For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (28-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 28, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ వారం మీ రాశి ఫలాలు 26 నుండి మే 2వతేదీ వరకు...ఈ వారం మీ రాశి ఫలాలు 26 నుండి మే 2వతేదీ వరకు...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న వివాదాలన్నీ ఈరోజు తొలగిపోతాయి. దీనికి మీ జీవిత భాగస్వామి కూడా సహాయం చేయవచ్చు. మీరు ఈరోజు చేసే పనిలో మంచి ఫలితాలను పొందుతారు. మీ పనితీరు బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈరోజు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన చర్చల్లో పాల్గొనకపోతే మంచిది. లేదంటే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మీ పనిని మెరుగ్గా చేస్తారు. వ్యాపారులు ఏదైనా కొత్త పనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా కష్టమైన పనులు కేటాయించవచ్చు. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది. ఇలాంటి సమయాల్లో మీరు ప్రశాంతమైన మనసుతో పని చేసేందుకు ప్రయత్నిస్తే, మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి కూడా సహాయం ఆశించవచ్చు. ఈ రోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా సులభంగా డబ్బును ఖర్చు చేస్తారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా కొంత ఇబ్బంది కలిగినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల ప్రశంసలతో ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే మీరు ఆశిస్తున్న ఆర్థిక లాభం పొందలేరు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు, మీ భాగస్వామితో అనవసరమైన చర్చ కారణంగా మీ మధ్య గొడవలు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో మీరు సంయమనం పాటించాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో కూడా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కఠినంగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు చాలా వరకు అంతరాయం ఏర్పడుతుంది. వ్యాపారులకు ఈరోజు ఎక్కువ కలవరపడే పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా ఉండాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు పెద్దల మాటలను పాటించడం మంచిది. ఆర్థిక పరంగా కొన్నిసమస్యలు ఉండొచ్చు. ఈరోజు కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని భారం తేలికగా ఉంటుంది. మీ కోసం మీకు తగినంత సమయం లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త దానికి సంబంధించి చర్చలు చేస్తారు. మీరు ఈ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇలాగే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 3:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు ప్రయోజనాలు దక్కుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు వారి నుండి ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు. మీకు తోబుట్టువులతో సమస్యలు ఉంటే, ఈ రోజు కూడా అది ముగియవచ్చు మరియు మీ సంబంధం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మీ పనిని బలమైన విశ్వాసంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందవచ్చు. మీకు మంచి మానసిక మరియు శారీరక ఆరోగ్యం కలిగి ఉంటారు. వ్యాపారులు కొంత ఉపశమనం పొందవచ్చు. మరోవైపు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో నేటి రోజును ఆనందిస్తారు. విద్యార్థులకు ఈ సమయం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

 మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగుండదు. మీ నిర్ణయాలతో మీ తల్లిదండ్రులు మీతో ఏకీభవించరు. అటువంటి పరిస్థితిలో, మీ కుటుంబ సభ్యుల మాట వినడానికి మీరు ఒత్తిడి చేయకుండా ఉండాలి. లేకపోతే మీ సంబంధాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. మరోవైపు ఈరోజు మీ పనితీరు చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు అన్ని పనులను చాలా వేగంతో పూర్తి చేస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనారోగ్యంగా ఉంటారు. ఇలాంటి సమయంలో మీపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు కుటుంబం నుండి ప్రేమ మరియు ఆప్యాయత లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమగల జంటలకు ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని మీరు భావిస్తారు. మరోవైపు, ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీ ఆందోళనను పెంచుతుంది. మీరు వారితో ఎక్కువ సమయం గడపడం మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. పిల్లల వైపు నుండి ఆనందం వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ, నేడు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. నేడు, పనిభారం కూడా తక్కువగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 28, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, April 27, 2020, 19:29 [IST]
Desktop Bottom Promotion