Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
బుధవారం మీ రాశిఫలాలు (08-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అలా ఉంటేనే మీరు ఎంత పెద్ద ఇబ్బంది నుండి అయినా తప్పించుకోవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరికీ సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. మీరు వ్యాపారవేత్త అయితే, ఈరోజు మీకు విజయం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ సమస్యను ఈరోజు ముగించవచ్చు. మీ ప్రియమైన వారితో సంబంధాలను మెరుగుపర్చడానికి బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు అన్ని పనులను ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేస్తారు. దీంతో మీరు రిలాక్స్ గా ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీరు దానితో ముందుకు సాగవచ్చు. ఈరోజు వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మంచిగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ప్రేమ విషయంలో ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు మరియు మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకండి. లేకపోతే మీరు మీ మానసిక శాంతిని కోల్పోతారు. మీ వ్యక్తిగత జీవితంలో పని వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు వ్యాపార భాగస్వామ్యం చేస్తే, మీరు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉంటాయి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు లభించదు. ఈ కారణంగా మనస్సు చాలా నిరుత్సాహపడుతుంది. మీ ప్రవర్తన మరియు ప్రసంగాన్ని సమతుల్యంగా ఉంచడం మంచిది. ప్రేమ విషయానికి సంబంధించి మీరు ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. మీరు కూడా వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు ఆచితూచి ఖర్చు చేయాలి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగానే పని కొనసాగిస్తే, త్వరలో మీరు కొంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మీరు మహిళా సభ్యుల నుండి ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రోజు మీరు మీ కుటుంబసభ్యులతో ఒక అందమైన రోజు గడుపుతారు. ఈ రోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ సీనియర్లు చాలా సంతోషిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పీచ్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు మౌనంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతుంది. కోపంగా ఉండకండి. తెలివిగా వ్యవహరించండి. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు అన్ని పనులను పూర్తి విశ్వాసంతో పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు కూడా ఈరోజు పూర్తవుతాయి. మీకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు అవుతుంది. మీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కొంచెం కఠినంగా ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆస్తిని కొనాలనుకుంటే లేదా దానిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, అప్పుడు ఒక అడ్డంకి రావచ్చు. చాలా కాలం తరువాత, ఈ రోజు స్నేహితులతో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు మరియు చాలా ఆనందించండి. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు. భవిష్యత్తులో మీరు సరైన ఫలితాలను పొందవచ్చు. మీరు మీ భావాలను ఎవరితో అయినా బహిరంగంగా పంచుకుంటారు. ఈ రోజు ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు పెద్ద వివాదం ఉండవచ్చు. మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవాలి. ఈరోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు విద్యార్థి అయితే, మీకు చదువుపై ఏకాగ్రత కుదరకపోతే, మీరు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకండి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 4:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితలు ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా విలువైన బహుమతిని కొనుగోలు చేయవచ్చు.ఈరోజు ఏదైనా సమస్య ఉంటే ప్రశాంతమైన మనసుతో మీరు ఆ సమస్యను పరిష్కరించవచ్చు. ఈరోజు జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు



Click it and Unblock the Notifications
