For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (05-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ఇంట్లో ఈరోజు అకస్మాత్తుగా ఓ వివాదం తలెత్తుతుంది. సమన్వయం క్షీణించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండకపోవచ్చు. దీని వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు. అలాంటి సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతారు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ సమయంలో మీరు గతంలో చేసి తప్పుల నుండి పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు పనిభారం ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చెడు అలవాట్లను వదిలేయాలి. అలాగే రాత్రి వేళలో ఎక్కువ సేపు మేల్కొనడం మానుకోండి. సమయానికి భోజనం చేయాలి. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఎక్కువగా ఆలోచించి మీ మానసిక శాంతికి భంగం కలిగించవద్దు. మీరు మీ సమస్య పరిష్కారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు ఈ సమయంలో కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలి. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే పని విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కానీ మీరు అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తారు. అంతేకాదు మీరు అదనపు పని కూడా చేయవచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే, ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. మరోవైపు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. మీకు ఇంటి పెద్దల నుండి మద్దతు లభిస్తుంది. మరోవైపు, జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదాలు ఏర్పడవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

<strong>అమ్మో! కరోనా వైరస్ ఇంకా అన్ని రోజుల పాటు ఉంటుందా?</strong> అమ్మో! కరోనా వైరస్ ఇంకా అన్ని రోజుల పాటు ఉంటుందా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు ఆదాయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు వారికి మద్దతు ఇస్తారు. ఈరోజు శృంగార జీవితంలో మీకు మంచి ఫలితాలు ఉండొచ్చు. ఈ రోజు మీ ప్రేమ నిజమని మీరు భావిస్తారు. ఈ రోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు అన్ని పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు జీవిత భాగస్వామితో చాలా ప్రేమగల రోజు అవుతుంది. ఈ రోజు మీరిద్దరూ చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీకు పూర్తి అదృష్టం లభిస్తుంది. ఈ రోజు మీ కృషి విజయవంతమవుతుంది. మీ పురోగతి యొక్క సంకేతాలను మీరు పొందుతారు. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు మీరు కొత్త మరియు పెద్ద పనిని పొందవచ్చు. అయితే, మీరు ఈ సమయంలో మరింత కష్టపడాలి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 8:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువ సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు అనవసరమైన వాటిలో తలదూర్చి సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులపై మీరు శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. మరోవైపు మీ స్నేహితులు లేదా సహోద్యోగుల సహాయంతో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి అవకాశం లభించవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగానూ ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది మీ పనిపైనా ప్రభావం చూపుతుంది. ఈరోజు మీరు అన్ని పనులను చాలా వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు సానుకూల నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మీరు లాభదాయకమైన ఒప్పందం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఆందోళన ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. మీజీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఒక శుభవార్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ పని విషయంలో పురోగతి సాధించాలంటే, మీరు చాలా కష్టపడి పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు ఎక్కువ లాభం ఉండొచ్చు. మీ వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహితులకు శృంగార జీవితంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వారు మీతో ప్రత్యేక సంభాషణ చేయవచ్చు. మీరు వివాహం చేసుకుంటే ఈ రోజు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఉండటం ద్వారా, మీరు మీ ఒత్తిడిని మరచిపోతారు. ఈ రోజు మీ ప్రియమైన వారు మీ పనిలో కొన్నింటిని కూడా పంచుకుంటారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఈ రోజు మీరు కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో వాదన చేయవచ్చు. మీరు పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో0 జీవిత భాగస్వామిపై ఆరోపణలు మానుకోండి. మీరిద్దరూ కలిసి ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రేమ విషయంలోనూ ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మరోవైపు పని విషయంలో సీనియర్ల సహాయంతో మీరు ఈరోజు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పెండింగులో ఉన్న ఏ పనిని అయినా పూర్తి చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ముఖ్యమైన రోజుగా ఉంటుంది. మీరు ప్రేమ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కొత్త సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూడా మీ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం మంచిది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన రోజు గడుపుతారు. ఈ రోజు, మీ మధ్య విభేదాలు ఉండవు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు విశ్వాసంగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. అయితే మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. మీకు పనిభారం పెరుగుతుంది.

వివాహితులకు శృంగార జీవితం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీకు మంచి అనుభూతి ఉండదు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 5, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, April 5, 2020, 1:31 [IST]
Desktop Bottom Promotion