For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (21-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 21, 2020
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు మీరు సానుకూలంగా మరియు శక్తివంతంగా ఉంటారు. చాలా కొత్త ఆలోచనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే మీరు చాలా తెలివిగా, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. అంతేకాదు, మీకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. వ్యాపారులు భాగస్వామితో వ్యాపారం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల నుండి మెప్పు పొందడానికి, మీ వంతు ప్రయత్నం చేయాలి. అయితే అంతకంటే ముందు, ఈ రోజు మీకు అప్పగించిన ఏ బాధ్యత అయినా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఇది ఖచ్చితంగా మీ అధికారులను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీకు త్వరలో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, విజయం సాధించడం అనేది కష్టమవుతుంది. అయితే మీరు జీవితంలో ప్రతిదీ మెరుగ్గా చేయగలుగుతారు. మీ ముఖ్యమైన పనులు పెండింగులో పడిపోతాయి. వ్యాపారులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన వాటిపై సంతకం చేసే ముందు, మీరు ప్రతిదీ జాగ్రత్తగా చదవాలి. లేదంటే మీరు ఈరోజు మోసపోయే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో నిరాశ చెందుతారు. అయితే, మీరు ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా తాత్కాలికమే. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు పని చేసే చోట పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు పురోగతి లభించవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరమైన రోజు అవుతుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు వ్యాపారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు. మీరు విద్యార్థి అయితే, అధ్యయనాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు మీ పెద్దలు, స్నేహితులు లేదా గురువుల సహాయం తీసుకోవచ్చు. ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సరైన ఫలితాలను పొందుతారు. కొన్ని కారణాల వల్ల మీ ముఖ్యమైన పని మధ్యలో ఆగిపోయి ఉంటే, అది ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు వ్యాపారంలో పెట్టుబడిని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు మీరు మంచి అవకాశాన్ని పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ సీనియర్ అధికారుల కోపాన్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. మీకు వ్యాపారం కొనసాగించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు అవుతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుది. మీరు ఉదయాన్నే ఏదైనా శుభవార్త వింటారు. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా సమయం గడుపుతారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా మీరు పనిలో చాలా బిజీ అవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసరంగా ఖర్చులను చేయడం మానుకోండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. అయితే పనికి రాని విషయాల గురించి ఆలోచిస్తే, మీరు తప్పుడు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులు కూడా ఈరోజు చాలా నిరాశ చెందుతారు. ఇది మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో, మీరు ధైర్యంగా పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. బంధువులతో మీ సంబంధం బాగుంటుంది. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు పొందిన తర్వాత మీకు బాగా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచి రోజు కాదు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 6:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగం కోసం మీరు చేసే అన్వేషణ, ముగిసిపోయే అవకాశం ఉంది. మీరు ఇటీవల ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ చేసి ఉంటే, అక్కడ నుండి మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబంతో చాలా ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:35 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అపొహలు తొలగిపోతాయి. మీరు ఈరోజును ఆస్వాదించేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు పని చేయడంలో వేరే ఆనందం పొందుతారు. ఈ రోజు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు పూర్తి ధైర్యంగా పని చేస్తారు. ఉద్యోగులు ఈరోజు ఏదైనా పనిని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, మీరు కచ్చితంగా మీ కృషికి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 21, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, July 20, 2020, 19:37 [IST]
Desktop Bottom Promotion