Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శుక్రవారం మీ రాశిఫలాలు (31-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉంటారు. మీకు మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే తొందరపడకండి. బాగా ఆలోచించి.. అవసరమైతే మీ జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి. ఈ రోజు కెరీర్ పరంగా అద్భుతమైన రోజు అవుతుంది. మీ నిరంతర ప్రయత్నాల వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక విషయానికొస్తే ఈరోజు ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 7:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు.ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మరోవైపు ఈ రోజు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రేమలో ఉన్న జంటలు మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు సులభంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ ఆర్థిక ప్రయత్నాలు ఏవైనా విజయవంతమైతే, మీరు మంచి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో, మీరు మీ అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని పూర్తి చేయగలరు. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 రాత్రి 9 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొత్త ఒప్పందం గురించి మనసులో గందరగోళం ఉండవచ్చు. మీరు మంచి నిర్ణయం తీసుకోలేరు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. వైవాహిక జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే కొత్త వ్యాపార ప్రతిపాదనను పొందే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈరోజు ఇంటి వాతావరణం కూడా సరిగా ఉండదు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కుటుంబ పరంగా వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరితో నుండైనా మీరు అనసవరంగా గొడవ పడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి ఉదయం 10:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు వారితో ఎక్కువ సమయం గడపాలి.ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను నిర్వహించడంలో విజయవంతమవుతారు. ఆర్థిక పరంగా అకస్మాత్తుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఆలోచనాత్మకంగా అడుగు ముందుకు వేస్తే మీకు విజయం దక్కుతుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారి ఈరోజు ముఖ్యమైన పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈరోజు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీరు ఈరోజు కష్టపడి పని చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఓ తప్పుడు నిర్ణయం వల్ల మీరు నష్టపోవచ్చు. ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు కొంత లాభం పొందవచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు కనబడుతున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి పరస్పర అవగాహన కారణంగా, ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ప్రేమ విషయంలోనూ చాలా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం మరింత పెరుగుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అయితే అతిగా ఖర్చు చేస్తే మీరు ఇబ్బందుల్లోపడతారు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి 10 గంటల వరకు



Click it and Unblock the Notifications











