బుధవారం మీ రాశిఫలాలు (12-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మీ ఇంట్లో పెద్ద వివాదం తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో మీరు మానసికంగా బాధపడతారు. ఈరోజు మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి రాత్రి 10:25 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు సరైన ఫలితాలను పొందడానికి కృషి చేస్తారు. ఈరోజు మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా మంచి మరియు బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ కెరీర్‌కు కొత్త దిశను ఇచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తూ ఉండండి. ఈ రోజు మీ తండ్రితో మాట్లాడటానికి అనుకూలంగా ఉంటుంది. మీరు వారి నమ్మకాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. మీరు వారి నుండి

సహాయం కూడా పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ సంబంధంలో మీరు తాజాదనాన్ని అనుభవిస్తారు. ఈ రోజు మీరు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో రోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, మీరు మీ బడ్జెట్ దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మీరు ఈ సమయంలో రుణాలు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం వంటివి మానుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీ సమస్యలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు.అయితే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన చేయబోతున్నట్లయితే, ఈ రోజు మీరు మీ అడుగును ఆలోచనాత్మకంగా వేయాలి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే మీరు సానుకూలంగా ఆలోచించాలి. మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ప్రేమ వారి భాగస్వామితో ఎంతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారైతే ఈ రోజు మీ జీవిత భాగస్వామి పనిలో చాలా బిజీగా ఉంటారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈ రోజు, కుటుంబ సభ్యులతో మీ వైరం ముగిసిపోతుంది. మీరు మరోసారి ప్రేమించబడతారు. ఈ సమయంలో మీరు మీ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. ఓపికగా పని చేయడం మంచిది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు చాలా కాలంగా కలవని బంధువులను ఈరోజు సందర్శించడానికి ప్రయత్నించండి. ఈ రోజు తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారికి విలువైన బహుమతిని కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి రాత్రి 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని పరిష్కరించే సామర్థ్యం మీకు ఉంటుంది. మీరు ఏ విషయంలో అయినా ఈరోజు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితాన్ని పొందాలని చూస్తారు. నిరుద్యోగులకు ఈరోజు అన్ని ఆటంకాలు తొలగిపోవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొంత కష్టంగా అనిపిస్తుంది. అయితే ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనది. మీరు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకుండా ఉండాలి. పని విషయంలో ఈరోజు చాలా ఒత్తిడి ఉంటుంది. పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పని చేయండి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ రోజు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. దీనివల్ల చిన్న విషయాలు కూడా మీ మనసుకు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యంగా ఉంటుంది. ప్రేమగల జంటలకు ఈ రోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

Story first published: Wednesday, February 12, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion