For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

|

గమనిక : ఈ ఆర్టికల్ మాకు దొరికిన సమాచారం మరియు అంతర్జాలంలో దొరికిన విషయాలను అనుసరించి మాకు ఉన్న పరిజ్ణానాన్ని జోడించి రాసినవి మాత్రమే.

మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు.

మన నిత్య జీవితంలో ఎంత కాదనుకున్నా అత్యంత అవసరమైనది డబ్బు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు డబ్బే మనల్ని నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాధాన్యత సంపాదించుకున్న కరెన్సీ నోట్లను మనం ఎంతలా పొదుపుగా వాడుదామనుకున్నా.. అది మాత్రం సాధ్యపడదు. నిత్యం పెరిగే ధరలు.. ఛార్జీలు ఇతర కారణాలతో మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రాల ప్రభావం వల్లే మీరు డబ్బును ఆదా చేయడంలో ఫెయిల్ అవుతారని పండితులు చెబుతున్నారు. ద్వాదశ రాశులలోని ప్రతి ఒక్క రాశి చక్రానికి ఖర్చుల విషయంలో కనీసం ఒక్క ప్రతికూల లక్షణమైనా ఉంటుందట. అవే మీ పొదుపును ప్రభావితం చేస్తాయట. అందుకే మీరు మూలధనాన్ని ఎంతగా ఆదా చేద్దామనుకున్నా మీకు నిరంతరం ఏదో ఒక రూపంలో సమస్యలొస్తాయట. ఇంతకీ 12 రాశిచక్రాలలో డబ్బును ఆదా చేయడంలో ఉండే ప్రతికూల లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!

మేషరాశి..

మేషరాశి..

ఈ రాశి వారు పొదుపు గురించి ఎక్కువగా ఆలోచించరు. వీరిలో చాలా మంది ప్రస్తుతం కాలం గడుస్తుందా లేదా అనే దానిని ఎక్కువగా నమ్ముతారు. అందుకే వీరు డబ్బును బ్యాంకులలో దాచకుండా ఖర్చులు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారట.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి ఖర్చుల విషయంలో ఏ మాత్రం ఆలోచించరట. ముఖ్యంగా వీరి జేబులో డబ్బులుంటే చాలు వీరికి అవసరం ఉన్నది... అవసరం లేని వాటిని ఎడాపెడా కొనుగోలు చేస్తారట. అంతేకాదు ఏదైనా వస్తువు చౌకగా దొరుకుతుందటే చాలు వాటి నాణ్యత కూడా చూడకుండా కొనేస్తారట. అలాంటి పనులే వీరిని డబ్బును పొదుపు చేయకుండా ఇబ్బందుల్లోకి పడేస్తాయట. అయితే వీరు విలాసాల వంటి వాటికి ఎక్కువ చేయరట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు డబ్బును తగిన రీతిలో ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపుతారట. వీరు డబ్బును ఆదా చేయడం కంటే.. సౌకర్యవంతమైన జీవితానికే అధిక ప్రాధాన్యత ఇస్తారట. అంతేకాదు అలాగే జీవిస్తారు కూడా. అందుకే వీరు స్థిరమైన ఉద్యోగాలు చేసేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపరట. వీరు ఏమి చేయాలనుకుంటారో అది చేసేస్తారట. ముఖ్యంగా ఖర్చుల విషయంలో.

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి భవిష్యత్తు గురించి ఆలోచించడం ఇష్టమున్నప్పటికీ.. డబ్బు విషయమొచ్చేసరికి తరువాత చూసుకుందాంలే అనే ధోరణితో వ్యవహరిస్తారట. ప్రస్తుతం ఖర్చు చేయడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయరట. ఇలాంటి లక్షణాల వల్లే వీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతూ ఉంటారట.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించినప్పటికీ, ఆర్థిక విషయాల్లో మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారట. ఎందుకంటే వీరు సంపాదించిన డబ్బును ప్రత్యక్షంగా ప్రయోజనం కాని వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారట. అందులోనూ ఇతరులను ఆకట్టుకునేందుకే అధిక ఖర్చులు చేస్తారట.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి చాలా విషయాల్లో పరిపూర్ణ అవగాహన ఉంటుంది. అయితే వీరు లగ్జరీ లైఫ్ ను ఇష్టపడతారట. అది ఎంతలా అండర్ వేర్ కూడా లగ్జరీగా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఇలాంటి విలాసవంతమైన వాటి కోసం కరెన్సీ ఎక్కువగా ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారట.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలనుకుని అధిక ఖర్చులు చేస్తారట. కానీ ఎప్పటికీ అలా జరగదంట. అన్నింట్లో అనవసరమైన వాటి కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తారట. అంతేకాదు వీరు అందరిలో ప్రత్యేకంగా కనబడేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడరట.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు చాలా అంకితభావంతో ఉంటారట. అయితే ఏదైనా నచ్చితే ముందు వెనుక ఆలోచించకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారట. అందులో నష్టమొచ్చిన తర్వాత అనవసరంగా డబ్బు పోయిందని చింతిస్తూ కూర్చుంటారట.

ధన రాశి..

ధన రాశి..

ఈ రాశి వారు ప్రయాణాలకు, విందులకు, విహారాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరు సంపాదించిన డబ్బును అంతా టూర్ల కోసమని నీళ్లలా ఖర్చు చేస్తారు. వీరు ప్రయాణించడాన్నే ఒక ఆస్తిగా భావిస్తారు.

మకరరాశి..

మకరరాశి..

ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు. అయితే పొదుపు విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. కొన్నిసార్లు అనవసరమైన గందరగోళానికి గురై డబ్బును ఖర్చు చేస్తుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఆర్థిక పరంగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే వీరు ఎంత ఖర్చు చేస్తారు మరియు ఎంత ఆదా చేయాలి అనే దానిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే వీరు సెలవు రోజుల్లో లగ్జరీ కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ముఖ్యంగా పేద ప్రజలకు సహాయం వంటివి చేయడం ఎక్కువగా చేస్తుంటారు. ఇది మంచిదే కానీ.. వీరి ఆర్థిక స్థిరత్వానికి మాత్రం ఇది మంచిది కాదని వీరు గ్రహించలేకపోతారు.

English summary

Why your zodiac sign fails to save money

No matter how much we try and deny it,money is an important part of our lives which is why each of us has their financial strenght and weakness. While doing so, there are signs who spend more and there are signs who are a littile more thoughtful about their finances.