For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (04-01-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు మంచి ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఇప్పటివరకు ఉన్న విబేధాలను విస్మరించి ఆనందంగా గడుపుతారు. ఇలాంటి సానుకూల మార్పుల వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు కార్యాలయంలో సహోద్యోగులతో మీ వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని పంచుకోవడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీ సహోద్యోగులలో కొందరు ఈ పరిస్థితిని అడ్వాంటెజ్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యక్తిగతంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీ కుటుంబ సభ్యులతో మీరు కొంత సమయం సరాదాగా గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాలపై కుటుంబంలో గొడవ పడొచ్చు. చట్టపరమైన విషయాలలో కూడా ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనలు మీ మనస్సును ఇబ్బంది పెడతాయి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు బాగా కష్టపడతారు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. గతంలోని కొన్ని మధుర క్షణాలు మరోసారి మిమ్మల్ని సంతోషపరుస్తాయి. అయితే మీరు ఏదైనా చర్చల్లో పాల్గొంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజున ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోండి. ఈరోజు మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. దీని వల్ల మీరు శాంతిని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు గతాన్ని మరచిపోయి కొత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు రిలాక్స్ గా మరియు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. దీని వల్ల ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు లాభదాయకమైన ఒప్పందం చేసుకోవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే, మీరు సకాలంలో పరిష్కారం కనుగొనాలి. లేకపోతే మీరే ఆందోళన చెందుతారు. దీని వల్ల మీ ఆరోగ్యం కూడా దిగజారుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత మేరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. రొమాన్స్ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ భాగస్వామి లేదా మీ ప్రేమికుడు ఈరోజు అందమైన కోణంలో చూస్తారు. వారి ఆసక్తిని మరియు భావోద్వేగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 9 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడొచ్చు. అయితే సాయంత్రం నాటికి అది తగ్గిపోతుంది. వారి మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కొన్ని అందమైన మరియు ప్రత్యేకమైన ప్రణాళికలను చేయవచ్చు. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పని విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి. మీరు కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు మంచి మానసిక శాంతిని అనుభవిస్తారు. ఏదైనా సమస్య ఉంటే సహనంతో దాన్ని పరిష్కరిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులను అధిగమించగలుగుతారు. మీరు కుటుంబ సభ్యులతో వివాదం కలిగి ఉంటే, ఈ రోజు ఆ పరిస్థితిలో కొన్ని మార్పులు కూడా సాధ్యపడతాయి.ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వారి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీని వల్ల మీరు చాలా రిలాక్స్ అవుతారు. మీ మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది. మీ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియురాలితో రొమాంటిక్ క్యాండిల్లైట్ విందుకు వెళతారు. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. వివాదస్పద సమస్యలకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది మీకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనిని పొందుతారు. మరోవైపు ఉద్యోగులు, ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీకు ఆఫీసులో ప్రమోషన్ రావడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఈరోజు మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు వివాహం చేసుకున్న వారికి గొప్ప రోజు అవుతుంది. మీరు ఒకరికొకరు పూర్తిగా సహకరించుకుంటారు. ఈ రోజు మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసే ఉద్యోగి అని నిరూపించుకుంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది. అధిక ఒత్తిడి వల్ల మీ సానుకూల శక్తిని కూడా లాగేసుకుంటుంది. ఇది మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణించండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు పాత అప్పులను కూడా తిరిగి చెల్లించగలుగుతారు.మీ సీనియర్లు మీ పనితీరును బాగా ఆకట్టుకుంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. మీరు మీ ఇంట్లో వాదనలకు దూరంగా ఉండాలి. పని విషయంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ సీనియర్లు మీతో సరిగ్గా వ్యవహరించకపోవచ్చు. మరోవైపు, వ్యాపారవేత్తలు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

English summary

Daily Horoscope January 4, 2020

Read your daily horoscope to know what your fate is today. There will be ups and downs and therefore it is essential to know what the stars have in store for you. Know your opportunities and work on your weaknesses to make your life blissful. Read on to know more.
Story first published: Saturday, January 4, 2020, 6:00 [IST]