For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (15-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 15, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Rangam bhavishyavani 2020 : కరోనా గురించి అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనా గురించి అమ్మవారు ఏమి చెప్పారంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు పనులన్నీ ప్రణాళికతో చేస్తే, అన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీరు వ్యాపారాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు సానుకూలత మరియు విశ్వాసంతో నిండి ఉంటారు. ఈ రోజు మీకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా, అన్నింటినీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు ప్రశాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మద్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. దీని వల్ల మీకు గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, మీ మంచి పనితీరు కారణంగా మీరు కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. ఈ రోజు మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఒత్తిడి తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈరోజు మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం విషయాలలో అతి విశ్వాసం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, మీకు వారితో ఎక్కువ సమయం గడపడానికి ఎక్కువ అవకాశం లభించదు.ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అనేక సవాళ్లు ఎదురవుతాయి. అయితే వీటన్నింటిని సానుకూలంగా మరియు విశ్వాసంతో ఎదుర్కొంటారు. పని విషయంలో ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు ఓ చిన్న ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత విషయానికొస్తే.. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చివరికి మీరు విజయం సాధిస్తారు. వ్యాపారులు తమ ప్రణాళికలపై చాలా శ్రద్ధ వహించాలి. మీ ఇంటి శాంతిని కాపాడటానికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవలసి ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 3:50 నుండి ఉదయం 4:10 వరకే

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం ప్రేమను పెంచుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఈ రోజు మీ ప్రియమైనవారితో శృంగార సమయాన్ని కూడా గడుపుతారు. పని విషయంలో ఈరోజు ఉత్సాహంగా చూపుతారు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా భావోద్వేగాలకు లోనవుతారు. మీరు ప్రతికూలతను కూడా ఎదుర్కోవచ్చు. అయితే మీరు అన్ని అడ్డంకులను అధిగమించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల సహాయం వల్ల మీరు పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారులతో సానుకూలంగా వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఉంటే, మీరు వారి సహాయం తీసుకోవాలి. వ్యాపారులు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు మీకు లాభం పొందడానికి ఏదైనా అవకాశం వస్తే, అప్పుడు మీ నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవాలి. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు ఏవైనా అడ్డంకులు ఉంటే, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు ఈరోజు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో విభేదాలు నివారించాలి. మరోవైపు ఈరోజు వ్యాపారులకు ఈరోజు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బు గురించి రిలాక్స్ అవుతారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 15, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Tuesday, July 14, 2020, 20:20 [IST]
Desktop Bottom Promotion