For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (05-08-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఆగస్టు నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... ఓ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం వస్తుంది...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా ఎదురయ్యే సమస్యలను ఈ రోజు అధిగమించవచ్చు. మీరు అనుభవం ఉన్న వారి నుండి సలహాలను పొందుతారు. ఈరోజు మీరు కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో, మీ జీవిత భాగస్వామికి తక్కువ సమయం ఇవ్వడం వల్ల మీ ప్రియమైనవారు మీపై కోపంగా ఉంటారు. మీరు వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ ఉన్నతాధికారులు మీరు చేసే పనిలో లోపాలను వెతికిన సందర్భంలో, వారితో వాదించడానికి బదులుగా, మీరు మీ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి. మరోవైపు, వ్యాపారులకు ఈరోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు వ్యాపారం పెంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అయితే ఆదాయం కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందకరమైన రోజు గడుపుతారు. మీరు ఆరోగ్య పరంగా ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తుంటే, మీరు త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారులు పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ముక్కు లేదా గొంతుతో సంబంధం ఉన్న సమస్యతో బాధపడొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను అనుభవిస్తారు. దీని వల్ల మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. అలాగే మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. మరోవైపు ఉద్యోగులు, కార్యాలయంలో, పనిని పూర్తి విశ్వాసంతో చేస్తారు. మీ కృషి, అంకితభావం చూసి సీనియర్ ఆఫీసర్లు మీతో చాలా సంతోషంగా ఉంటారు. అయితే మీ సహోద్యోగులలో కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు లాభం రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చాలా కష్టపడి, నిజాయితీతో పని చేయాలి. లేదంటే మీపై ఫిర్యాదు వెళ్తాయి. మరోవైపు ఈరోజు వ్యాపారులు ఈరోజు చాలా ఆందోళన చెందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ తండ్రి మీకు సరైన దిశను చూపించగలరు. మీరు వారి సలహాను విస్మరించకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ వాహనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఉద్యోగం వదిలేయాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ ఆలోచనను వదిలివేయాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మరియు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలనుకుంటే, ఈ రోజు ఎటువంటి వాదన లేకుండా మీరు మీ నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత మెరుగుదల ఉంటుంది. మీ ప్రధాన సమస్యలలో దేనినైనా పరిష్కరించవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే, మీ పనిని తొందరపాటు చేయకుండా ఉండండి. కానీ మీ పనులను జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ చిన్న తప్పులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. వ్యాపారులకు ఈరోజు కొన్ని లాభాలు రావచ్చు. మరోవైపు ఈరోజు మీరు పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు ఈ రోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. మరోవైపు వ్యాపారులకు సంబంధించిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో మీ సమస్య పరిష్కారమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో సోమరితనంగా ఉండకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయం గడుపుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏ పని చేసినా చాలా సులభంగా పూర్తవుతుంది. అయితే మీరు పనిలో ఏదైనా పొరపాటు చేస్తే, మీరు దానికి సంబంధించిన ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు తమ ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఈరోజు ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఒక ప్రత్యేక రోజు అవుతుంది. మీరు వారి నుండి గొప్ప ఆశ్చర్యం పొందవచ్చు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఎక్కువ లాభాలను ఆశిస్తుంటే, మీరు మీ ప్రణాళికలలో కొన్ని మార్పులు చేయాలి. ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఖరీదైన స్వభావం ఈ రోజు మీ ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కావచ్చు. మీరు ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. మరోవైపు ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఓపికగా పని చేయాలి. మీ ఆలోచనను కూడా సానుకూలంగా ఉంచాలి. ఈ రోజు మీకు సహాయం అవసరమైతే, మీ స్నేహితులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే, మీరు కచ్చితంగా తగిన ఫలితాన్ని పొందుతారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:25 నుండి సాయంత్రం 4:45 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope August 5, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Wednesday, August 5, 2020, 6:00 [IST]