట. ఎందుకంటే అది ఇప్పుడు మన చేతుల్లో లేదు. అనుకోకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే, మీరు దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా, మీ భవిష్యత్తు గురించి ఫోకస్ పెట్టాలి. కాబట్టి లాక్ డౌన్ సమయంలో మీ పని గురించి మీరు చింతించకండి. రాబోయే కాలానికి మీరు సన్నద్ధం కావాలి.

ఆదాయం గురించి..

ఆదాయం గురించి..

ఒక వ్యక్తి తనకు సంబంధించినంత వరకు ఆదాయం గురించి చాణక్యుడు ఈ విషయం చెప్పాడు. ఎవరైనా డబ్బు ఆదా చేసుకోవడం గురించి ఆలోచించాలి. కానీ అదే సమయంలో తమను నమ్మి వచ్చిన వారిని రక్షించే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నాడు. ఇలాంటి సమయంలోనే డబ్బును పొదుపుగా వాడుకోవాలని చెప్పాడు.

English summary

Remember These Chanakya Tips During Lockdown

Chanakya Niti: Chanakya was an Indian teacher, economist and a political adviser. His life lessons are relevant in todays scenario as well.
Story first published:Monday, April 13, 2020, 17:41 [IST]
Desktop Bottom Promotion