శుక్రవారం మీ రాశిఫలాలు (21-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 21, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురికాకుండా మీరు ప్రశాంతంగా ఉండాలి. మరోవైపు ఈరోజు వ్యాపారులు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా ముఖ్యమైన సలహాలను పొందవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజును గణేశుడి ఆరాధనతో ప్రారంభిస్తే, మీకు మంచి ఫలాలు వస్తాయి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ఎలాంటి చిన్న పొరపాట్లు చేయకండి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీరు కొన్ని కొత్త మరియు పెద్ద పరిచయాలను పొందే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఈ రోజు మీరు రుణాలు తీసుకోవడం మరియు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీ ప్రియమైనవారితో ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ బాధ కలిగించొద్దు. మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీరు పిల్లల విద్య గురించి చాలా ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు. అయితే డబ్బు విషయంలో మీరు ఇతరులను గుడ్డిగా విశ్వసించకుండా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు మీకు ఏమైనా సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు సానుకూల శక్తితో ఉంటారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో రెట్టింపు వేగంతో పూర్తి చేస్తారు. వ్యాపారానికి సంబంధించి మీ ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి. మీరు మీ నిర్ణయాలు ఇదే విధంగా తీసుకుంటే, త్వరలో మీరు విపరీతమైన లాభాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యా ఉండదు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా ముఖ్యమైనది. మీరు ఎవరినైనా ఇష్టపడి, వారితో మాట్లాడాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ రోజు సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూలతను ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. కాబట్టి మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అదే సమయంలో, వ్యాపారులు గట్టి పోరాటం తరువాత ఈ రోజు కొంత లాభం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఎవరిని ఎగతాళి చేయొద్దు. ఎందుకంటే దీని వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయకపోతే, ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. వ్యాపారులు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. అయితే తొందరపాటులో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మికంగా ఎక్కువ అనుభూతి చెందుతారు. దీని వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసు పనులను ఆనందంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తే అది మీకు మంచిది. వ్యాపారులకు ఈరోజు లాభాలు రావొచ్చు. మీరు దేనిలో అయినా పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు తగిన సలహాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చాలా శ్రద్ధగా, కష్టపడి పని చేస్తారు. అయితే ఈ రోజు మీ యజమాని యొక్క వైఖరి కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ పనిపైనే దృష్టి పెట్టండి. మీరు వ్యాపారం చేస్తే మంచి లాభాలను ఆశించవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మీ ఇంటి శాంతిని కాపాడుకోవాలనుకుంటే, మీరు ఎలాంటి. వివాదాస్పద సమస్యను లేవనెత్తకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వివాదం పెరిగే అవకాశం ఉంది. మీరు ఈరోజు చేసే పనిపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులకు వ్యాపారంలో మంచి లాభం కావాలంటే మీరు కొన్ని మార్పులు చేయాలి. ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో వాదించడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఓ పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు. మీరు నిరుద్యోగులై, చాలాకాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ అన్వేషణ త్వరలోనే ముగుస్తుంది. మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ దిశలో మీ కదలికను చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శాంతంగా ఉండాలి. ఆరోగ్యం పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులుంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందాలనుకుంటే కూడా అంతే ఎక్కువగా కష్టపడాలి. మీరు వేగంగా ప్రయత్నిస్తూ ఉంటే, మీరే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు మంచి లాభం వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా ఉద్రిక్తత ఉంటే, ఈరోజు తగ్గిపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీకు ఈరోజు ఇష్టం లేకపోయినా, చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఆలోచించకుండా మందులు తీసుకోవడం మానుకోండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పని ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు మీరు ప్రణాళికాబద్ధంగా పని చేయాలి. దీనివల్ల మీకు ఒత్తిడి ఉండదు. వ్యాపారులకు ఈరోజు డబ్బు సంబంధిత సమస్య పరిష్కరించబడుతుంది. మీ కస్టమర్లలో ఒకరి నుండి బకాయిలు పొందే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ రోజు మీరు సౌకర్యవంతమైన విషయాలకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు పొదుపుపై ​​కూడా దృష్టి పెట్టాలి. ఈ రోజు విద్యుత్ సంబంధిత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, August 21, 2020, 5:00 [IST]
Desktop Bottom Promotion