For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (10-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీకు అదనపు ఆదాయానికి అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, దానికి ముందు అనుభవం ఉన్న వారిని లేదా మీ తండ్రిని సంప్రదించాలి. మీ వ్యక్తిగత జీవితంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా విషయంలో అతిగా ఆలోచించకండి. ప్రశాంతంగా ఉండండి. పని విషయంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారవేత్తలు ఏదైనా పనిని ఆలోచనాత్మకంగా చేయాలి. ప్రేమ విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు విద్యార్థి అయితే, మీరు మీ చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి రాత్రి 11:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. వివాహం అయిన ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీరు మీ భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తాయి. ఈరోజు ఆర్థిక పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో సమస్యలు రావొచ్చు. మీరు మీ భాగస్వామికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి మీరు కొంత కాలం ఓపిక పట్టాలి. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా మీరు డబ్బు అందుతుంది. మీరు ఈరోజు షాపింగ్ కూడా చేయవచ్చు. మీ కార్యాలయంలో మీ సహోద్యోగులు మీ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, బంధం మరియు పరస్పర గౌరవం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం విషయానికొస్తే, మీరు ఈరోజు ఒక ప్రత్యేకమైన బహుమతిని మీ భాగస్వామి నుండి పొందుతారు. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మీరు ఏదైనా సామాజిక లేదా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:20 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయాలి. లక్ కలసి వస్తుందో అనే ఆశతో ఉండకూడదు. మీ వ్యక్తిగత జీవిత సమస్యల విషయంలో మీ తల్లిదండ్రులు సహాయం చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీరు చిన్న పెట్టుబడి కూడా పెట్టవచ్చు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనిని పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో సంబంధం విషయంలో ఏదైనా గొడవ వచ్చే అవకాశం ఉన్నందున మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరిద్దరూ ఈరోజు సొంత పనుల్లో బిజీగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలను పక్కనపెడితే ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వింటారు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 8:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పెద్దల మాటలను వినాలి. వారు ఏదైనా సలహా ఇస్తే దానిపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వాటి నుండి మీరు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం పొందవచ్చు. కార్యాలయంలో కూడా మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు మీకు కలసి వస్తుంది. మీ భాగస్వామితో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చిన్న సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని కంట్రోలులో ఉంచుకోవాలి. మీ కోపం ఇతరులపై చూపడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు పనిపై శ్రద్ధ పెట్టాలి. మీరు ఈరోజు ఆఫీసులో ఇబ్బంది అనిపించేటటువంటి ఏ పని చేయకూడదు. మీకు త్వరలో కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ భాగస్వామితో ఓ విషయంలో వాదన కూడా జరగొచ్చు. అనవసరమైన వాటి గురించి చర్చించకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే, ఈరోజు మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. అంతేకాదు మీకు మంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు సానుకూలంగా ఉంటారు. మీరు మీ విశ్వాస స్థాయిని కొనసాగిస్తే, మీరు త్వరలో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీ శృంగార జీవితంలో మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు. వివాహిత జంటల సంబంధం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

English summary

Daily Horoscope January 10, 2020

Read your daily horoscope to know if luck will be in your favour or there will be many obstacles in your way. It is important to know what your stars have in store for you.
Story first published:Thursday, January 9, 2020, 18:36 [IST]
Desktop Bottom Promotion