For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (03-01-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలం కష్టపడిన తర్వాత కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఈ రాశి వారికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు ఆలోచనాత్మకంగా గడపండి. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబసభ్యుల ద్వారా మరింత ఆప్యాయత లభిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. వారు చాలా బిజీగా ఉండవచ్చు. శీతాకాలం ప్రభావం వల్ల మీరు చలి నుండి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పేదవారికి సహాయం చేయడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. పని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరు చాలా బాగుంటుంది. మీ సీనియర్ల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్లగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మరోవైపు, మీ శృంగార జీవితంలో కొంత సమస్య ఉండవచ్చు. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు సానుకూలంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈరోజు మంచి లాభాలు కూడా రావచ్చు. మీరు కొత్తగా ఉద్యోగం లేదా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తుంటే దానిలో మీరు విజయం సాధించవచ్చు. అలాగే పనికి సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఆనందంగా సమయం గడుపుతారు. అయితే మీ జీవిత భాగస్వామితో కొంత వివాదాలు రావచ్చు. ఈరోజు ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. అయితే మీరు తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆందోళన చెందుతారు. అయితే ఓపికగా ఉన్నండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు శ్రద్ధగా పని చేయాలి. ముఖ్యంగా మీ ఉన్నతాధికారులు మీకు అప్పగించిన పనిని నిజాయితీగా పూర్తి చేయాలి. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మునుపెన్నడూ లేని విధంగా ప్రేమను అనుభవిస్తారు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు. మీకు గురువుల మద్దతు కూడా ఉంటుంది. మానసికంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. కానీ కొన్ని కోర్టు కేసులలో చిక్కుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఇంట్లో ఈరోజు కొంత వివాదం జరగొచ్చు. చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారొచ్చు. మీరిద్దరూ ఒకరితో ఒకరు చెప్పేదాన్ని నియంత్రించడం మీకు మరియు మీ భాగస్వామికి మంచిది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి మంచిగా ఉండదు. మీరు వారి స్వభావంలో కోపం మరియు చికాకు చూడవచ్చు. పని విషయంలో కొంచెం కష్టంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులు కూడా ఈరోజు కఠినమైన వైఖరిని అవలంభించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం విఫలం కావొచ్చు. ఆర్థిక పరిమితుల కారణంగా చాలా ప్రతికూల ఆలోచనలు మీ మనసును ఇబ్బంది పెడతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 10:45 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు ఆర్థిక పరంగా పరిశీలిస్తే మీరు అవసరం కంటే ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. కార్యాలయంలో మీరు మీ ఉన్నతాధికారులతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటే, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీ భాగస్వామి సహాయంతో పనిలో ఎంత ఒత్తిడిగా ఉన్న సులభంగా దాన్ని పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ ఆరోగ్యం ఈరోజు బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా గొడవలు ఏర్పడవచ్చు. మీ తల్లిదండ్రులు మీపై చాలా కోపంగా ఉండొచ్చు. మీరు మీ తప్పును సకాలంలో సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు. ఇది మీ భాగస్వామిని కూడా బాధపెడుతుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించడానికి ఇది సరైన సమయం. ఈ రోజు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశించిన ఆస్తిని మీరు పొందలేరు. దాని వల్ల మీరు చాలా బాధపడతారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మీరు నిరుత్సాహం చెందకుండా ప్రయత్నిస్తూ ఉంటే మీకు త్వరలో విజయం లభిస్తుంది. ఈ రోజు, మీరు మీ ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించాలి, లేకపోతే, అకస్మాత్తుగా మీరు కొన్ని కాలానుగుణంగా వచ్చే వ్యాధులు రావచ్చు. ఈరోజు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉండొచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. అయితే మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు అవసరం అవుతుంది. ప్రతికూల పరిస్థితులలో మీరు వారి పూర్తి మద్దతును పొందినప్పటికీ, ఈ రోజు మీరు ఎటువంటి నిర్ణయానికి రాలేరు. మానసిక గందరగోళం కారణంగా, మీరు ఈ రోజు ఏ ముఖ్యమైన పనిని పూర్తి చేయలేరు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. కానీ ఏదైనా పెద్ద లావాదేవీలు చేయడానికి సమయం అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 5:40 నుండి 9:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ కోసం వెళ్ళవచ్చు. మీ ప్రియమైనవారితో కలిసి ఉండటం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది. పని విషయంలో కొన్ని కచ్చితమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఉద్యోగులకు సాధారంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు ఆఫీసులో ఎక్కువ పని ఉన్నప్పటికీ, మీరు మీ పనులన్నీ పూర్తి బాధ్యతతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు చిన్న ప్రయోజనాలు పొందవచ్చు. ఈరోజు కుటుంబంతో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రత్యేక సమాచారాన్ని పొందుతారు. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. నేడు మీ సంపద లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మీకు ఆనందంగా ఉంటుంది. మీ మనస్సులో చాలాకాలంగా దాచుకున్న ఏదైనా కోరిక నెరవేరడంతో మీ ఆనందం పెరుగుతుంది. మీ బంధువుల నుండి శుభవార్త వినొచ్చు. ఇది ఇంట్లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6:25 నుండి రాత్రి 8:40 గంటల వరకు

English summary

Daily Horoscope January 3, 2020

For some zodiac signs, this day will bring a lot of happiness and for others, there will be difficulties. Therefore, it is essential for you to know what your stars have in store for you. Read on to know today's daily horoscope and put all your doubts to rest.
Story first published: Friday, January 3, 2020, 6:00 [IST]