For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం దినఫలాలు : ఈ రాశుల ఉద్యోగులకు పురోగతి ఉంటుంది...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఆషాఢ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mars Transit in Leo On 20 July: సింహ రాశిలోకి అంగారకుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!Mars Transit in Leo On 20 July: సింహ రాశిలోకి అంగారకుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది తాత్కాలికంగా ఉంటుంది కాబట్టి, మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సానుకూలంగా ఉండండి. మీ పనిని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించండి. కార్యాలయంలోని సీనియర్ అధికారులతో విభేదాలను నివారించాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పత్రాలలో సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటులో సంతకాలు చేయకండి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవంగా చూడాలి. మీ ప్రియమైన వారిని విస్మరించడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అకౌంటింగ్‌లో పూర్తి పారదర్శకతను కలిగి ఉండాలి. లేకపోతే ఈరోజు చాలా కష్టంగా మారుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్న సీనియర్ అధికారుల నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నించాలి. పని పట్ల మీ అజాగ్రత్త మీ పురోగతిని ఆపగలదు. మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

Planets Retrograde :ఒకే రాశిలో శుక్రుడు, గురుడి సంచారం... ఈ రాశుల వారు జర భద్రం...!Planets Retrograde :ఒకే రాశిలో శుక్రుడు, గురుడి సంచారం... ఈ రాశుల వారు జర భద్రం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మాత్రమే కాదు, మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఒక పెద్ద ఆర్డర్ రావొచ్చు. ఇది మీపై చాలా బాధ్యతలను పెంచుతుంది. మీ పనిని పూర్తి కృషితో, నిజాయితీతో చేయడం మంచిది. అలాగే మీరు సమయాన్ని ట్రాక్ చేయాలి. మీ ప్రియమైన వారితో ఈరోజు కొన్ని గొడవలు పడొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీరు పదోన్నతి పొందొచ్చు. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఈరోజు మంచి అవకాశాలు రావొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే.. సరైన సలహా తీసుకుని ముందుకు వెళ్లండి. ఈరోజు మీరు చాలా ఓపికగా పని చేయాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 1:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు అకస్మాత్తుగా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మీకు అవసరమైన అన్ని పత్రాలను మీ వద్ద ఉంచుకుంటే మంచిది. లేకపోతే మీ ఈ ప్రయాణం వల్ల మీ సమయం మరియు డబ్బు వృధా అవుతుంది. అమ్మకాలు మరియు మార్కెటింగ్‌కు సంబంధించి పనిచేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ తండ్రి నుండి మంచి బహుమతిని పొందవచ్చు. మీ తల్లిదండ్రులతో అద్భుతమైన సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆందోళన లేకుండా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వ్యాపారులు తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. మీరు ఈరోజు ప్రణాళిక ప్రకారం పని చేయడం మంచిది. లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరులో కొంత క్షీణత ఉండొచ్చు. ఈ సమయం మీకు చాలా ముఖ్యం, కాబట్టి దాన్ని బాగా ఉపయోగించుకోండి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. మీరు చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. ఇది మీ ఇంటి శాంతిని కాపాడుతుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు అవసరమైన వస్తువులకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఈరోజు ఆర్థిక పరమైన లాభాలను పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి పనిచేసే వ్యక్తులు కూడా ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి చెందకపోతే మరియు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు కొత్త ఉద్యోగం కోసం వెతకడం మంచి రోజు. బ్యాంకింగ్ రంగంతో సంబంధం ఉన్న ప్రజలకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. బాధ్యతల భారం మీపై పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ వివాహ జీవితంలో ఒక అందమైన మలుపు ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీరు మీ పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇంటి సభ్యులను విస్మరించవద్దు. మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు ప్రశాంతమైన మనస్సుతో మరియు అవగాహనతో ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీరు మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా మాట్లాడితే మంచిది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను ఇచ్చే రోజు అవుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొన్ని ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని మార్పులొస్తాయి. ఈ మార్పులు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు వారి కృషి వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యాపార వ్యక్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మంచి అవకాశం పొందుతారు. ఈరోజు మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కూడా దక్కొచ్చు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, జనరల్ స్టోర్, కిరాణా మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు మంచి లాభాలను ఆర్జించవచ్చు. మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మాతృదేవత ఆరాధనతో రోజు ప్రారంభించండి. స్వీట్లు దానం చేయడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ పెండింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చు. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన బాగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి మీ నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో పని చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈరోజు మీ పని ఏదైనా మధ్యలో చిక్కుకుపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీరు మీ ప్రియమైనవారి కోసం షాపింగ్ చేయాలనుకుంటే, ఈరోజు దీనికి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 21, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Wednesday, July 21, 2021, 5:00 [IST]