మంగళవారం మీ రాశిఫలాలు (09-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఇబ్బంది ఉండొచ్చు. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే మీరు దీన్ని అధిగమించి పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో అదనపు పని భారం ఉంటుంది. మీరు అదనపు సమయం కేటాయించి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు. అయితే మీరు తొందరపడకూడదు. వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. మరోవైపు కుటుంబంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ప్రేమ మరియు మద్దతు వల్ల ఉపశమనం లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే, మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఈ రోజు వ్యాపారులకు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు, మీరు కొంతమంది కష్టపడి పనిచేసే, నమ్మకమైన వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు ఒత్తిడిని వదిలించుకోవడానికి మీ ప్రియమైనవారిలో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ప్రేమ జీవిత భాగస్వామితో సంబంధంలో ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఉండటం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చేసే పని గురించే చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. అయితే కష్టమైన పనిని పూర్తి చేసేందుకు మీరు సహోద్యోగుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద నష్టాలనే ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పాత అప్పులను చెల్లించగలుగుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీకు సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా సమస్యలు తొలగిపోవచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో సకాలంలో పనిని పూర్తి చేస్తే, మీరు కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు ఈరోజు ఒక సువర్ణాకాశం పొందవచ్చు. కుటుంబ జీవితంలో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఖర్చులుంటాయి. మీరు జేబుపై నిఘా ఎక్కువగా ఉంచాలి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే అనుభవదారుల నుండి సలహాలు తీసుకోవాలి. ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మరోవైపు, ఈ సమయంలో మీరు మీ పిల్లల విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు మెరుగుదల ఉంటుంది. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఈరోజు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. పొదుపుపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈరోజు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. లగ్జరీ కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేయకుండా ఉండాలి. మీ ఆదాయంం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలంటే పొదుపుపై ​​దృష్టి పెట్టాలి. ఉద్యోగులు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో పవిత్రంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే, మీరు చేసే ప్రయత్నాలలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండే వారికి పురోగతి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో కోపం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు ఈరోజు మీరు చాలా సహనంతో వ్యవహరించాలి. ఈరోజు శ్రామిక ప్రజలకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ఎలాంటి విషయంలో ఒత్తడి ఎక్కువగా తీసుకోకూడదు. ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీకు అకస్మాత్తుగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు పని సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రతికూల పరిస్థితులలోనూ శ్రద్ధగా పని చేయగలరు. మీరు పనిలో మంచి విజయం సాధించవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఏదైనా ఆర్థిక ప్రయత్నాలు చేస్తుంటే, మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నిరాశ చెందకుండా పని చేస్తే, కచ్చితంగా ఫలితం ఉంటుంది. మీ ఆర్థిక పరమైన సమస్య పరిష్కరించబడుతుంది. మీ వైవాహిక జీవితంలో కొంత టెన్షన్ ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు మీరు ఈరోజు చేసే పనిపై కూడా ఎక్కువగా శ్రద్ధ వహించాలి. లేదంటే మీరే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి సాయంత్రం 3:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు కొత్త శక్తిని కూడా అనుభవిస్తారు. ఉద్యోగులు ఈరోజు ఉత్తమ పనితీరుతో సీనియర్ అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొన్ని మంచి ఆఫర్లను పొందే అవకాశం ఉంది. అయితే మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే, మీకు త్వరలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి 11 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, June 9, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion